Muti; Mag seri

I)

1) jem | pw £3 3 3 zm :3 :3 m3 ws] ba] = 44 o] a 24 3 24 2 4

Wau

eu

aan

'మద్లైమాల' రామాయణం

ప్రచురణ :

మల్లెమాల ప్రచురణలు, హైదరాబాద్‌.

ప్రథమ ముద్రణ - 2005 ప్రతులు : పదివేలు

శెల : రూ.250/- US$ 20

© సర్వహక్కులు రచయితవి

ప్రచురణ :

మల్లెమాల ప్రచురణలు, హైదరాబాద్‌.

(ప్రతులకు :

మల్లెమాల ప్రచురణలు

శబ్దాలయ, ఎల్‌.వి.ప్రసాద్‌ మార్ల్‌, బంజారా హిల్స్‌, హైదరాబాద్‌ - 34 ఫోన్‌ : 040 - 23547637

ముఖచిత్రం :

శ్రీ యం.ఎఏ. సుభాన్‌ మరియు

స్పెక్టమ్‌ గ్రాఫిక్‌ స్టూడియో, చెన్నై - 17 ఫోన్‌: 044-28142708

రేఖాచిత్రాలు : ఆనంద్‌ ఎ.వి.భి.యస్‌.

డి.టి.పి. :

యస్‌. అజీమ్‌

ముద్రణ : అనువమ (ప్రింటర్స్‌, 126, శాంతినగర్‌, హైదరాబాద్‌ - 28 ఫోన్‌ : 23391364

అంకిత కుసునూలు

చిన్ననాటి నుండి శ్రీరామ! నన్ను నీ కన్నబిడ్డలీల కాచినావు! ఇంతచేసినందు కేమీయలేక, నీ

కథను వ్రాసినాడ! కావ్యముగను.

౧m

కృతజ్ఞతాండజలి

జి. పుల్లారెడ్డి - వారి సతీమణి

పిలువకయెపల్సి వచ్చి నా తలుపు తట్టి మించు భక్తిని నీవు రచించుచున్న

ఆలుమగలు దుఃఖమైన సంతసమైన కలసి పంచుకొనిన కాపురమ్ము నిత్య వైభవముల నిలయమై విలసిల్లు ప్రణయసాఖ్యమచట పరిధవిల్లు॥

కుఠలెకాల op]

మల్గెమాల రామాయణం

ముందుమాట

యావత్‌ స్థాస్యన్తి గిరయః సరితశ్చ మహీతలే, తావద్రామాయణ కథా లోకేషు ప్రచలిప్యతి,

“ఈ భూమండలం మీద పర్వతాలు నిలిచి ఉన్నంతకాలం, నదులు, (ప్రవహిస్తూన్నంత కాలం రామాయణ కథ (ప్రజల మనస్సులలో మెదలుతూ నాలుకలపై నర్తిస్తూ ఉంటుంది”.

వాల్మీకి రచించిన శ్రీమద్రామాయణాన్ని గూర్చీ, శ్రీరామ కథను గూర్చీ (బ్రహ్మదేవుడు కొన్ని వేల సంవత్సరాల [క్రితం చెప్పిన అమోఘ మైన జోస్యం ఇది. శ్రీ రామకథ, దానిలో సహజంగా ఉన్న లోక ప్రియత్వం చేతా, (బ్రహ్మదేవుని ఆశీస్సుచేతా భారతదేశంలోనే కాకుండా ఎన్నో ఇతర దేశాలలో కూడ అనేక మైన రూపాలు సంతరించుకుని కొన్ని వేల సంవత్సరాలనుంచి వ్యాప్తిలో ఉంది. కాంబోడియా నుంచి జావా వరకు ఉన్న దేశాలలో సాహిత్యంలోనే కాకుండా, నృత్యమూ, శిల్పమూ మొదలైనవాటిలో కూడ రామాయణ కథా (ప్రభావం కనబడుతూన్నది. భారతదేశంలో ఆసేతు హిమాచలం దీనికున్న (ప్రభావం సాటి లేనిది. ఎన్ని గుళ్ళో, ఎన్ని గోపురాలో, ఎన్ని శిల్పాలో! రామాయణ కథను స్ప శించని సాహిత్య (ప్రక్రియా భారతీయ భాషలలో, దేనిలోనూ లేదు. సాహిత్య భాషలుగా అభివృద్ధి చెందని యా ప్రాంతీయ భాషలలో కూడ జానపదగీతాలలోనూ, నృత్యాలలోనూ, కథాకథనాలలోను ఇది చోటు చేసికొన్నది.

దాదాపు పది పన్నెండు వందల సంవత్సరాలకు పూర్వంనుండి సాహిత్య భాషగా వికసించిన తెలుగులో రామాయణకథా సంబంధంలేని సాహిత్య (ప్రక్రియ లేదు.

ఇరవై యొకటవ శతాబ్దం (ప్రథమ వర్ష పంచకంలో మల్లెమాలవారు తెలుగు వారికి అందించిన అపూర్వమూ అసాధారణమూ అయిన సాటి లేని సువర్ణోపాయనం మల్లెమాల రామాయణం. ఇలాంటి అత్యద్భుతమైన, ఆనందఘనమైన (ఆనందపు ముద్ద యెన) ఉపాయనాన్ని నికబభవిష్యత్తులో, రాబోయే నాలుగైదు శతాబ్దాల కాలంలో, ఎవరైనా తెలుగు జాతికి అందించ కలుగుతారా అనేది సందేహాస్పదం. ఇలా అన్నంత మాత్రాన సరిపోదు. ఇలాంటి సందేహం కలగడానికి కారణం ఏమిటో కూడ చెప్పవలసి ఉంటుంది. అదేదో చూర్గాం -

ఇదొక మహాకావ్యం. ఒక మహాకావ్యం వ్రాయాలంటే అండుకు తగిన సాధన సామగ్రి పుష్కలంగా ఉండాలి. దానిని తగిన రీతిలో వినియోగించు కోవాలి. అప్పుడే అది మహాకావ్యం అనిపించుకొంటుంది. ఇది రామాయణానువాదం కాదు; రామాయణాన్ని ఆధారంగా తీసికొని రచించిన ఒక స్వతంత్ర మహాకావ్యం.

wat ఆవిర్భావం ఒక విశిష్టమైన రీతిలో జరిగిం దనే విషయం కవియే వినయాంజలిల్‌' తెలిపి ఉన్నారు. రెండు కావ్యాలు కరుణ నుండే పుట్టాయి. పక్షుల శోకాన్ని చూడగా కలిగిన మానసిక వేదననుండి ఆనాటి రామాయణం ఆవిర్భవిస్తే

ii మల్లెమాల రామాయణం

భారతమాత దీనావస్థ చూడగా కలిగిన మానసిక సంక్షోభం నుండి కావ్యం పుట్టింది. విధంగా “శోకత్వ మాపద్యత యస్య శోక” అని కాళిదాసూ, మాటలే అనువదిస్తూ “శోక, శ్లోకత్వమాగతః” అని ఆనందవర్దనుడూ (ధ్వన్యాలోకంలో) చెప్పి నట్లు రెండు చోట్లా శోకమే శ్లోకంగా మారింది.

చక్కని బుద్దిబలం ఉంటే చాలు, శాస్త్రాలు అధ్యయనం చేయవచ్చు. సాంకేతిక విద్యలను వశం చేసికొనవచ్చు. కాని, ఉత్తమ మైన కావ్యం రచించా లంటే బుద్దిబలంతో పాటు (ప్రతిభ కూడా ఉండాలి. (ప్రతిభా విహీనుడైన కవి రచించిన కావ్యం ప్రభావిహీనంగా ఉంటుంది. అలాంటిది పద్యబద్దమైనా, మరే రూపంలో ఉన్నా కావ్యమే కాదని ఆలంకారికుల నిర్ణయం.

సహజమైన (ప్రతిభ ఉన్నవాడే సహజకవి అవుతాడు. మల్లైమాలవారి (ప్రతిభావిశేషం కావ్యంలో అడు గడుగునా స్పష్టంగా (ప్రతిఫలిస్తూ ఉంటుంది. దీనికి తోడు విసృత మైన లోకజ్ఞానం, అసాధారణమైన మేధాశక్తి, అనగా ఎన్నో (ప్రాచీన Sg ఆధునిక కావ్యాలనుంచీ వందలకొలది పద్యాలను ధరించగలిగిన ధారణాశక్తీ, మానవతాదృష్టీ ఇవన్నీ కూడ కలిసి సుమనోహర కావ్య రూపాన్ని ధరించాయి.

వాల్మీకి రామాయణం, మొదటినుండి చివరిదాకా, అతి మనోహరంగానూ లయాత్మకంగానూ నడుస్తుంది. మల్లెమాల రామాయణం కూడా వినగానే అర్థం అవడం అనే ప్రసాద గుణంతో, సద్యోభావానుభూతిని కలిగించే (ద్రాక్షాపాకంతో, వైదర్శీ శైలిలో, మృదువైన పదాల గుంఫనంతో నడిచింది. వెదకి చూచినా ఒక్క వ్యర్థపదం కనపడదు. మచ్చున కొక్కపద్యం;

సీతారాములు గోదావరీ తీరాన కూర్చుని ఉన్నప్పుడు రాముడు సీతతో

అన్నమాట లివి : సీ. చిగురెండ ఒడిలోన సిరిమల్లె నవ్విన

కనుపించు వెలుగులో కలవు నీవు

చిరుగాలి కెరటాలు వరివెన్ను నూపిన

మొలకెత్తు కులుకులో కలవు నీవు

నీలిమబ్బును గాంచి నెమలి నర్తించిన

కదలాడు హొయలులో కలవు నీవు

నెలవంక స్పర్శతో సెలయేరు పొంగిన

చెలరేగు నురుగులో కలవు నీవు తే, ఇచ్చ టచ్చటి అననేల నీ విశాల

విశ్వమందున చైతన్య విలసితమ్ము

లైన ప్రతృంశమందు ప్రత్యణువునందు

కంటి కగుపించు కమ్మని కలవు నీవు. (అరణ్య కాం. 233)

అలతి అలతి తెలుగు నుడులతో కవితామతల్లీకి సొబగులు దిద్దగలిగిన కవి లేఖిని (ప్రాఢవాగ్గుంభనలు కూడ కలిపి ఆమెను ఎట్లు సంభావింపగలదో చూడండి...

మల్లెమాల రామాయణం iii చ. అరుణమయూఖ మాలికల నల్లన విచ్చిన కన్నె తామరల్‌ గరువపు వానజల్లులకు గంతులు వేయుచు నాడుబేడిసల్‌ మురిపెము లొల్ముచున్‌ భువన మోహనకాంతులు గ్రుమ్మరించు నీ స్గురిత విశాల నీల నవసుందర బంధుర దివ్య నేత్రముల్‌.

(అరణ్య కాం. కాం. 232)

ఇలాంటి అలంకారాలు కావ్యం నిండా రత్నదీపాలలా మనకు దర్శన మిస్తాయి. నిజానికి కావ్యానికి ఆయువుపట్టు వ(క్రోక్తి. దీనిలో అనేక భేదాలున్నాయి. వాటిలో ప్రధానమైన రెండు రకాల వ(క్రతలు మహాకావ్యంలో ప్రారంభంనుంచి చివరిదాకా కనపడతాయి - అవి ఉపచార వ(క్రత, ప్రకరణ వ(క్రత అనేవి. ఉపచార వ(క్రతను ప్రభావజనకంగా ఉపయోగించడంలో మల్లెమాలవారు సిద్ధహస్తులు.

అచేతనాన్ని చేతనంగాను, అమూర్తాన్ని మూర్తంగాను చిత్రించడం ఉపచార వక్రత. కొన్ని ఉదాహరణలను రుచిచూద్దాం -

ఆకారంలేని రౌద్రాన్ని సాకారమైన మహాసర్సంగా భావించి అది పరశురాముని కళ్ళల్లో నుండి బుసకొట్టుతూన్నదని వర్ణించాడు కవి (అయోధ్యాకాండ 21). అలాగీ అయోధ్యాకాండం 311వ పద్యంలో దశరథుని గతాన్ని కూడా మహా సర్బంగా చిత్రిస్తూ “కాటువేయగ నున్నది గతము నన్ను” అంటాడు.

మరొక ఉదాహరణ : శ్రీరాముని దర్శనభాగ్యం కోసం యెన్నో యేండ్లుగా యెదురు చూస్తున్న శబరి...

చాల యేండ్లనుండి చర్మచక్షువులతో

నిన్ను గాంచవలయునన్న అశ

పండుటాకు మేన ప్రాణాలు నిలిపెను

ఎపుడు కనికరింతువీవు తండ్రి .

అని రాముని ప్రార్థిస్తూ ఉంటుంది. అదే సమయానికి లక్ష్మణ సమేతుడై అక్కడికి వచ్చిన శ్రీరాముడు భక్తిపారవశ్యంలో మునిగియున్న శబరిని చూసి అమృత తుల్యమైన వాక్కుతో శబరీ అని పిలుస్తాడు. పిలుపు శబరికి మేలుకొలుపయిందంటారు మల్లెమాల.

పిలుపు మేలుకొలుపై

దాపున వేంచేసియున్న దశరథరామ

క్ష్మాపతిగని యోగిని

నావున్షైెము నడచివచ్చినదియని తలచెన్‌. పిలుపే మేలుకొలుపు. ఇదొక వక్రత. పుణ్యం నడిచివచ్చిందనడం మరొక వక్రత. ఇలాంటి చిత్రీకరణలు మరికొన్ని చవిచూడాలంటే అరణ్యకాండములోని 141, 150, 189, 203, 475 పద్యాలను తిలకించండి.

కిష్కంధకాండలో వాలి తారతో ఇలా అంటాడు.

భీరు వన్షమాట వీరుని చెవిసోక

వెరచు నన్న సత్య మెరుగుమీవు!

అనికి జంకి నేనె వెనుకంజ వేసిన

గుండె పగిలి చచ్చ భండనమ్ము. అత్యద్భుతమైన వక్రోక్తి. ఇలాంటి సహృదయ (గ్రాహ్యాలైన మధురోక్తులు మహాకావ్యంలో కోకొల్లలుగా మనకు దర్శనమిస్తాయి. లోకప్రసిద్దమైన వాల్మీకి రామాయణంలోని జౌచిత్యానికి భంగం కలుగకుండా, మల్లెమాలవారు రామాయణం లో సహజ సుందరంగా చేసిన మార్పులు వారి అద్భుత కల్చ్పనాశక్తికి నిలువెత్తు సంకేతాలు.

చిత్రకూటంలో ఉన్న శ్రీరాముణ్ణ్లి తిరిగి అయోధ్యకు తోడ్కొని వెళ్ళడంకోసం భరతుడు సమస్త పరివారంతో అక్కడకు వస్తాడు. అందులో తల్లులు మువ్వురు కూడా ఉన్నారు. వారు ధరించి ఉన్న శ్వేతవస్తాల ద్వారా దశరథుని మరణవార్తను రాముడికి తెలియజేస్తాడు కవి. పద్యం పరికించండి.

శ్వేత వస్త్రాల మాటున చింతదాచి

తన్మయత్వములో మున్లి తన్నుజాచు

తల్లులను గాంచి రాముడు తండ్రి నాక

మునకు జనె నని దుఃఖాన మునిగిపోయె.

అలాగే, అదే సన్నివేశంలో పుత్రవ్యామోహంతో నీకు అపచారం చేశాను. నాయనా! నన్ను మన్నించు అంటుంది కైకేయి రామునితో. అందుకు సమాధానంగా శ్రీరాముడు

అడవులకు నన్న బంపించినందువలన

తాపసుల మధ్య జీవన తత్త్వ మెరిగి

నడచుకొనునట్టి భాగ్యము నాకు దక్కె

లోక కల్ళాణ ఫలితమ్ము నీకు దక్కె.” అంటాడు. ఇలాంటి ఉదాత్త భావాలు బుషితుల్యుడైన కవి నుండే జాలువారుతాయి.

అలాగే, సుందరకాండంలో హనుమంతుడికి అప్పుడప్పుడు అతని తోక సలహాలిస్తూ ఉంటుంది. ఇదొక చమత్కార కల్పన. అదే కాండంలో పార్వతీదేవి, బాలా రూపంలో హనుమంతునికి కర్తవ్యబోధ చేసి ఉత్సాహవర్హకమైన మాటలు చెపుతుంది. (సుం.కాం. 64-75).

పీతారామలక్ష్మణులు పంచవటిలో ఉన్నప్పుడు ఒక ఎలుగుబంటి పనసపండు తీసికొనివచ్చి ఉపాయనంగా ఇచ్చి వారిపట్ల పరమభక్తిని ప్రదర్శిస్తుంది. (అరణ్య.కాం. 183-189). అక్కడే మరొక ఘట్టంలో..

ఒక ఆవు అప్పుడే పుట్టిన దూడతో కూడ వచ్చి సీతారాములకు సేవచేస్తూ అక్కడే ఉండిపోతుంది. ఆవును, దూడను వెతుక్కుంటూ వచ్చిన గొల్ల తల్లి,

మల్లెమాల రామాయణం

బిడ్డను శ్రీరాముని సన్నిధిలో చూసి మురిసిపోతాడు. ఇది అత్యంత సుందరమైన ఘట్టం.

ఘట్టంలో కవి, పల్లె జీవితం మీద తనకున్న అభిమానాన్ని, గొల్లవాని నిష్కపటమైన హృదయాన్ని, వానిపై సతారాములు చూపిన అవ్యాజమైన అనురాగాన్ని అత్యద్భుతంగా చిత్రించి మనం కోల్పోయిన మానవతానుబంధాలను పునరుద్దరించు కోవలసిన అవసరాన్ని సూచించాడు. ఇవన్నీ విశిష్టమైన కల్పనలు.

మారీచుడు మాయలేడిగా మారి సీతాపహరణానికి తోడ్సడ్డాడన్న బాధతో అరణ్యంలోని జింకలన్నీ సీతామాతను అపహరించిన దుర్మార్గుడు దిక్కుగా వెళ్ళాడని శ్రీరామునకు సూచిస్తూ, అన్నదమ్ములిద్దరినీ తమ వెంట తీసుకొనిపోయి, జటాయువు కొన ఊపిరితో పడి ఉన్న చోటు చూపిస్తాయి. జటాయువు సీతను రావణుడు అపహరించి తీసుకువెళ్ళాడని చెప్పి ప్రాణం వదులుతాడు. ఆయాచితంగా జింకలందించిన సహాయానికి ముగ్గుడైన శ్రీరాముడు తానూ అయాచితంగానే వాటికొక వరమిస్తాడు. వరం పద్యరూపంలో ఇలా సాగుతుంది -

“అడవి తల్లి కిలను ఆయువుండెడుదాక

ఉదధులందు నీరముండు దాక

మేను వీడి గూడ మీ దివ్య చర్మముల్‌

యతుల కాసనమ్ము లగును గాక!” ఎంత అందమైన ఊహ.

ఇహ వర్లనలు - వస్తువైనా, సంఘటననైనా కళ్ళకు కట్టినట్టు వర్ణించడం మల్లెమాల వారిలో ఉన్న ఒకానొక అనితర సాధ్యమైన సహజ చాతుర్యం. అలా వర్లనలు మహాకావ్యంలో అడుగడుగునా డర్భనమిస్తాయి. వర్ల! చదువుతున్నంత సేపూ, పఠిత (ప్రపంచాన్ని పూర్తిగా మరచి, అలౌకికమైన ఆనందాన్ని పొందుతాడు. రసానుభూతికి తార్కాణంగా ఒకటి రెండు ఉదాహరణలైనా చవిచూపించకపోతే కావ్యానికది అసంపూర్ణ పరిచయమే అవుతుంది.

అత్రిమహాముని ఆశ్రమంలో సీతారాములు (ప్రవేశిస్తారు. అనసూయ సీతను లోనికి తీసికొనివెళ్ళి ఆమెను ఆవరించి, నీ కల్యాణ వృత్తాంతం చెప్పమని కోరుతుంది. అంతే! మైథిలి ఊహలు మిథిలలోని కల్యాణమండపానికి వెళ్ళిపాయ్యాయి. తన్మయిత్వంలో శ్రీరాముడు శివధనుర్భంగము గావించిన ఘట్టాన్ని సీత అనసూయతో ఇలా వివరిస్తుంది. ధనుర్భంగ దృశ్యాన్ని సీత చూడలేదు. చెలికత్తె ద్వారా తెలుసుకొని పులకించి పోతుంది. ఇంతకూ చెలికత్తె సీతతో ఏమి చెప్పింది. ఇదిగో... ఇలా చెప్పింది... సీ. జనకు డచ్చెరువంద ధనువు ఛేదించిన

రాకుమారుని పేరు రాము డనుచు

అతని నేత్రద్వయ మృప్పడే విరిసిన

రమ్మరాజీవ పత్రమ్ము లనుచు

ఆతని ముద్దుమో మన్ని వేకలయందు

వెలుగు లీనెడు చంద్రబింబ మనుచు

vi మల్గెమాల రామాయణం

అతని వక్షః స్థల మృతిలోక సౌందర్య మునకు కాణాచియమై దనరు ననుచు ఆ. ఆచితూచి యాత డాడెడు మాటలు కండచక్కెరంత కమ్మ ననుచు చెప్పి చెప్పి నన్ను చెలికత్తె మధురోహ లందు దేలియాడు నటు లొనర్జె. ఊహలేమిటో చూద్దాం... పున్నమ జాబిల్లి పుడమికి దిగివచ్చి పులకింత లెదపైన చిలికినట్టు శక్రకోదండము సారెసారెకు వంగి చెవిలోన గుసగుసల్‌ చెప్పినట్లు తెలిమబ్బు కన్షియల్‌ తేరులో అరుదెంచి తుంపురుల్‌ నిలువెల్ల తురిమినట్లు మండువేసవిలోన మంచి గంధపు వాన కుండపోతగ పైన కురిసినట్లు తే. మానసమునందు అవ్యక్తమధురమైన ప్రణయ భావతరంగముల్‌ పర్వ లెత్తె ఆగలేనని వరమాల వేగిరముగ రామభద్రుని కంఠ మలంకరించె.

2

తన్మయత్వంతో తాను అతిగా మాట్లాడినానేమో అన్న శంక సీతకు కలిగింది. అందుకు అనసూయను మన్నింపు కోరింది. అలా చెప్పినందుకు అనసూయ సీతను అభినంందించి నా ముసలిమనసుకు మధువు బూసినావమ్మా అనింది... ఎంత సున్నితమైన భావాన్నయినా చిన్న చిన్న మాటలతో ఇంత మనోహరంగా ఆవిష్కరించడం మల్లెమాలకు తప్ప మరొకరికి సాధ్యం కాదని నా అభిప్రాయం. హేమంత బుతు వర్ణనం అడుగడుగునా వక్రోక్తులతో ఎంత అద్భుతంగా సాగిందో గమనించండి... సీ, మధ్యాహ్న సూర్ముడు మబ్బులు నేసిన

దుష్టటి నొంటిపై గప్పకొనియె!

అగ్నిదేవుడు తన్ను ఆవహించిన చలిన్‌

ముదమార గుండెల కదుముకొనియె!

చెంగు చెంగున గెంతు జింకలు పాొదరిండ్ల

దూరి పూదుస్తులు దొడుగుకొనియె

కొదమ సింగమ్ములు గుహల కౌగిళులందు

మదన తాపమ్ముతో ఒదిగిపోయె!

మల్లెమాల రామాయణం vii

పచ్చపచ్చని పచ్చిక బయకళులన్ని

మంచు మైదానముల రీతి మారిపోయి పడుచుగాలులు పారలాడు పాన్గులాయె! అతులితమ్మౌర? హేమంత బుతువు మహిమ.

రావణాసుర వర్ణనం...

మ.

లై

అది లంకేశుని కొల్వుకూట మడుగో! అగ్రాసనాసీనుడై

గదపై దక్షిణ హస్తముంచి సురలున్‌, గంధర్వులున్‌, కిన్షరుల్‌ బెదరన్‌ తమ్ములు, మంత్రులున్‌, బుధవరుల్‌ వేష్టింప ముక్కంటియే సదనమ్మందున నిల్చి చర్చలను తా సాగించున ట్లొప్పెడిన్‌.

కను లెర్రజేసెనా? కాలచక్ర మ్మాగి తలవంచి జోహారు సలిపి తీరు! గదను పైకెత్తెనా? గడగడ వణకుచు మరణదేవత జంకి శరణు గోరు పంచాక్షరీ మంత్ర పఠనమ్ము జేసెనా? కైలాస శిఖరమే కదలియాడు

సకల శాస్త్ర పురాణ చర్చసాగించెనా? వేదముల్‌ చెవియొర్గి విన దొడంగు ఇన్ని యోగ్యత లర్హత లున్న వీరు

డెవ్వ డీరేడులోకాల నెరుగ జెప్ప మనుచు నే రాయి నడిగిన క్షణమ్మె అసుర విభుడైన రావణుం డని వచించు.

వర్ల్షబుతు వర్తన... 0 mm

సీ,

ఉత్తుంగ శిఖరాలనుండి జారెడు జల ధారలు ముత్యాల దండలాయె! నిండార పండిన నేరేడు పండులు కదలికల్లేని భృంగమ్ము లాయె! జలభారమున గిరి తలలపై వాలిన

కరి మబ్బు లున్మ్నత్త గజములాయె! గొంతెండి పోయిన గురుసైకతమ్ములు పొంగిన చన్నీటి బుగ్గలాయె! మెల్లమెల్లగ సాగెడు పిల్లకాల్వ

లెల్ల హోరెత్తి పరువెత్తు యేరులాయె! రాత్రి పవలును మొగలి సౌరభము గ్రోలి వర్షబుతువంత పరిమళ భరిత మాయె. (క8.కాం.133)

viii మల్గెమాల రామాయణం

అలాంటి వర్షబుతువులో వియోగీ,' యోగీ అయిన రామసు(గ్రీవులు ఎలా ఉన్నారో పరికించండి - భార్యా వియోగపు బాధతో రాముడు గడియనే దినముగా గడపె నిచట! కలికిపర్యంకమే గద్దెగా కపిరాజు బుతువొక్క గడియగా బ్రతికె నచట నిద్రకన్షెరుగక నిరతమ్ము రాముడు కాంత దిగులుతోనె గడపె నిచట! నిద్రలో సైతమా భద్ర వానరనేత కమ్మని కలలతో గడపె నచట! ఆ. గతము మరువలేక మతిలేని వాడుగా పుడమివల్లభుండు గడపెనిచట గతము విస్మరించి కనుపించునదె స్వర్గ మనుచు గడపె భాను తనయు డచట. (క8.కాం.135)

రా

అ, అవనిలోన గలుగు ఆనంద మంతయు సూర్యనందనునకు సొంతమాయె! ముందుచూపులేక ముల్లోకముల గల శోకమంత రాము సొంత మాయె. (క8.కాం.136)

సుందరకాండ మొత్తం పద్యరత్నాల ఖని. హనుమంతుని వర్ణనం, లంకా నగర వర్లనం, రావణ వర్ణనం, పుష్పకవర్ణనం, పానశాలా వర్ణనం, హనుమంతుడు రావణుని ఎదుట చేసిన శ్రీరామ వర్ణనం... ఒకటేమిటి? (ప్రతి వర్లనా పరిమళభరితం.

మహాకావ్యమంతా పద్యాలలో నే నడిచింది. చివరికి “అంతనా తాపసోత్తముండిట్లనియె” వంటి సంధాయక వాక్యాలు కూడా లేవు. విషయంలో మల్లెమాల రామాయణం మూల(గ్రంథంతో పోటీపడుతుంది. ఒక్క వ్యర్థపదం కూడా లేకుండా పద్యకావ్యాన్ని నడిపించడం ఎంత క్తిష్తమైన విషయమో పద్య కవితా విశారదులకు మా(త్రమే సుబోధం.

మల్లెమాల వారు కావ్యంలో కొన్నిచోట్ల సందర్భానుసారంగా ద్విపదలు, మంజరీ ద్విపదలు, గీతమాలికలువాడి కథా కథనానికి (క్రొత్త సొబగులు దిద్దినారు. చాలాచోట్ల కవి ఉపయోగించిన పాత్రానుగుణమైన భాష మహాకావ్యానికి వన్నె చేకూర్చింది. అవన్నీ ఉదహరించడం కంటె పరితలా రసానందాన్ని స్వయంగా ఆస్వాదించడమే ఉచితంగా ఉంటుంది.

రామాయణంలో (ప్రధాన రసం కరుణరసం అనీ, మహాభారతంలో శాంతరసం అనీ సిద్దాంతీకరించాడు ఆనందవర్దనుడు. అంటే కావ్యాలలో ఇతర రసాలుండవని కాదు. అవీ ఉంటాయి. మల్లెమాల రామాయణం రసభావాదుల పుట్ట. ఎక్కడ తడిమినా

మల్లెమాల రామాయణం *

ఏవేవో భావాలూ, రసాలూ చిప్పిలుతూనే ఉంటాయి. భవిష్యత్తులో ఎందరో ధీమంతులు, తమ పీ.హబ్‌.డి.ల కోసం మల్లెమాల రామాయణాన్ని విస్తృతంగా పరిశీలన జరుపుతారనడంలో నాకెలాంటి సందేహం లేదు. పి.హెచ్‌.డి. పరిశీలనకు అర్హమైన ఘట్టాలు కావ్యంలో అనేకం ఉన్నాయి. అరణ్యకాండంలో సీతారామ వనవిహార ఘట్టంలో శృంగారరసం ఆస్వాద యోగ్యంగా జాలువారింది. దశరథునికీ, కైకకూ ముర జరిగిన సంభాషణ, రాముని అరణ్య గమన సందర్భంలో కౌసల్యాదుల శోకం, సీతారాముల విరహం, ఇవన్నీ కరుణరసానికి అద్దం పడుతాయి. శూర్సణఖా వృత్తాంతాదులు హాస్యరసస్ఫోరకాలు. మున్యా(శ్రమాది వర్లనలు శాంతరసోద్దీపకాలు. పుష్పక, లంకాదుల వర్లనలు అద్భుత రసానికి ఆలవాలాలు. ఇహయుద్దకాండ మొత్తం రౌద్ర,వీర, భయానక, బీభత్స రసాలను అత్యద్భుతంగా ఆవిష్కరిస్తుంది. సామాజిక స్పృహ : ఇది ఈనాడు ఎక్కు (ప్రచారంలో ఉన్నపదం. పదం క్రొత్తగా కనబడినా దీని అర్థం అతి (ప్రాచీనమైనది. మహాకావ్యం సమాజుశ్రేయస్సు అనే భావంలోనే ఆవిర్భవించింది. రెండు మూడు ఘట్టాలలో కవి స్పష్టంగా సమాజంలో సుఖశాంతులను నెలకొల్పడానికి అవసరమైన పద్దతులు సూచించాడు. 1. _ శ్రీరామునికి యౌవరాజ్యపట్టాభిషేీకం చెయ్యాలని నిశ్చయించిన దశరథుడు ఆతనికి రాజధర్మాలను ఉపదేశిస్తాడు. ఇది అతి సంక్షిప్తంగా ఒక్క సీసపద్యంలో నడిచింది.. నడిచింది.. సీ. ప్రభువు ముఖ్యమ్ముగా ప్రజల సంక్షేమమే కలలోన సైతము దలపవలయు కామక్రోధాదుల నేమాత్రమును జాలి దలపక ఛీకొట్టి తరుమవలయు సచివులతో సదా సంప్రదింపు లొనర్ణి వారితోడ్డాటును బడయ వలయు సర్వకాలముల కోశాగారముల నెల్ల నొక్కింత తరుగక నుంచవలయు

తే. అన్నిటిని మించి దండనాయకులతోడ సణజ్యముగనుండి యిసుమంత శత్రుభయము లేని విధమున జనుల బాలింపవలయు నని హితవు దెల్జ్చె పుత్రున కవనివిభుడు. (అయో.కాం. 28)

2 రాముడు భరతునకు రాజధర్మాలు ఉపదేశించిన ఘట్టం రెండవది. సందర్భంలో కవి మూల రామాయణంలో ఉన్నదానికి చిన్న మార్పు చేశాడు. మార్పు చాల ఉచితజ్జతతో చేసిన మార్పు.

x మల్లెమాల రామాయణం

రాముని మాట కాదనలేక భరతుడు అయోధ్యకు తిరిగి వెళ్లి రాముని పక్షాన రాజ్యపాలనం చేయడానికి అంగీకరించి రాజ్యపాలనకు సంబంధించిన విషయాలేవైన ఉపదేశించమని అన్నగారిని కోరుతాడు. అప్పుడు రాముడు రాజధర్మాలు బోధిస్తాడు. ఇది విస్ఫతంగా 14 పద్యాలలో (అయో.కాం. 503-516) జరిగింది. ఇక్కడ రాముని ద్వారా కవి కళాసంస్కృతుల పోషణ (ప్రభువు కర్తవ్యం అని బోధించడం వాటిపై ఆయనకు గల మక్కువను సూచిస్తున్నది.

విభీషణుడు రావణునకు ఉపదేశించడం వంటి అనేక ఘట్టాలలో (ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ లోకక్షేమాన్ని గూర్చిన ఎన్నో విషయాలు కావ్యంలో మనకు గోచరిస్తాయి.

అటు పండితులకు ఇటు పామరులకూ అర్థం అయి ఆనంద జనకంగా ఉండే రామాయణం ఈనాడు తెలుగులో ఉన్నదా అంటే సందేహమే. కొరతను తీర్చినదీ మల్లెమాల రామాయణం. అందరికీ అర్థమయ్యే అతి సరళమైన భాషతో, అద్భుతమైన కల్పనా విశేషాలతో, ఆనంద డోలికలలో ఊగులాడించే రామాయణం అందించినందుకు ఉత్తమ సాహిత్య ప్రీయులైన ఆం(ధ్రులందరూ శ్రీ మల్లెమాలకు కృతజ్ఞతాబద్దులై ఉంటాగు.

తాము రచింప తలపెట్టిన మాతృసందేశంలో భాగంగా శ్రీ మల్లెమాల రచించిన రామవనగమన వృత్తాంతాన్ని విన్న వెంటనే ఇదే శైలిలో రామాయణం అంతా వ్రాస్తే ఆంధధ్రలోకానికి మహోపకారం చేసిన వారవుతారని నేను అన్నప్పుడు దానికి అంగీకరించి శ్రీ మల్లెమాల ఇంతటి చక్కని మహాకావ్యాన్ని ఆంధ్రులకందించడం అందరికంటె కూడ నాకు మహానందదాయకంగా ఉంది. నేను వెలిపుచ్చిన కోరికకు భరతమాత ఆదేశం మరింతబలం చేకూర్చింది. ఇది ఇంకా (ప్రమోదావహం. కొన్ని దశాబ్దాలుగా మాధుర్యాన్ని పంచిపెట్టడమే తమ జీవిత పరమధ్యేయంగా పెట్టుకున్న శ్రీ జి.పులారెడ్డిగారు వారి సతీమణి శ్రీమతి నారాయణమ్మగారూ దాదాపు 25 విద్యా సంస్థల ద్వారా వేలాది యువతీయువకులకు జ్ఞానామృతాన్ని పంచుతున్నారు. ఆదర్భ దంపతులు కావ్యరసామృతాన్ని కూడ ఆంధ్రులందరికీ అందజేయడానికి స్వయంగా ముందుకు రావడం వారి సత్కార్యాచరణ దీక్షకు తార్కాణం. రామరాజ్యకాలంలో రాముని సర్వలోక (ప్రియత్య్వాన్ని గూర్చి వర్ణిస్తూ వాల్మీకి మహాముని - “యళశ్చరామం పశ్యేత్తు యంచ రామోనపశ్యత్రి నిన్దితః సపుమాన్‌లోకే స్వాత్మాప్యేనం విగరతే"' అని అంటాడు. “రాముని దర్శనం ఎవడు చేసికొనలేకపోయాడో, ఎవనిమీద రాముని చూపులు (ప్రసరించలేదో అతణ్ణి లోకులందరూ 'అయ్యో! పాపం! దురదృష్టవంతుడు! అని నిందించే వారట! వాని అంతరాత్మయే వానిని నిందించేదట” అని భావం. అదే ధోరణిలో...

మల్లెమాల రామాయణం xi

“న పిబేద్యో మల్లెమాల రామాయణరసామృతమ్‌, వజ్టేతం తం వదేల్లోకః మనుతే స్వంస వజేతమ్‌”

“మల్లెమాల రామాయణంలోని రసామృతాన్ని ఆస్వాదించనివానిని చూచి లోకులు 'అయ్యో!పాపం!' అనుకుంటారు. తానేదో కోల్పోయినట్లు అతడే బాధపడతాడు” అని అనవచ్చు.

మంచుకొండ రీవి, మరుమల్లియల తావి తగ్గనంతకాలం మల్లెమాల రామాయణంలోని (ప్రతిపద్యం (ప్రజల హృదయంలో గుబాళిస్తూనే ఉంటుంది. ఇది సత్యం.

లీ Ure శ్రీరారదంప్బుడు హైదరాబాదు 22-12-2005

xiii మల్లెమాల రామాయణం

వినయాంజలి

రామాయణ కావ్యము నే రచియించితిని అనుట నేరము, నాచే శ్రీరాముడు వ్రాయించెను కారుణ్ళామ్యతము జిలికి కమనీయముగా॥

శ్రీరాముడు...

అసంఖ్యాక ప్రజానీకానికి ఆరాధ్య దైవం.

అందులో నేనూ ఒకణ్ణి,

అతి చిన్న వయసులో నన్ను చుట్టుముట్టిన ఆపదలే నా మనసునా ఆపద్భాంధవుడి వైపు మళ్ళించాయి. ముఖ్యంగా నా అనారోగ్యం.

ఆరోగ్యానికి మించిన ధనము, ఆత్మ విశ్వాసానికి మించిన బలము లేదని కదా సత్యసూక్తి,

కడగండ్లు నాపై కసిగా కాలు దువ్వినప్పుడూ, ఆరోగ్యం అస్తవ్యస్తమై నప్పుడూ, దయామయుని అభయహస్తమే నన్నాదుకొనింది -

పురుషోత్తముడికి పూజా కుసుమంగా శ్రీమ(ద్రామాయణాన్ని వేలాది మంది బాలబాలికలతో చలన చిత్రంగా రూపొందించాను. చిత్రం ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ బహుమతి నందుకోవడం నా జీవితంలో ఒక తీయని అనుభూతి,

అంతటితో నా బాధ్యత తీరిపోలేదనుకుంటాను. గత సంవత్ళరం యాలభైయేడవ స్వాతంత్ర్యదినోత్సవ సందర్భంగా “భారతమాత” నా స్మృతిపథంలో (ప్రత్యక్షమై మహాత్మాగాంధి కలలుగన్న రామరాజ్య నిర్మాణం కలగానే మిగిలిపోయిందని విచారం వ్యక్తం చేసి మానవాభ్యుదయానికి మార్గదర్శకమైన “రామాయణగాధ”ను పామరులకు సైతం అర్థమయ్యే రీతిలో కావ్యంగా వ్రాయమని నన్నాదేశించింది. అది... నా తలకు మించిన భారం -

అయినా...

అన్నిటికీ రాముడున్నాడనే విశ్వాసంతో మహామాత అదేశానికి తలవంచాను.

విశ్వసాహిత్యంలో...

పరిపూర్ణమైన మానవధర్మాన్ని (ప్రతి హృదయంలో ఆవిష్కరించే మహాకావ్యం శ్రీమద్రామాయణం...

మల్లెమాల రామాయణం Wy

ఆదికవి వాల్మీకి ఆధ్యాత్మిక వరంగా మనకందించిన రామాయణాన్ని ఎందరో మహాకవులు వివిధ భాషల్లో రచియించి జన్మ చరితార్థం చేసుకున్నారు. తెలుగులో కూడా అనేకమంది పండిత కవులు రామకథను అమృతోపమానంగా అక్షరబద్దం చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. పరంపరలో నేనూ ఒకడుగా రామాయణ రచనకు శ్రీకారం చుట్టి తపోదీక్షతో సంవత్సరకాలంలో పూర్తి చేశాను. ఇప్పుడు నా వయసు 82 సంవత్సరాలు. వయసులో నేను రామాయణం వాయడమేమిటి? కావ్యానికి నేను లేఖకుణ్ణి మాత్రమే. రసావిష్కరణమంతా రాముడిదే. ముఖ్యంగా ఇక్కడొక మాట చెప్పాలి. నేనీ కావ్యరచన ఆరంభించిన నాటినుండి జుకారోజు. అమూల్యమైన సలహాలతో, అవ్యాజమైన (ప్రేమానురాగాలతో నన్ను ప్రోత్సహించిన మాన్యులు, మహామహోపాధ్యాయ 'శ్రీపుల్లైల శ్రీరామచంద్రుడు”. వారికి నా కృతజ్ఞతా పూర్వక నమోవాకములర్సించుకుంటున్నాను. అలాగ... ఇందులోని (ప్రతి పద్యాన్ని తులనాత్మకంగా పరిశీలించి శుద్దప్రడిని రూపొందించిన విద్వత్సవి శ్రీమాన్‌ ముదివర్తి కొండమాచార్యులుగారికి నా ధన్యవాదాలు. నా కవిత్వానికి మొట్టమొదటి సమీక్షకుడూ, విశ్లేషకుడూ, రెండూ తానే అయిన నా ఆత్మీయమి(త్రుడు, కలలో కూడ నా శ్రేయస్సును ఆకాంక్షించే ఆప్తబంధువు, ప్రముఖ విద్యాేత్త, కవికిరీటి డా॥ ఉండేల మాల కొండారెడ్డి గారికి నేను ఆజన్మాంతం కృతజ్ఞక్లి, ముఖ చితము'ద్రణకు (ప్రతిఫలం ఆశించకుండా జష్‌తం చేసియిచి సన మాన్యమిత్రులు శ్రీ పరుచూరి హనుమంతరావు (ప్రగతి ఆర్ట్‌ ప్రింటర్సు) గారి బొడార్యాన్ని మనసారా అభినందిస్తున్నాను. చివరగా ఒక్క మాట మాల్లెమాల రామాయణం చేతికివ్వగానే (ప్రతి వారు ముందుగా ముఖచిత్రాన్ని కళ్ల కద్దుకుంటున్నారు. అందుకు తెలుగు సంస్కృతీవికాసమేశ్వాసగా, తెలుగు భాషాభ్యుదయమేధ్యాసగా జీవించే నా ఆత్మీయ మిత్రుడు శ్రీ ఎం. ఎ. సుభాన్‌ (శ్రద్ధాసక్తులే కారణం.. ఆయనకు నా ప్రత్యేక శుభాభినందనలు. కావ్యానికైనా న్యాయనిర్లేతలు రసగ్రహణ పారీణులైన పాఠకులు కదా! ఆదరిస్తారని ఆశిస్తూ... కవి పరమాణువు

: కుల్ఫైమూల

'మలెమాల'

రామాయణం

విషయసూచిక మాత్యసందేశం ------౫౫-౫౫౫౫-- దద 3 కరర కకక నట 11 జాలకాండయము -----౫౫--కారా రారారా రారారా రా మకారారారానానారానానా 12 అయోధ్యాకాండయు ------------------- ------ 61 అరణ్యకాండయు --------------౫------------ 144 కిష్మింధాకాండయు -----౫౫-------ద దద 227 we mem =e Uw MP ete FP Cr rr 26+

మాతృసందేశం

త్స సందేశ మాత్య సీందిశం వేల సంవత్సరాలుగా విశ్వమందు వేదభూమిగ ఎనలేని పేరుగాంచి భిన్న సంస్కృతులకు గొప్పవేదియగుచు వరలుచున్నది సువిశాల భరతభూమి.

హిందువులు ముస్లిములు సిక్కు లందరొక్క తీవపూవులవలె మతాతీతమైన

భావ మూపిరిగా భాయి భాయి యనుచు కలసి జీవించుచుండి రీగడ్డమీద.

కాలమునుబట్టి అన్షి మతాలవారు వేరువేరుగ పండుగల్‌ వారి వారి సంస్కృతిని గుర్తు జేయుచు జరుపుకొనుట ఆనవాయితిగా నున్నదాదినుండి.

కాని ప్రజలంద రొకటిగా కలసి మెలసి

అనుపమానంద సంభరితాత్ములౌచు

జయపతాకను చేబూని జరుపుకోనిన

పండుగాగస్టు పదునైదు ప్రథమముగను.

ఆనా డంబరమంటు సంబరముతో ఆబాలవృద్ధమ్ము, తా మేనాడున్‌ తలపోయనట్టి పగిదిన్‌ ఎంతో వినూత్త్నమ్ముగా

నానారీతుల వేడుకల్‌ జరుపుకొన్నారా వినోదమ్ములో నేనున్‌ పాల్గొని ఆడిపాడితిని నా నేత్రాలు విప్పారగన్‌.

మంచుమలనుండి కన్యాకుమారి వరకు నాడు జరిగిన ఆనందనర్తనమ్ము గడియగడియకు కన్నుల గట్టినట్లు

నిత్య మగుపించు నా మనోనేత్రమునకు. సకల జనులు దేశ స్వాతంత్ర్య స్వర్ణోత్స వములు జరువుకొనిన వైన మరసి నేను గతమునంత నెమరు వేసికొనుచు మేలి ఊహలందు దేలిపోతి.

ma

అప్పడు నా స్మృతి పథమున

చప్పన గనుపించె నొక్క సాథ్వీమణి, బఒప్పలకుప్ట మొగమ్మున

గప్పిన శోకమును గాంచి కలవరపడితిన్‌. అంతలో తేరుకొని నాలుగైదుసార్లు తరచి చూచితి నా మది దగ్గమాయె! ఆమె వేరెవ్వరోగాదు అక్షరాల పరమసౌభాగ్య సముపేత! భరతమాత! చింతయె రూపము గొనినటు

చెంతన్‌ ప్రత్యక్షమైన స్త్రీరశముతో గొంతుక తడబడి వణకగ

ఎంతయు తర్శ్మించి చివర కేనిట్లంటిన్‌.

మల్లెమాల రామాయణం

10

అమ్మా! భారతమాత! ఏమిటిది? ఆగష్టు పర్వమ్మునన్‌ నెమ్మోమెందుకు కందిపోయినది? కన్షీరేటికో చెప్ప మో

యమ్మా! చెప్పక యున్న నాకెటుల నీ ఆంతర్య మర్థమ్మగున్‌ చెమ్మంగిల్లిన కన్నులం గనిన నా చిత్తమ్ము క్షోభించెడిన్‌. 11

అనుచు భారతజనయిత్రి నడిగినాడ! ఆమె నావంక తమిదీరునటుల జూచి కారణము నీకు తెలియదా కవికుమార? అయిన తెల్టెద వినుము నా ఆత్మ ఘోష.

ఏగె నేబది యేడేండ్లు ఎట్జకోట

కొమ్ముపై జాతిబావుటా కొలువుదీరి:

కాని ఫలమేమి? నేటికీ కష్టజీవి

బ్రతుకు మిగిలెను మిగుల దుర్భరముగానె.

పసితనమున వసివాడెడు కసిగందుల దలచు కొనిన కనులు చెమర్షున్‌ కుసుమముల నలిపివేసిన

ప్రసవించునె? భూరుహములు ఫలసంతతులన్‌.

ఆస్తి పంపకమున కంగీకరింపని సోదరు హతమార్చ జూచు నొకడు ఆలి చెప్పడు మాట లాలించి క్రుద్దుడై

అమ్మను దుర్జాషలాడు నొకడు

te

13

14

మాతృసందేశం

ప్రా

ae

ధనము కోసము కన్నతండ్రిని సైతము

శత్రుభావమ్మున చంపు నొకడు

త్రాగుడు మాన్చింప దలచిన భార్యను

ఇంటిగుమ్మముదాట గెంటు నొకడు

మేని సొగసుల ప్రియురాలిమెప్పకొరకు

అగ్షిసాక్షిగ కోరి పెండ్లాడినట్టి

భార్యనే వల్లకాటికి బంపు నొకడు

అంత మెపుడిట్టి ఘోరదురంతములకు 15

అవినీతినే నిత్య మాహారముగ మెక్కి మదమెక్కి దున్నలై మసలువారు

స్వార్థమే సకలార్థ సాధనమ్మని యెంచి చెలగి దుష్కృత్యముల్‌ సేయువారు చట్టాలకనులకు పట్టుగంతలు కట్టి

పగలె దోపిడికి పాల్పడెడు వారు

దుడ్డు కమ్ముడువోయి గొడ్డళ్ళతో తలల్‌ నరికి నిర్భీతిగా తిరుగువారు

కుటిల తంత్రాలతో వోట్లు కొల్లగొట్టి అడ్డదారుల గద్దెల నాక్రమించి

నీతి సూత్రాలు వల్లించు నేతల గని కడుపు రగులుచునున్న్షది కవికుమార! 16 వుట్టి వుట్టకముందె పొట్ట కూటికి బిడ్డ నంగడిలో బెట్టి అమ్ము తల్లి

ఎండిపోయిన రొమ్ము నేడ్డెడు పసికూన కందించి మదిలోగ కుందుతల్లి తలదాచుకొన నింత నెలవుకు నోచక వీథిప్రక్కనె ప్రసవించు తల్లి

ఎంగిలాకుల మీది కెగబ్రాకు బిడ్డను వారించి గొల్లున వగచు తల్లి

ఎన్నా నోములు నోచి నే కన్న బిడ్డ

నెటుల బ్రతికించు కొందునం చేడ్ను తల్లి మోములందున పాొగవోలె ముసురుకొనిన బాధ కర్థము నుడువంగ బ్రహ్మ తరమె? 17

రూ

త్రూ

ప్రతిదినమ్మును ఆకలిబాధతోడ

క్రుంగి క్యృశియించి సహనమ్ము గోలుపోయి కోరిచావును వరియించు వారు నేడు అగణితమ్ముగ కన్టింతు రన్షిదెసల.

అన్నదాతలు రైతు లనుదిన మ్మాకలి బాధతో మ్రగ్గుట పరువు చేటు! పట్టుబట్టలు నేయు పనివారికే కట్టు బట్టలు కరవౌట పరువుచేటు!

ఉస్సు రుస్గు రటంచు యువత నిరుద్యోగ పర్వాన గుములుట పరువుచేటు! కులమత ద్వేషాలు కొరవి దయ్యములట్లు ప్రజల పీడించుట పరువు చేటు! కలికమునకైన గాంధిజీ కలలు గనిన గ్రామస్వారాజ్యమే ఒక్క గ్రామమందు కాగడాబట్టి వెదకిన కానరాదు భరతజాతికి ఇది యెంత పరువుచేటు.

నాడు నాజబిడ్డ బాపుజీ నాయకత్వ మందు జగమంత చకితమౌనటుల సాగి నట్టి స్వాతంత్ర సంగ్రామ మాత్మలోన దలచుకొనినంత యొడలెల్ల పులకరించు. ఊతకర్ర దప్ప చేత ఆయుధమేది పట్టనంచు గాంధి ప్రతిన బూని సమరశంఖమూద సకల ప్రపంచము విస్మయమున నోరు వెళ్ళ బెట్టె. అనుపమానమ్మైున ఆయుధ సంపత్తి అంచన కందని అరబలము యుక్తియుక్తమ్రైన యుద్ద నైపుణ్యము అవధులులేనట్టి అంగబలము

రవి అస్తమించని రాజ్యాధిపత్యము అరివర్గమును గూల్బు అనుభవమ్ము. oti ws

సహజసిద్ధమైన శాస్త్రవిజ్ఞానము

జగ మెరింగిన గూఢచారి గణము

మల్లెమాల రామాయణం

18

20

21

మాతృసందేశం

(2

కలిగియునట్లి దొరలతో కదనమునకు

కాలుద్రవ్వెను అర్థదిగంబరుండు

ఎంత సాహన మిదియని యెల్ల జగతి

కోటి గొంతులతో గుసగుసలు వోయె. 22

అయిన కర్తవ్యదిక్షకు అంకితమయి

తాను ముందుండి నర్వసేనానియోౌచు

ఉర్వి కంపింప సత్మాగ్రహోద్యమమును

నడపి విజయము సాధించినాడు గాంధి. 23 పొండిక దేశమున్‌ వదలి బుద్ధిగ వచ్చినదారివెంట, మీ

మొండి ఫిరంగి దాడు లిక ముందుకు దూకు జనప్రవాహమున్‌ చెండగ లేవు; మా బల మజేయ మటంచు మహాత్మగాంధి, తా లండను దద్దరిల్లునటులన్‌ నినదించె ద్యఢస్వరమ్మునన్‌. 24

గర్భన వినినంతనె

లాగులు తడియాయె తెల్లప్రభువులకెల్లన్‌

జాగొనరించిన కలిగెడు

బాగోగుల తరచి చూచి పన్నిరి కుట్రన్‌. 25 రెట్టించిన సైన్యముతో

ముట్టడి యొనరించి ప్రజల మూర్థత్వమునన్‌

గొట్టించిరి నాయకులను

బెట్టించిరి జైళ్ళలోన భీతి దలిర్దన్‌. 26 ఎందరో మహనీయు లేండ్ల పర్యంతము

మౌనమ్ముగా జైళ్ళ మ్రగ్లినారు!

ఎందరో మహిళలు - ఇళ్ళు వాకిళ్ళను

విడిచి భర్తలవెంట నడచినారు!

ఎందరో రచయిత లేకోన్ముఖమ్ముగా

దేశభక్తిని ప్రబోధించినారు!

ఎందరో విద్యార్థు లెగసి ఉద్యమమందు

దూకి దిక్కుల కెగబ్రాకినారు!

ఒక్కరేమిటి? బహువిధోద్యోగి గణము

లన్ని వృత్తుల పనివార లడుగు కలిపి

కదనుద్రొక్కుచు సాగిన ఘటన నరసి

తెల్లదొరలకు గుండెలు యుల్లు మనియె. 27

మల్గెమాల రామాయణం

దిక్కుదోచని దొరతన మొక్కసారి

ముందు వెనుకలు యోచించి మొండిపట్టు

కడకు సడలించి విధిలేక గాంధితోడ

ముమ్మరమ్ముగ రాయబారమ్ము నడపె. 28

అదియును వ్యర్థ్ధమాయె! నపు డాంగ్లవిభుత్వము తొట్రుపాటుతో చెదరిన గుండెకాయ నరచేతులలో బిగబట్టి బాపుజీ

మది నెటులైన మార్చగల మార్గము నారసి కొత్తయెత్తులన్‌ వెదకెను నక్కజిత్తులకు విజ్ఞులు లక్ష్యము మార్చుకొందురే? 29

సత్యమే జయ మనినమ్మి సమరమునకు

కంకణము గట్టు కొనినట్టి కర్మయోగి

చవుకబారు ప్రలోభముల్‌ సరకుగొనక

జ్ఞానయోగిగ ప్రజల పక్షాన నిల్టై 30

మహాత్తుని దృఢ నిశ్చయమ్ము నరసి

మేటి నాయకు లంద రమేయమైన

భక్తి విశ్వాసములతోడ బాపునోటి

మాట వేదము మాకని చాటినారు. 31

నినాదము మార్రోగె నన్షిదిశల

పల్లెలును పట్టణమ్ములు పదము గలిపి

ద్విగుణితోతాహ ముప్తాంగ దేశమాత

దాస్యశ్యంఖలములు ద్రెంచ తరలె నపుడు. 32

మహోడ్యమమం దసంఖ్యాకులైన

కన్నబిడ్డల గోల్లోతి కనులముందె!

వారి బలిదాన మెదనిండ వగపుకన్న

రాగరంజితమైన గర్వమును నింపె. 33

కులమతములు మరచి కోట్లాది ప్రజలొక్క

త్రాటిపైన నిలిచి సాటిలేని

సరణి సలిపినట్టి శాంతి సంగ్రామము

తెల్లదొరల మదము కొల్లగొట్టి. 34 ప్రకయభీకరమగు ప్రజాబలము ముందు

సాగ దికమీద భరతదేశమ్మునందు

ఇమ్ము దరిగిన మనపెత్తనమ్మటన్న

నిజము గుర్తించి ఆంగ్లేయనేతలెల్ల, 35

మాతృసందేశం

.. ఓడలెక్కి వారు ఊరకపోలేదు కుటిలతంత్రములను కుషప్పవోసి ఆరనట్టి జ్వాల లన్నదమ్ముల మధ్య రేపి శాంతిరూపు మాపినారు.

శా. కల్లోలము నా శరీరమును బాహాటమ్ముగా రెండుగా లోక మ్మచ్చెరువంద చీల్చినది; నాలో శోక ముప్మాంగె; నా చీకాకున్‌ మదిలోనె దాచుకొని నా చింతన్‌ దిగన్హ్రింగి, నే పాకిస్తానుకు సమ్మతించి అటులే బాపూజి నొప్పించితిన్‌.

తే జవహరాదిగ తక్కిన శాంతి దళము తలలు వంచిరి ముందుగా తల్లిచెరను బాపి జయకేతనమ్మును లేపవలయు హస్తినాపురి కోటపై యని దలంచి.

తే. ఇన్ని కష్టాలకోర్టి దక్కించుకొన్న దివ్య స్వాతంత్ర మీనాడు దీననైన నన్ను తిలకించి పకపక నవ్వుచుండె! మానస మ్మగ్న్మికుండమై మండుచుండె.

ఆ. రామచరితమైన రామాయణమ్మును తలచుకొనిన మేను పులకరించు అందులోని పాత్ర లనుదినమ్మును నాకు జ్ఞెప్తివచ్చి మిగుల గర్వపడుదు.

తే. ఘనుడు శ్రీరామచంద్రుని కారణమున యుగయుగమ్ములనుండి యూ యుగము వరకు

పయన మొనరించి నేటికి బ్రతికియున్న మధుర మంజుల గాథ రామాయణమ్ము.

తే. దారిదప్టిన మనుజుల ధర్మమార్గ మునకు మళ్ళించు రాముని ఘనచరిత్ర నీవు నీదైన శైలిలో నేటి తరము కొరకు చెప్పుము మిక్కిలి త్వరితగతిని.

ఉ. ఇంతకు ముందు రామకథ నెందరోొ పండిత సత్కవీంద్రు త్యంత రసోత్మటమ్మగు విధమ్మున వ్రాసిరి, వారిముందు, నే నెంతటివాడనంచు మదినెంచక పామరరంజకమ్ముగా చింతనజేసి చెప్పుమని చెప్పెను భారతమాత ప్రేముడిన్‌.

36

38

39

40

41

42

43

10

మల్లెమాల రామాయణం

మహామాత ఆదేశ మనునరించి

భారమంతయు రామునిపైన వైచి

తలకుమించిన బరువని తెలిసికూడ

తలను వంచితి నిది సుక్ళృతమ్మటంచు. 44

పరిమళమ్ము సెడక వాడక కలకాల

ముండు ననుచు నమ్మి నిండు భక్తి

ప్రేమధామమైన రామాయణము ముందు

చిన్ని “మల్లెమాల” చేర్చినాడ. 45 తప్ప లెన్షకుండ దయజూతురని నమ్మి

పండితులకు పెక్కు ప్రణతు లొసగి

చేతనైన వరకు శ్రీరామ చంద్రుని

కథను వ్రాసినాడ కావ్యముగను. 46

Kk Kk

11

కైహెక్లు

శ్రీకంరోన్ష్నత చాప మిక్షువు వలెన్‌ ఛేదించి మోదాన తా నాకర్ణాయతలోచనన్‌ వరగుణాఢ్యన్‌ సుందరాకార, సీ

తాకల్ళాణిని పతిగా గొనిన నిత్మానంద సంధాయి లోకారాధ్యుడు రామభద్రునకు కేల్మోడ్డుల్‌ సమర్శించెదన్‌. 1

అందెల గజ్టెలన్‌ యుణర్హుణాంచిత శబ్దములెల్ల సత్వరా నందమనోజ్ఞ మందగమన ధ్వనిలో లయమొందునట్లుగా చిందులు ద్రొక్కి తల్లికి విశేషముదం బొనగూర్తు పార్వతీ

నందను నేకదంతు గణనాయకు నాత్మదలంచి మొక్కెదన్‌. 2 అరుణ సరోజకోమల నఖాంకుర ధూత విపంచికా లతల్‌ గురియు మరంద జిందుతతిగూడిన గానసుధాస్రవంతిలో మురియుచు దేలు భర్త నరమోడ్డుకనుంగవ గాంచి వెండియున్‌ పరమరసార్టగీతికల బాడు సరస్వతి కంజలించెదన్‌.

తొమ్మిది మాసముల్‌ శ్రమల దోగియు గర్భము నందుమోసి బా ల్యమ్మున స్తన్యమిచ్చి నను లాలన మీరగ గెంచి పెద్దగా

ఇమ్మహి జేసి నా సుఖము నెంచుచునే దివికేగినట్టి మా

అమ్మకు రంగమాంబ కిపు డంచితభక్తి నమస్కరించెదన్‌. 4

సహజౌదార్యగుణావతంసు కరుణా సంశోభిత స్వాంతునిన్‌ మహనీయోజ్ఞ్వల ధైర్యసంభరితు రామస్వామి నామాంకితున్‌ అహిరాట్‌శాయి సమీపు మజ్జైనకు నత్యాసక్తి గీర్తించి నే

రహి మీరన్‌ ఘటియింతు నశ్రుజలపూర్ణంబైన సాష్టాంగమున్‌. 5 లోకమందున నావంటి ఏకలవ్య

శిష్పకోటికి హితబోధదేసి, జ్ఞాన

భిక్ష దయతోడ నొసగెడు విశ్వగురుని

పాదయుగ్మము నెదనెంచి ప్రణతు లిడుదు. 6

తల్లియు దండ్రియున్‌ గురువు దైవము వాణియు విఘ్మ్లరాజు వీ రెల్లరు పూజనీయులని యెంతయు భక్తి నమస్కరించి, నా యుల్లము పల్లవించు మధురోహలసారము రంగరించి నే నల్లిగబిల్లిగా కవిత లల్లెద నా కలమాడునట్లుగన్‌. 7

12

బారకాండము

శ్రీ కల్మాణగుణాఢ్యుని లోకత్రయవిభుని భక్తలోలుని విలసత్‌ కాకుత్థ్ణ వంశ తిలకుని సాకేత ప్రభుని రామచంద్రుని గొల్లున్‌.

థారుణి ముద్దుల తనయను

శ్రీరాముని కూర్చి సతిని సీతామాతన్‌ నోరారగ నుతియించెద

కారుణ్యము తోడ నన్ను గావు మటంచున్‌.

నవరసములు జాల్వారగ అవిరళమగు శ్రద్ధతోడ అమరులవాణిన్‌ రవివంశజు రాముని కథ

వివరించిన ఆదికవిని వేడ్క భజింతున్‌.

ముజ్జగమ్ములు తనవైన మునివరేణ్యు నారదుని జూచి వాల్మీకి నతు లొనర్ణి తాపసోత్తమ! నాయందు దయ దలంచి బదులు సెలవిమ్ము నా చిన్ని ప్రశ్న కనియె. సత్మసంధుడు సదాచారనంపన్నుండు సకలభూతహితుండు సద్దుణుండు సర్వశాస్త్రజ్ఞండు శాంత స్వభావుండు ధర్మస్వరూపుండు తార్కికుండు

అచల సంకల్హుండు అసవాయశూరుండు మయోహనాకారుండు బుధనుతుండు నీతికోవిదుడును నిర్మలహృదయుండు మాననీయుండు విజ్ఞానయుతుడు అమరగణమును సైత మాహవమునందు సులభముగ గెల్మవాడు క్షాతలమునందు నున్నచో వాని వివరమ్ములన్ని నాకు మనసు రంజిల దెలుపుమా! మౌనివర్శ!

అనిన వాళల్సీకి విజ్ఞప్తి నాలకించి అడుగదగినట్టి ప్రశ్చనే యడిగినావు కలడు నీవన్ష సుగుణముల్‌ కలుగువాడు క్షితి నొకండని దేవర్షి చెప్పె నిట్లు.

మల్లెమాల రామాయణం

బాలకాండము

వసుధ పేర్లన్ష్న ఇక్ష్వాకువంశమందు జననమందిన శ్రీరాము డనెడువాడు

కడు ప్రసిద్ధు డనుచురామ కథను దెలిపె సంయమీంద్రుడు ముదమార సంగ్రహముగ.

నారదమహర్షిమాట కానంద మొంది మేలుమేలని మొక్కి వల్మీకభవుడు

సకల మర్యాద లొనరించి సాగనంపి చనెను తాను మధ్యందిన సవనమునకు. సజ్జనుని మది విధమున స్వచ్చమైన నీరుగల తమసా నదీతీరమందు శిమ్మడగు భరద్వాజుండు చెంతనుండ స్నాన మాడదొడంగె నా మౌనివరుడు.

అచటగల యొక వ్యక్షశాఖాగ్రమందు క్రౌంచపక్షుల జంట క్రీడించుకొనుచు పారవశ్యంబునంబాడు పాట యొకటి మౌని వాళ్సీకి చెవి సోకె మధురముగను.

అంత వల్మీక సంభవుం డతిముదమున కౌంచమిథునమువైపు వీక్షించుచుండ నొక్కబోయడు బాణమ్ము నెక్కు వెట్టి ఘోరముగ పోతుపక్షిని కూలనేసె. పెనిమిటిని గోలుపోయిన పెంటిపక్షి కటికబండలు సైతము కరగునటుల బోరుమని యేడ్వసాగె, నాతీరునరసి కరగిపారెను మౌనిపుంగవుని గుండె.

ఓరి బోయడ! నీవింత దారుణముగ కామమోహితమైయున్న క్రౌంచమిథున మందు నొకదాని జంపి, యత్సంత పాప కార్య మొనరించినాడ వకారణముగ.

కనుక తోడును నీడయు గానరాక బ్రతికినన్నాళ్ళ జీవచ్చవమ్మువోలె

బ్రదికి దుర్మరణమ్ము పొందెదవుగాక!

అనుచు శపియించె మౌనీంద్రు డాగ్రహమున.

13

10

‘el

12

14

వ్యాకులితచిత్తమున నేను పలికినట్టి

పలుకు లన్నియు లయబద్ధ పంక్తు లాయె గానయోగ్యత సైతము గాంచె కాన నిక్కముగ శ్లోకమిద్ది సందియము లేదు. అనుచు మదినెంచి యా మాట నా మహర్షి యనుగుశిష్యున కెరిగించె నంత నతడు గురువు శోకము శ్లోకమై దొరలె ననుచు అపరిమిత హర్షభరితుడై యాలపించి.

కమ్మనైన భరద్వాజు కంఠమునకు

శోభ బెంచెను తన తొలి శ్లోకమన్న సంతసము జెంది వాళలీకి స్నానమాడి మందగమనమ్ముతో నాశ్రమమ్ము జేరి. పర్లశాలలోన పద్మాసనస్థుడై

ఏల బుట్టె శ్లోక మిందులోని

మర్మ మేమి టనుచు మననమ్ము జేయుచు ధ్యానముద్ర దాల్చై మౌనివరుడు.

అతని స్మృతిపథాన నజుడు ప్రత్యక్షమై యతివరేణ్య! పక్షి ఆర్తి నరసి

బాధతోడనీవు పలికిన పలుకులు సూరివరులు మెచ్చు శ్లోక మాయె. సరళసుందరమగు ఛందస్సు నొడగూర్భి వాణి యొసగె గొప్ట వరము నీకు

కనుక దాని నూతగా గొని రాముని

కథ రచింపు మీవు కావ్యముగను.

కావ్య మాదికృతియై

లోకమ్మున ఖ్యాతిగనును రూఢిగ నిక నీ వాకార్యసిద్ధి కొరకై we

శ్రీకారము చుట్టు మిపుడె సిద్ధులు మెచ్చన్‌. అని విధాత దెల్చె నది మహాభాగ్యమ టంచు నెంచి మహామునీంద్రు డతిమనోహరముగ నాది కావ్యము వ్రాయ పుణ్యదివసమందు పూనుకొనియె.

మల్లెమాల రామాయణం

15

16

18

20

21

22

బాలకాండము

సూ

రై

సరయూనదీతీర సౌభాగ్యలక్ష్మికి ఇక్ష్వాకు వంశజు లిడిన తొడవు మెరుగుటద్దాలను పరిహాస మొనరించ గలిగిన రాజమార్గముల నెలవు

నీలి నీరదముల నిలువెల్ల ముద్దాడు రమణీయసౌధరాజముల నెలవు బహువిధఫల పుష్ట భరితమై విలసిల్లు వరనందనోద్యాన వనుల నెలవు

ధన కనక వస్తు వాహన గణము లెనయ భోగముల కాలవాలమై పుడమిలోన అతులితమ్మెన ప్రఖ్యాతి నందు కొనిన ప్రముఖ నేగరము సాకేతపట్టణమ్ము. సురనగరికి సరిదూగెడు

సరణిని నిర్మింపబడిన సాకేతపుర మ్మరిదుర్భేద్య మ్మగుపుర

వర మగుట నయోధ్యయన్న వాసి గడించెన్‌.

అట్టి అయోధ్యానగరము

చుట్టునుగల కోట మిగుల సుస్థిరమై యే ముట్టడికైనను లొంగని

కట్టడమై యలరె సర్వకాలమునందున్‌.

అచటి విప్రుల పుత్రు లయిదేండ్ల వయసుకే యెల్లవేదములు వల్లించుచుంద్రు

అచటి క్షత్రియ పుత్రు లడవి సింగములపై చిరునవ్వుతో స్వారి జేయుచుంద్రు

అచటి వైశ్యుల పుత్తు లధిక లాభమ్ముల నార్జించు మార్గము లరయుచుంద్రు అచటి శూద్రులపుత్రు లన్ని వ్యృత్తులయందు మించునేరుపున రాణించుచుంద్రు బఒక్కరని చెప్పనేల అయోధ్యయందు పుట్టు ప్రతిబిడ్డ తనముందు పుట్టినట్టి

బిడ్డ కన్షను మిగుల వివేకియౌట

సహజ లక్షణ మంద్రు లాక్షణికులెల్ల.

15

23

24

25

26

16

అట్టి సాకేతపురి ముఖ్యపట్టణముగ ఇలను కోసల రాజ్యము నేలుచుండె సత్మ్యసంధు డుదారుడు శౌర్యధనుడు ధర్మనిరతు డజేయుడు దశరథుండు. సుప్రసిద్ధులైన సూరివరేణ్యుల

భువిని పేరుగనిన కవితిలకుల గణుతి కెక్కినట్టి గాయకశ్రేష్ణుల

నిత్య మాదరించు నేత యతడు.

అష్టరసలవంటి అందాలనర్తకీ

మణు లయోధ్య నగరమునను గలరు వాడవాడలందు వారి యందెలు కోడి కూతకన్న ముందె కూయుచుండు.

తన రాజ్బముపై దండే

త్తిన రాజుల పీచ మణచి దిగ్విజయమ్మున్‌ గొని నగరమ్మును శూరుల

ఖనిగా దశరథుడు మలచె కడు దర్భమునన్‌.

మహిత విఖ్యాతిగనిన సామ్రాజ్యమున్న భవ్యచరితలు మువ్వురు భార్యలున్న ఒక్క కొడుకైన వంశము నుద్ధరింప పుట్టలేదను బెంగతో పుడమిరేడు.

మంత్రిగణ ముఖ్యుడైన సుమంత్రుతోడ శిష్ట కులగురువైన వసిష్ణుతోడ

బాధ వివరించి పుత్ర సంప్రాప్తికొరకు అశ్వమేధము జేసెద మని వచించె.

మంది నిర్ణయ మనుచు సుమంత్రు డొసగి నట్టి హితవును పాటించి యంగరాజ్ఞ మునకు పరివారయుతముగా నినకులేశు డరిగె తన యాప్తసఖుని సహాయ మడుగ.

చాలకాలమునకు చనుదెంచె స్నేహితు డనుచు రోమపాదు డతిముదమున స్వాగతించి యతిథి సత్మారములు చేసె దశరథుండు మిగుల దనియు నటుల.

మల్లెమాల రామాయణం

27

28

29

30

a1

32

33

34

బాలకాండము

అంత నయోధ్యరాజు తన యాప్తవరేణ్యుని రోమపాదునిన్‌ సంతస మొప్పనట్హుగని సల్బ దలంచితి నొక్క యాగమున్‌ సంతును గోరి, క్రతువు జ్ఞానపయోనిధి, బుష్యశ్యంగు డా

ద్యంతము నిర్వహింపదగునంచు మనమ్మున నెంచి వచ్చితిన్‌.

అని దశరథు డనినంతనె

తన అల్లుని బుష్మ్యశ్యంగతాపసవర్యున్‌ తనయను శాంతాదేవిని

అనిపెను హితు డంగరాజు హర్ష మ్మెనయన్‌.

రోమపాదుడు తనకెంతొ ప్రేమపంచి కోరినంతనె అల్లుని కూర్మిసుతను

పంపె శుభసూచి యిది యన్న భావమునను దశరథుడు శీఘ్రముగ రాజధాని కజేరె.

కోటవాకిట బుష్యశ్యంగునకు ప్రజలు ఘనతరమ్ముగ విరుల స్వాగతము నిడిరి; అంత నాదంపతుల రాజహర్మ్య మందు

విడిది జేయించె స్వయముగా పుడమివిభుడు.

అంత కొన్షినాళ్ళ కామని అరుదెంచె అవని విభుడు గురుని యనుమతి గొని మౌని బుష్యశ్యంగు మనసార నుతియించి భక్తిశ్రద్ధ లెనయ పలికె నిట్లు. మౌనికులవతంస ! మా రఘువంశాభి వృద్ధి నభిలషించి వేదసమ్మ

తముగ నిర్వహింప దలచితి నే నశ్వ మేధయాగ మంచు మీకు దెలియు. సకల ధర్మ స్వరూపు డాచార్య దేవు

డగు వసిషుని నేత్యత్వమందు జరుగు యాగ మారంభమును జేయ నానతిండ టంచు సాకేత విభుడు ప్రార్థించె నంత. బుష్యశ్యంగుడు దశరథునిచ్చ మెచ్చి నీయభీష్టము సఫలమై నెగడుగాక! అనుచు దీవించి మహాయజ్లమునకు వేగ నేర్తాటులెల్ల గావింపు మనియె.

17

35

36

37

40

41

42

18 మల్లెమాల రామాయణం

మంజరి. సాకేతవిభుడంత సంతస మ్మెనయ మంత్రిసుమంత్రుని మరియు నద్దురుని వేద పండితులగు విప్రోత్తములను బిలిపించి వారికి వివరముల్‌ దెలిపి యాగనిర్వహణాన కవసరమైన సకల సంభారాలు నమకూర్షు డనియె: ప్రభునానమేరకు వారంద రపుడు విధులు నిర్వర్తింప వేవేగ జనిరి చైత్రపూర్ణిమనాడు సాంగ్రహణేష్టి కర్మ నారంభించి క్రతుధర్మ మెసగ సవనాశ్వరాజమున్‌ సైన్యమ్ముతోడ అఖభిలదేశములకు అవనీశు డంపె 43

తే సకల వసతులతో వేద సమ్మతముగ నద్భుతావహ మగులీల యాగశాల శాస్త్రవేత్తల పర్యవేక్షణమునందు త్రైత ప్రొద్దు కొకరీతి క్రొత్త రూపును ధరించె. 44

తే. వివిధ దేశాధినేతల కవనివిభుని యానమేర సుమంత్రు డాహ్వానములను పేరు పేరున పంపించె వారి వారి అర్హతలు కొలమానమై యలరునటుల. 45

తే సవన మారంభమగునట్టి సమయమునకు ముందె రాజన్యు లందరు ముద మెలర్భ నరుగుదెంచి రయోధ్యకు నతులితమగు కానుకలతోడ భిన్ష్నమార్గముల యందు 46

తే వార లందరకును మంత్రి స్వాగతమ్ము

పలికి తగురీతి విడుదు లేర్ణాటుజేసె

నంతలో పూర్తియైనది యాగశాల

ప్రభువు సైతము నాశ్చర్యపడెడు లీల. 47 క. అంత వసిష్టుడు దశరథు

నంతఃపురమందుగలసి యాగము కొరకై

యంతయు సిద్ధమ్మిక నీ

చింతలు దీరంగ శుభము చేకురు ననుచున్‌. 48

బాలకాండము

ప్రా

అశ్వమేధమ్మున కాహ్వాన మంపిన వసుధేశు లందరు వచ్చినారు

వారంత తులలేని వైవిధ్య భరితమౌ దివ్యబహూక్య్ళతుల్‌ దెచ్చినారు

ఇచ్చట మనపాౌరు లిడిన స్వాగతమును మిక్కుటమ్ముగ మదిన్‌ మెచ్చినారు వసతి సౌధములందు పనిజేయు వారల కిరుహస్తముల కాన్మ లిచ్చినారు

సవన నిర్వాహకులు శాస్త్రసమ్మతముగ యజ్ఞ్జశాలకు మెరుగుల నద్దినారు రాజ్ఞ్యమంతట సవనకోలాహలమ్ము తాండవించుచు నున్నది దశరథేంద్ర ! యజ్ఞశాలకు నేడు నీ వరుగుదెంచి అచటి యేర్హాట్ల నెల్ల నాద్భంత మరసి తృప్తినందిన తదుపరి బుపష్యశ్యంగ మునికి జాపించు టొష్టగు నని వచించె. కులగురువు మాటమేరకు

తిలకించెను యాగశాల ద్విజముఖ్యులతో గలసి నరేంద్రుడు ముదమున

పులకింతలు మానసమున పొంగులు వారన్‌.

అంతలోపల భూతలమంత దిరిగి దశరథుని ఖ్యాతి నాలుగుదిశల చాటి విజయదర్దము మోమున వెల్లివిరియు నటు లయోథ్యకు సవనాశ్వ మరుగుదెంచె.

ఎట్టి ఆటంకములు లేక ఇలను చుట్టి దిగ్విజయముగ నగరికి తిరిగివచ్చి నట్టి తురగము మోమున బొట్టు వెట్టి హారతులుబట్ట్‌ పూజించె! యాగశాల. పుణ్యసరయూనదీతీర భూములందు ష్యథ్వి యచ్చెరువంద నిర్మించినట్టి యజ్జవాటికయందు నత్యంత వైభ వముగ కులగురుశ్రేష్ణు నాధ్వర్యవమున.

19

49

50

51

52

53

54

20 మల్లెమాల రామాయణం

తే. బుష్మ్యశ్యంగుడు బ్రహ్మగా నితర బుషులు నవ్మబిత్విగ్గణమ్ముగ భవృరీతి లక్షలాది యతిథుల సమక్షమందు రాణ యొప్టార యజ్ఞ మారంభమాయె.

తే. _ క్షాతలేంద్రుని దివ్యసంకల్ణబలము మునిగణమ్ముల మేలి దీవెనల బలము సవన మారంభమైనట్టి సమయబలము మూడు జతగూడి కనువారి ముదము బెంచె.

ఆ. పంక్తిరథన్యపాలు ప్రాభవ మ్మేపార సకల వేదమంత్రసమ్మతముగ క్రతువు మూడునాళ్ళు క్రమబద్ధముగ సాగి అఖిలజగతి మెప్ప లందుకొనియె.

చ. సవనము సాగినన్ని దివసమ్ములు రాజులు బ్రాహ్మణోత్తముల్‌ కవులు కళావిశారదులు కార్మిక కర్షక గ్రామవాసులున్‌ చవు లెగజిమ్ము విందులను సారెకు సారెకు నారగించి యీ భువి నిబువంటి సత్సభువు పుట్టునె యెన్ని యుగాల కేనియున్‌.

ఆ. అనుచు ముచ్చటించుకొను టబ్బురము కాదు వచ్చినట్టి వారి కిచ్చినట్టి వివిధ బహుమతులకు విలువ యింతని కట్ట ధాతకైన గాని తరము గాదు.

ఆ. _ బాల బాలికలకు స్త్రీలకు స్వయముగా రాణు లిడిరి మేలికానుకలను; ప్రభువు దాన మొసగె బ్రాహ్మణోత్తములకు ఆశదీర నగ్రపారములను.

ఆ. అశ్వమేధ యాగ మవని యంతయు మెచ్చు నటుల నిర్వహించి నట్టి గురుని ముని వసిష్ణు నరసి జననాథు డతిభక్తి గొలిచి ధన్మ్యవాదములను దెలిపి.

ఆ. అంత యాగబ్రహ్మృయగు బుష్మ్యశ్యంగుని కలసి పదములంటి కరము మోడి సకలపాప రహిత సవనమ్ము నేటితో ముగిసె శుభకరముగ మునివరేణ్య!

55

56

57

58

59

60

61

62

బాలకాండము

త్రూ

ఇట్టి సంతోష వేళ నే నెరుగజేతు

మీకు నా విన్నపమ్మును లోఠమాన్న! పుత్రసంతాన లబ్ధి నేబొందునట్టి

క్రతువు జరిపించి పుణ్యము గట్టుకొమ్ము. పుత్రకామేష్టియను నట్టి పుణ్యక్రతువు వలన నలుగురు కొమరులు గలుగ గలర టంచు దీవించి మునివరుం డాదినమ్మె

యాగ మారంభమును జేసె నతిముదమున.

వేద మంత్రాలతో హోమవిధు లొనర్జి బుష్ప్మశ్యంగుడు క్రతువు జేయింపదొడగె అంతకంటెను ముందర యజ్ఞభాగ ములను గైకొనవచ్చిన మునులు సురలు.

అచట వేంచేసి యున్నట్టి యజుని గలసి ముక్త కంఠాన ప్రార్థించి మొక్కు లొసగి పద్మసంభవ ! మీచేత వరములంది మరణ మంటదు తనకన్న మదముతోడ రాక్షసాధీశుడైనట్టి రావణుండు పాపభీతిని నీతిని పారద్రోలి

సురగరుడ సిద్ధ యక్ష కెన్షర గణముల బెట్టు బాధలు లోకాల పెచ్చు మీరె. అమరేంద్రు పీఠమ్ము నాక్రమించు దురాశ తో యుద్ధములు సేయు దుష్టు డతడు భర్తల హతమార్చి భార్యల చెరబట్టి శీలమ్ము దోచు దుశ్మీలు డతడు

మునులు నల్పెడు యాగములు ధ్వంస మొనరించి

చెలగి హింసించెడు చెనటి యతడు కల్గోలముల రేపి ముల్లోకముల సిరి కొల్లగొట్టెడు మహాక్రూరు డతడు సాగరుని సూర్యు ననిలుని సైత మేను చలన మాపించగలనన్న్ష స్వాతిశయము నెత్తి పైకెక్కి సివమెత్తి నేలమీద నిలువకున్నాడు వాడొక్క నిముసమైన.

21

63

65

66

67

68

69

22

మల్లెమాల రామాయణం

అట్టి తైలోక్యకంటకు హత మొనర్య్శు

మార్గమును మీరె సూచించి మమ్ము గావు

డనుచు మొరపెట్టుకొనిరంత వనజభవుడు

క్షణము యోచించి వారితో ననియె నిట్లు. 70

సురగరుడ దైత్యయక్షకిన్షరుల వలన

మరణ మతనికి లేదు నా వరము వలన

మానవుడు తప్ప వానిని మరి యొకండు

చంప సాధ్యము కాదిది సత్త మనియె. 71

అంతలోపల నచట ప్రతృ్యక్షమాయె

విమలతేజస్స్వరూపుడు విష్ణుమూర్తి

వారి దర్శనభాగ్యము వర మటంచు

నెంచి సురలంత కేల్మోడ్డి యిట్టు లనిరి. 72

అచ్ముతా! మాదు ప్రార్థన నాలకించి

పుత్రసంతాన లబ్ధికై పుణ్యక్రతువు

సలుపుచున్నట్టి దశరథ సార్వభౌము

కొడుకుగా బుట్టి రావణు గూల్చివలయు. 73 అని వేడిన సురలను హరి

యనునయమున బార జూచి యటులే నేనీ

యినకులపతి తనయుడనై

జనియించెద దనుజపతిని జంపుట కొరక. 74

సకల బంధుమిత్రసంతానయుతముగా

రణమునందు రావణుని వధించి

లోకములకు శాంతి చేకూర్చి పెక్కేడు

లీ ధరాతలమ్ము నేల గలను. 75

అనుచు నభయ మిచ్చి యందర దీవించి

మాయ మాయె నటులె మాధవుండు;

సురలు మునులు హరిని స్తుతియించి పూజించి

హర్ష పారవశ్య మంది రపుడు. 76 అంతబ్రహ్మోదిదేవత లవనిపతికి

దీవన లొసంగి వేగ నద్యశ్యులైరి;

అంతలో యజ్ఞకుండ మధ్యమ్మునుండి పరమ తేజస్ల్లరూపుడు పైకి లేచ. 77

బాలకాండము

ఆ. పసిడి పాత్రచేతబట్టి లేచిన దివ్య పురుషు నరసినట్టి పుడమివిభుడు మాటి పెకలనట్టి మధురానుభూతితో నప్రయత్నముగనె అంజలించె.

తే. అంత నామహాపూరుషు డతిముదమున దశరథుని జేరి పాత్ర నాతని కొసంగి ఇందులోనున్న పాయస మిపుడె నీవు రాణులకు నిమ్ము! పుత్ర సంప్రాప్తి గలుగు.

ఆ. అనుచు శుభము దెలిపి యతని మన్నన లంది యజ్ఞ పురుష డటులె యరిగె దివికి అంత ప్రభువు చేరె నా యజ్ఞవాటిక యందునున్న యట్టి అంతిపురము.

ఆ. పాయసమున సగము పట్టపురాణి కౌ సల్య కొసగి కడమ సగమునందు సగము ప్రీతితోడ సతి సుమిత్ర కొసంగి మిగులు సగములోన సగము దీసి.

తే. ప్రియసతీమణి కైకకు ప్రేమతోడ నిచ్చి మిగిలిన సగము తా నిచ్చమెచ్చి మరల నిచ్చె సుమిత్రకు ధరణివిభుడు మువ్వురును మేలు మేలని మురియు లీల.

.. అంత కొన్షినాళ్ళ కంతఃపురమ్మున రాజు సంతసింప రాణులెల్ల గర్భములను దాల్చి కలలు సాకారమౌ దినము దగ్గరాయె ననుచుమురిసి.

ఆ. చెలుల కందరకును పలు కానుకల నిచ్చి పేరటాండ్ర బిలిచి చీర లిచ్చి పట్టణమ్ములోని ప్రతిదేవళమ్మున అర్చనలను సలిపి రమితభక్తి.

తే. ధర్మపత్ములు గర్భము దాల్టిరన్ష సంబరమ్మున దశరథ చక్రవర్తి స్వయముగా తానె వారల పవలు రేలు పలు తెరంగుల నుల్లాసపరచుచుండె.

23

78

79

80

81

82

83

84

85

24

త్ర

అతిశయించినట్టి యానంద మెచ్చట కొలువు దీరునట్టి నెలవునందు గడచిపోవు నెలలు గడియలట్లని యంతి పురము దెలియ జెప్పె పురజనులకు. అలుపెరుంగక పరువెత్తునట్టి కాల మామనికి స్వాగతము బర్కె, నంతలోన గర్భవతులైన రాణుల కలలు; పండి

నేల పులకింప వారికి నెలలు నిండే.

శుభకరమ్మగు చైత్రశుద్ధనవమి పున ర్వసు నామనక్షత్ర రాజయుక్త

కటక లగ్షమ్మున కౌసల్య ప్రసవించె మోహనరూపుడౌ ముద్దుకొమరు; మరుసటి దినమునం దరుణోదయమునకు ముందు పుష్యమితార మురియులీల మీనలగ్ష్నమ్మందు మానిని కైకేయి

చక్కనౌ సుతునకు జన్మనొసగె;

దినమె సూర్యు డుదయించినట్టి పిదప సతి సుమిత్ర ఆశ్లేష నక్షత్రయుక్త కటకలగ్నాన సుందరాకారములకు దర్భణము లైన సుతుల నిద్దరను గనియె.

రాచనగరులోన రాకుమారులు నల్వు రుదయ భాను లట్టు లుధ్ధవించి రన్నవార్త నగర మాలించి పులకించి వాడవాడలందు నాడి పాడె.

పంక్తిరథుని హృదయ పద్మమ్ము వికసించె పొంగి కడలి అలలు నింగి కెగసె

గుళ్ళు గోపురములు గొంతెత్తి నినదించె విశ్వమంత ముదము వెల్లివిరిసె.

వంశ ముద్దరింప వరపుత్తు లుదయించి రింతకన్ష నా కికేమి వలయు

ననుచు దశరగధథేంద్రు డవనీసురుల బిల్చి బహుముఖాల ధనము పంచిపెట్టి.

మల్లెమాల రామాయణం

86

87

88

89

90

91

బాలకాండము

తే

త్రూ

పదునొకండవ దినమున ప్రభువరేణ్యు డంతిపురమును స్వర్గతుల్యముగ మార్చి శిశువులకు నామకరణమ్ము జేయు డనుచు చేతులను మోడ్డి వేడె వసిష్టమునిని.

భాసురాకారుడౌ కౌసల్య తనయుని

ముని వసిష్టుడు రాము డని వచించె: కనులపండువు సేయు కైకేయి ముద్దుల తనయుని భరతాఖ్యు డని వచించె: తరుణి సుమిత్ర సంతానమందున పెద్ద తనయుని లక్షణు డని వచించె; కవలలోపలను రెండవవాని తనివార గనుగొని శత్రుఘ్ము డని వచించె; కులగురువు నోట బలికిన తొలి పలుకులు వేదమంత్రాక్షతలుగ భావించి తల్లు

లా మహామౌని దివ్యపాదారవింద

ములకు ప్రణమిల్లి రపుడు సమ్మోద మెసగ. అంత నలువురు పిల్లల నతిథు లెల్ల

కొసరి ముద్దాడి తమవంతు కూర్మి పంచి దీవనలు జల్లి ప్రభువు సత్మృతుల నంది చనిరి మధురానుభూతులు గొనుచు వెంట.

అంత లోపల పసిడి ఊయలలు మూడు చెలులు గొనితెచ్చి తల్లుల చెంతనిలిపి; రంత కౌసల్య తన బిడ్డ నతిముదమున నొక్కడోలికలోన తా నుంచి మురిసె.

ఎదుట నున్నట్టి జంట ఊయెలను జూచి కోరి చేయించె కవలల కొరకు ప్రభు

టంచు మది నెంచి యిద్దర నందులోనె నిండు మదిని సుమిత్ర పరుండ బెట్టె.

మిగిలిన ఊయెలయందున

నగుమోమున కైక కూర్మినందను నుంచెన్‌ ముగురమ్మలు వెంటనె తి

న్షగ డోలల నూపు టరసి నాథుడు మురిసెన్‌

25

92

9౩

94

95

96

97

26

లై

భరతుడును రాము డానంద పారవశత అమ్మలను జూచి కేరింతలాడుచుండ కవల లిద్దరు తల్లిని గాంచకుండ ఒత్తిగిలి అన్ష్నలనె చూచుచుండి రపుడు. సతి సుమిత్ర కుమారుల స్థితిని గాంచి వారిచూపులలోని భావమ్ము నెరిగి రాము సరసన లక్షణనామధరుని భరతు సరసన శత్రుఘ్ము బండబెట్టె. దగ్గరైనట్టి చిట్టి సోదరునిపైన బుల్లిరామయ్య వెదజల్లె బోసినవ్వు; అన్షరాముని మోము కన్నార్దకుండ చూడ దొడగెను లక్షణు డాడుకొనుచు. చిన్షితమ్ముడు తన ప్రక్క జేరెనన్న ముదము భరతునిమోమున మొగ్గదొడిగె: నటులె మన మిద్దరము జతయనిన లీల నరయ దొడగెను శత్రుఘ్ము డన్నవంక.

క్షణమ్మునుండి యా నల్వురును రెండు జంటలైరి కనుల పంటలైరి; ఆటపాటలందు అన్షపానములందు పవలు రేలు జంట బాయరైరి.

అక్షరాభ్యాస శుభారంభ సమయాన నలువు రొకే మాట పలికినారు; సత్యసౌజన్మాది సచ్జీలములయందు నలువు రొకే రీతి మెలగినారు;

లౌకిక వ్యవహార లక్ష్య సాధనమందు నలువు రొకేబాట నడచినారు:

వేద శాస్త్రపురాణ విద్య లన్షిటియందు నలువురు సమముగా నిలిచినారు; నలువురును ధనుర్వేదమునందు సైత మతులితమ్రైన నైపుణ్య మందినారు; కన్న్షతండ్రిని గురువు నొక్కటిగ నల్వు రెపుడు సేవించి క్రమముగా నెదిగినారు.

మల్లెమాల రామాయణం

98

99

100

101

102

103

బాలకాండము

వేటకై రామభద్రుడు వెడలెనేని లక్ష్మణుడు వెంట జను నంగరక్షకుడుగ లక్ష్మణుడు తోడులేనిదే రామచంద్రు డడుగు కదపడు రాజహర్మ్యమ్మువీడి.

అటులె శత్రుఘ్నుడు భరతునంటియుండి వలయు సేవలు నిరతమ్ము సలుపుచుండు; భరతుడును చిన్న సోదరు నరనిముసము బాసియుండగ నోప డా బంధమేమొ!

కార్యదీక్షయందు క్రమవర్తనమునందు నీతిసరణియందు నియమమందు ధర్మనిరతియందు తనను మించిరి పుత్రు లన్న ముదమునందె నవనివిభుడు.

బాల్మ్యమాది రామభద్రుని మోములో తనను తాను జూచుకొనెను ప్రభువు: పట్టణమ్ములోని ప్రజలును రామునే

దైవ మటుల మదిని దలచినారు లోకమందున సమముగా రాకుమారు లండరును పేరు ప్రఖ్యాతి నందుకొనిన తనయులందున మువ్వురు తల్లులకును రామచంద్రుని మీదనే ప్రేమ మెండు.

దైవక్ళ్యపవల్ల పుత్రు లందరును నేడు

ప్రాప్త యౌవనులైనారు! బంధుమిత్ర గణము మెచ్చగ వైవాహికములు జరిపి తృప్తినింశార ముచ్చట దీర్షుకొందు.

అని మనమ్మున దలపోసి యవనివిభుడు కులగురువరేణ్యు నితర ముఖ్యులను బిలిచి తన మనోభీష్టమును దెల్టి తగు విధమున యత్న మొనరింపు డనిపల్కె నంతలోన. ద్వారపాలకు డరుదెంచి తలను వంచి వందనముచేసి ముని గాధినందనుండు పరమగంభీరముగ రాజభవనమునకు వడిగ వేంచేయు చున్నారు ప్రభువరేణ్య!

27

104

105

106

107

108

109

110

28 మల్లెమాల రామాయణం

©. అనుచు విన్షవించె నంత భూపాలుడు

హితగణమ్ముతోడ నెదురువెడలి

అర్థ్యపాద్యవిధుల అతిభక్తి పూజించి

మౌని వరుని గొనుచు లోనికరిగి. 112 క. పిలువక పలికెడు దేవుని

వలె విశ్వామిత్రు నెంచి వసుధేశుడు ని

శ్రల భక్తితోడ హస్త

మ్ములు మోడిచి పలికె నిట్లు మునితిలకునితోన్‌. 113 తే తాపసోత్తమ! నాకొల్వు ధన్యమాయె

ఇపుడు మీరాక వలన, నేనేమిసేయ

వలయునో తెల్టి జన్మసాఫల్య మొందు

నట్టి భాగ్యము దయసేయు డనుచు వేడే. 114

తే. దశరథుని దివ్యభక్తి తత్సరత మెచ్చి యా మహామాౌని పులకించి యభినుతించి ఇనకులేశ్వర! నీవు కోరిన విధమున నాలకింపుము నే వచ్చినట్టి పనిని. 115

ఉ. _ నే నొక యాగమున్‌ సలుప నెంచితి దీక్షను స్వీకరించితిన్‌ కాని, మహాభయంకరులు, కల్మషబుద్దులు, కామరూపులొ దానవు లిద్ద రాక్రతువు ధ్వంస మొనర్షుచు రక్తమాంసముల్‌ పూనిక నగ్గికుండమున బోయుచునుండిరి మాటి మాటికిన్‌. 116

మారీచ సుబాహుల

నామానసబాధ దీర నాశ మొనర్చన్‌

ఏమాత్ర మడ్డు జెప్టక

రాముని నాతోడ బంపు రాజవరేణ్యా ! 117 ఉ. ఆడినమాట తప్పవని యాత్మదలంచి మనోగతమ్ము నీ

తోడ వచించితిన్‌ కనుక దొడ్డ మనమ్మున రామచంద్రునిన్‌

తోడుగ యాగరక్షణకు తోడ్డడ బంపుము నేడె! దాన చే

కూడును నీకు సడ్యశము కోరిక నాకును దీరు భూవరా! 118 తే సత్యసంధుడు కారణజన్ముడైన

రాము డవలీల జంపు నా రాక్షసులను;

నే ప్రసాదింతువానికి నిఖిల లోక

విజయ మొనగూర్చు శక్తుల ప్రీతితోడ. 119

తే. రామచంద్రుని శౌర్యపరాక్రమములు సిద్ధయోగీంద్రుడైన వసిష్ణు డెరుగు నే నెరుంగుదు కావున నిర్ధయముగ నతని బిలిపింపు మిప్పడే అవనినాథ! 120

క. అని గాధేయుడు పలికిన

నినకులపతి భీతిజెంది, యిదినేనూహిం

చని సంఘటన మ్మిపు డే

మని బదు లిచ్చిదను మౌని కని చింతించెన్‌. 121 తే. ప్రాణసముడైన రాముని దానవులను

జంపు పనిమీద అడవికి బంపలేక

ఆగ్రహావేశియగు బుషి కడ్డుజెప్ప

ధైర్య మావంతయును లేక దశరథుండు. 122

తే. ఆసనము డిగ్గి బ్రహర్షి కంజిలించి

తడబడెడు గొంతు పలుమార్లు తడవుకొనుచు

చివరి కెట్టులొ మనమునుచిక్కబదట్టి

వినయ మేపార నీలీతి విన్నవించె 123 తే. పట్టుమని పదునారేండ్ల ప్రాయమైన

రాని పసివాడు రాముడు ! రాక్షసులను

జంపుటకు తాను చాలడు సంయమీంద్ర!

అరుగుదెంచెద నేనె సైన్మ్యమ్ము తోడ 124

తే తమరు నిశ్రింత నుండుడా దానవులను

నేను సంహార మొనరించి నిఖలజగతి

మెచ్చ యాగము మీ యిచ్చవచ్చురీతి

పూర్తియగుదాక కాపుందు మోద మలర 125 ఆ. సంయమీంద్ర! వయసు సడలిన పిమ్మట

దైవక్యపను నాకు దక్కినట్టి

యాగఫలము రాము డన్నయథార్థము

మీకు దెలియు, నెల్లలోక మెరుగు. 126 తే రాముడెదురుగ లేక నా ప్రాణ మొక్క

నిముస మేనియు బొందిలో నిలువబోదు;

కనుక దయయుందచి నారాక కనుమతిండ

టంచు బ్రార్థించె గాధేయు నవనివిభుడు. 127

30

మల్లెమాల రామాయణం

దశరథుని వేడికోలు నా తాపసేంద్రు

డనుమతింపక క్రుద్గుడై యవనినాథ!

ఆడి తష్టని రఘువనంశమందు బుట్టి

మాట దప్టిన నీతోడ మాటలేల ? 128

హితవుగాని పల్కు లతివినయమ్మున

బలికినందువలన ఫలము లేదు;

పాద మిచట మోపి భంగపడితి నేను

సిద్ధయోగి వరు వసిష్టునెదుట. 129

చాలు చేసిన మర్మాద చాలు చాలు

వలదు నీ సాయ మినసుమంత వలదు నాకు;

యతులతో నెప్ప డీరీతి నాడుకొనకు

ధర్మమును కాలరాయుట తగదు నీకు. 130

అని కౌశిక మౌనీంద్రుం

డనినంత వసిష్ణు డతని యాగ్రహసరణిన్‌

గనుగొని పృథ్వీశునితో

ననునయ వాక్యముల బలికి నందరు వినగన్‌. 131

పంక్తిరథ! నీవు తొందరపాటు తోడ

వమలబుషివర్యు మనసు నొప్పించినావు;

అఆడిదప్పట పాడిగా దనెడు సూక్తి

ధరణినాథుడవై యుండి మరచినావు. 132

గాధిసూతికి మూడులోకములయం

సాధ్య మైనది లేదన్న సత్యమీవు

విస్మరించుట నారసి విస్మయమ్ము

జెందితిని గాన వినుము నే జెప్పమాట. 133 సవనమున కడ్డు తగులు నిశాచరులను

చిటికెలోపల భస్మము జేయజాలు

శక్తి గలిగియు బ్రహ్మర్షి సకలలోక

ములకు రాముని శౌర్యమ్ము దెలుప దలచి. 134 స్వయముగా వచ్చి నీ సుతున్‌ పంపు మనియె

నది గ్రహింపక నట్టింటి కరుగుదెంచి

నట్టి వరమును త్రోసి రాజనుట తగునె?

అడ్డు జెప్టక మునివెంట నంపు మతిని. 135

బాలకాండము

31 కులగురువు ముందుచూపున బలికిన హితవచనములను పంక్తిరథుండున్‌ తలదాలిచి రాముని ముని తిలకునితో బంప సమ్మతించెను ప్రీతిన్‌ 136

ఉ. అంత వసిష్టమౌని దరహాసము మోమున జాలువారగా చెంతనె నిల్షియున్న ప్రియశిష్ణుని గన్ల్గొని నీవు వెంటనే యంతిపురమ్ము జేరి క్షణమైనను జాగొనరించకుండ ధీ మంతుల రామలక్షణుల మాకడకున్‌ గొనితెమ్ము పొమ్మనెన్‌. 137

తే కౌశికుం డంత శాంతించి క్షాతలేంద్ర! నీవు నిశ్చింత నుండుము నేను రామ లక్ష్మణుల వెంట గొనిపోయి రాక్షసులను నిలువునన్‌ గూల్బు శక్తుల నిడెద ననియె. 138

తే అంతలోపల తల్లుల యాశిషమ్ము లందుకొని రామలక్ష్మణు లరుగుదెంచి తొలుత తండ్రికి ఆవల కులగురునకు నవల బ్రహ్మర్షికిని మొక్కి రమితభక్తి. 139

తే ధరణిపతి కూర్మి తనయుని దాశరథిని దగ్గరకు జిల్చి శిరము ముద్దాడియాడి బ్రహ్మబుషివర్య ! మీయదే భారమింక ! ననుచు రాముని మునిచేతి కప్పగించె. 140

తే లక్ష్మణుడు వెంటనే యన్న ప్రక్క నిలిచె మంచిదని వసిష్టుడు శుభమంచు బలికి సదనమంతట పుష్టవర్షమ్ము గురిసె తనువు పులకించి రాముని ధనువు మురిసె. 141

తే కౌశికుని వెంట రామలక్షణుల జంట

బయలుదేరెను కన్నుల పంటయగుచు

క్షితితలేంద్రుడు చనుచున్న సుతులపైన

మౌనముగ దీవెన కనులతోనె చల్లె. 142 ఆ. శివుని వెంట నగ్ని శిఖలట్లు మునివెంట

రాకుమారు లిద్ద రరిగి యరిగి

శ్రమ యొకింత గనక సరయూనదీతీర

మునకు జేరి రమితమోద మలర. 143

32 మల్లెమాల రామాయణం

ఉ. అప్పడు గాధిసూతి ప్రియమారగ బల్కెను రామ! వాహినిన్‌ చప్పున నాచమించి జలజాప్త్రన కర్ష్యము సల్టి రమ్ము, నే నిప్పుడు రెండు మంత్రముల నీ కుపదేశము జేతు, అవ్వి ని న్నెప్పడు గాచియుండు భువి నెల్ల శుభమ్ములు నీకు చేకురున్‌. 144

క్ర అని గురుదేవుడు తెలిపిన వెనువెంటనె రాము డరిగి విధు లన్షింటిన్‌ దినకరు నాత్మ దలంచుచు క్షణమున ముగియించి మౌనికడ కేతెంచెన్‌. 145

తే. బ్రహ్మబుషియంత బల, అతిబలయు ననెడు దివ్యమంత్ర ద్వయము నుపదేశ మొసగి వీని స్మరియింప, నీ కెల్లవేళలందు నలసటయు క్షుత్తిపాసలు నంటకుండు 146

తే. అంతియేగాక శౌర్య ధైర్యమ్ములందు భుజబలమునందు యుద్దనైపుణ్యమందు నిన్ను మించిన యోధు డెనిఖిల జగతి యందు మరి యొకడుండ బోడని వచించె. 147

తే అంత నాయన్నదమ్ములు సంతసమున మునివరేణ్యున కుపచారములను సలిపి గురునితో గూడి యా రాత్రి గరికసెజ్జ పైన బవళించినా రిరు ప్రక్కలందు. 148

క్ర మరుసటి దినమున కౌశికు డరుణోదయమునకు ముందె యలవాటుగ, ని ద్దురలేచి రాకుమారుల నరసి మదిన్‌ మురిసి యిట్టు లనె మెలమెల్లన్‌. 149

తే. నాయనా! రామ! తొలిసందె నడచుచున్న

దడవి సైతము మేల్కొన్న దాహ్నికములు

స్నాన సంధ్మాది కృత్వముల్‌ సలుపవలయు

లెమ్ము! వేళాయె నని నిద్రలేపె మౌని 150 తే. అంత నా రామలక్ష్మణు లమిత శ్రద్ధ

నుదయక్య్ళత్మాలు ముగియించి యురికి వచ్చి

గురువు పాదమ్ములకు మొక్కి పరమమౌని

వెనుక నడచిరి భక్తియు వినయ మెనయ. 151

బాలకాండము

తే

a

అటుల మువ్వురు చాల దవ్వరిగి యరిగి గంగయును సరయూనది సంగమించు నట్టి పుణ్యస్థలిని జేరి యచట రాత్రి

యతివతంసుల యాతిథ్య మందుకొనిరి.

ప్రొద్దుపాడువున లేచి పుణ్యనదిని దాటి మువ్వురు బిరబిర దక్షిణముగ నడచి యొకచోట ఘోరకాననములోన నడుగుమోపిరి యిసుమంత అలుపులేక.

మహారణ్యమును గని రామభద్రు డబ్బురము నంది గురుదేవ! అతిభయంక రముగ గన్సట్టుచున్నటీ ప్రాంతమంత మానవుం డెవ్వడును చౌోరరాని పగిది.

అనుచు వచియించె నంతలో ఆకసమ్ము బ్రద్దలౌనంత భీకరారాన మొకటి కూరమృగరాజముల పెనుగుండె లదుర దిక్కు లన్షిటియందు ప్రతిధ్వనించె.

యరుపు పూర్వ మెరిగిన దగుట వలన మునివరేణ్యుడు రాముని మోము జూచి

కామరూపిణి తాటక నామధేయ

యైన యక్షిణి అరుపది యనుచు దెలిపె

కలదు దానికి నొకవేయి కరుల బలము కొడుకు మారీచుతో గూడి అడవివెంట జనెడు మనుజుల నవలీల జంపితినుట నిత్వేకృత్యము దాని కీ నెలవు నందు.

నరఘాతుకురాలిని

కానన మానంద మొంద కర్శశముగ నీ

వే నిర్ణింపగ వలయును

మానిని యను భావమింత మది నిడకుండన్‌ అనిన గురుదేవునకు రాము డంజలించి జనకు నానతిమేర నిళ్ణంశయముగ

తమ మహాదేశమును నేను తలను దాల్చి గ్రక్కున నొనరు నెట్టి తర్మమ్ములేక.

33

152

153

154

156

159

34

మల్లెమాల రామాయణం

తాపసోత్తమ! లోక హితమ్ముగోరి

దుష్ట యక్షిణి తాటకన్‌ ద్రుంతు నిపుడె

యనుచు మిక్కిలి గాంభీర్య మెనయ బలికి

అర్కకులభూషణుడు ధను వందుకొనియె. 160 తొట్టతొలుదొల్త విల్లెక్కు వెట్టినట్టి

దాశరథి యల్లె త్రాటిని తాపసేంద్రు

డలరునట్టుల దిగ్దంతు లడలు నటుల

గోట మీటెను వనము గగ్గోలు పడగ. 161

భయంకర రవమున కాగ్రహించి

కడు విక్ళృతరూప పర్వతాకారయైన

పాప తాటక రాముని పారజూచి

పెద్ద పెట్టున నరచి కుష్టించి దూకి. 162

కాని రాముడు కానంత కలతపడక

ఆపవే యింకచాలు నీ యాగడమ్ము

లనుచు యక్షిణి బాహుద్వయమ్ము నరికె

దివ్యశరములు రెండు సంధించి వదలి. 163

అంతట రెచ్చిపోయి దనుజాంగన మాటికి హుంకరించుచున్‌ గంతులు వేయుచున్‌ చెలగి కన్నుల నగ్గి కణాలు రాల్హుచున్‌ పంతముతోడ రాఘవుని పై కొనజూచి, ఫలంబులేమిచే చింతిలుచున్‌ స్వరూపమును శీఘ్రమె మార్చదలంచె నంతలోన్‌. 164 రాఘవా! సాంధ్యకాలాన రాక్షసులకు

బలము పెరుగును కాన నా భ్రష్ట నిపుడె

జాగుసేయక నిర్దయన్‌ సంహరింపు

మని వచించెను ద్యఢముగా మునివరుండు, 165

గురుని యానతి తలదాల్లి త్వరితగతిని

కఠిన తరమైన దాని వక్ష్యస్థలమ్ము

లక్ష్యముగ జేసి బాణ వర్షమ్ముతోడ

తాటకను రామభద్రుండు ధరణి గూల్ఫె. 166

అంత మునికుంజరుడు కడు సంతసమున రఘుకులోత్తము గొనియాడి రాత్రి కిచట

హాయిగా విశ్రమించి రే పరుగు టొప్ప

ననుచు దెలిపెను కానన మ్మలరునటుల. 167

ME i!

?

బాలకాండము

తే

Wn

మరునాడు వేగుశామున పరమమునీంద్రుండు లేచి భాసురగుణశీ లుర ప్రియతమ శిష్ణుల, ని

దుర లేపెను తల్లివోలె తూరుపు మురియన్‌.

అంత మువ్వురు స్నాన సంధ్మాదికములు పూర్తి గావించి రాపైన మునినరుండు

రిపుల నవలీలగా సంహరించజాలు నస్త్రముల రామచంద్రున కపుడు దెలిపె రాము డంత నా దివ్య్వమంత్రముల జపము సలిపె వెంటనె యస్తముల్‌ నిలిచె నెదుట వాని గైకొని మీరు నా మానసమున

నెపుడు నివసించు డని తెల్పి యినకులుండు.

వినయ మేపార మునికుంజరునకు మొక్కి స్వామి! దివ్యాస్త్రముల నుపనంహరించు నట్టి మంత్రము గూడ నా కాదరమున నిపుడె బోధింపు డంచు బ్రార్ధించె నంత భూరిగుణుడు రాము దూరదృష్టికి మెచ్చి మౌనివర్శుడతని మాట దీర్జె.

అంత కొంత దూర మరిగి యా మువ్వురు నడుగు మోసి రొక్కయాశ్రమమున అదియే విశ్వామిత్రుని

సదన మృట నున్న సాధు జనులందరు, మ్ముదితాత్ములై యతీంద్రుని

పదముల కిడి రెన్నొ నతుల బహుమతు లెలమిన్‌.

గాధి తనయుడు రామలక్షణుల నచటి యతివరేణ్యులకు పరిచయమ్ము వేసి యాగనంరక్షణార్గమై యిరుగుదెంచి

నట్టి క్షత్రియపుత్తు లటంచు దెలిపె

తాపసాశ్రమమ్మున

నాతిధ్యము స్వీకరించి యవనీంద్రుసుతుల్‌ చేతోమోదము గని నం

ప్రీతిమెయిన్‌ పలికి రిట్లు బుషితిలకునితోన్‌.

35

168

169

171

tee

36 మల్లెమాల రామాయణం

గురుదేవ! మేము సిద్ధము త్వరగా వ్రతదీక్షగొనుడు దనుజాధములన్‌ పరిమార్చి యాగరక్షణ నిరతిన్‌ గావింతు మనిరి నిర్హ్వంద్వముగాన్‌. 176

తే. _ శిష్యులా రీతి బలుక బుషీశ్వరుండు వెంటనే యజ్ఞ దీక్షను స్వీకరించ; రామలక్ష్మణు లిద్దరా రాత్రియంత జాగరూకత గడపిరి వేగు లట్లు. 177

తే, అంత మునులంత వారల నభినుతించి ఆరు దినములు జరుగునీ యధ్వరమ్ము అసుర క్యృత్యమ్ములకు నొకయదను లేదు నిముస మేమి చేతురో యెరుగరాదు. 178

తే కనుక మీ యిద్దరే యొక్క క్షణము గూడ ఖెష్టవాల్చక బాణము లెక్కు వెట్టి అప్రమత్తతతో నుండు టవసరమ్మ టనుచు దెలిపిరి రామలక్ష్మణులతోడ. 179

తే. అంత నా సోదరద్వయ మ్మయిదునాళ్ళు నిద్రకన్షెరుగక యహర్షిశలు కాచి రధ్వరమ్మును గురుదేవు డబ్బురపడ భక్తి శ్రద్ధలతో యతీశ్వరులు మెచ్చ 180

ఉ. ఆరవనాడు యజ్ఞవిధు లన్ని యథావిధి సాగుచుండగా ఘోరభయంకరధ్వనులు కొండలు కోనలు దద్దరిల్లు, ట్లూరక మారుమోగె; నవు డుద్ధత రీతిని వహ్మికీలికల్‌ బారులు దీరి క్రమ్ముకొనె భగ్గున మండె యతీంద్రచిత్తముల్‌. 181

ఉ. _రాచకుమారు లిద్ద రది రాక్షసకృత్యముగా దలంచియున్‌ పూచికపుల్లయెత్తు భయ మొందక ధీరత నిల్చి రంతలో వీచెను హోరుగాలి కురిపించిరి యాగమవహోగ్ని యందు మా రీచ సుబాహు లిద్దరును వ్రేల్మిడి నెత్తురు కుండ పోతగన్‌. 182

తే కాని రాముని కనుల తీక్షతకు వెరచి యజ్ఞకుండాన వాలు ధైర్యమ్ములేక నెత్తు రాచుట్టుప్రక్కలనేల రాలె క్రూూరదనుజుల మద మెల్ల కుప్పగూలె. 183

బాలకాండము 37

ఆ. ఆవిచిత్ర మరసి రాక్షస ద్వయ మాకసమ్ము బెదర నార్భటించె నంత రామభద్రు డా దుష్టులను జాచి కనలి మానవాస్త్రమును గ్రహించి. 184

ఆ. మారుమాట లేక మారీచు వక్షఃస్థ

లమ్ము దాకునట్లు లాగి వదలె

నా మవహాస్త్రధాటి కాతడు శతయోజ

నములు దాటి జలధి నడుమ బడియె. 185 క. _ తత్‌క్షణ మాగ్గేయాస్త

మృక్షీణబలుండు రాము డతిక్రుద్దుండై

రాక్షసవీరు సుబాహవు

వక్షము లక్ష్యమ్ముజేసి వదలెను పెలుచన్‌. 186 క్ర వాడాదెబ్బకు రక్త

మ్మోడుచు పర్వతములీల నుర్విం గూలెన్‌

తోడుగ వచ్చిన రక్కసు

లేడిచి రిక మాకు దారి యేది యటంచున్‌. 187

తే ఇనకులేశుడు హతశేషగణము నరసి పాపకర్ముల నొక్కడు బ్రతికియున్న శాంతి నశియించు నీయజ్ఞశాలయంద టంచు నొక బాణమున వారి నవని గూల్ఫై 188

తే రామచంద్రుని శౌర్యరైర్యముల నరసి సాధుపుంగవు లాశ్చర్య చకితులైరి

యెల్లదెనల ప్రశాంతత వెల్లిఎరిసె

క్రమపథమ్మున మౌనీంద్రు క్రతువు ముగిసె 189 తే కౌశికుడు మేరమీరిన కౌతుకమున

గాఢథముగ రామచంద్రుని కౌగిలించి

ఇనకులోత్తమ! నిన్ను శిష్మునిగ బడసి

నే కృతార్థుడ నైతిని నిశ్చయముగ. 190

రః అని యన్న నభినుతించిన మునిసింహునిపాదములకు ముందుగ మొక్కెన్‌ అనుజుడు, పిమ్మట రాముడు తన నతులను మూటగట్టి తాపసి కొసగెన్‌. 191

38

eb

అంత మునులంత స్త్టోత్రవాక్యాలవిరులు సంతసమ్మున రామలక్షణులపైన

జల్లి రా జల్లులో నిలువెల్లదడిసి ముద్దలుగ మారిపోయిరా యిద్ద రపుడు.

అంతుపొంతులేని యానందమున రాత్రి అన్నదమ్ము లిద్ద రాశ్రమమున

యతిగణమ్ము నడుమ హాయిగా నిదురించి రారునాళ్ళ శ్రమము తీరిపోవ.

తెల్లవారిలేచి తీరుబడిగ స్మాన సంధ్యలెల్ల శాస్త్రసమ్మతముగ సలిపి గురునిజేరి సాష్టాంగవందన మాచరించి నిలిచి రానకొరకు.

కరములను మోడి యెదుట కింకరుల వోలె నిలిచియున్నట్టి రాకుమారులను గాంచి గాధిరాట్టూతి యీూనాడి కదలవలయు మనము మిఖిలానగరమున కని వచించి.

జనకరాజేంద్రు డనుపమసవన మొండు జరుపుచున్నాడు దానికే నరుగవలయు; రండు మీరును వెంట విరాజమాన మైన నూరేళ్ళ శుభము మీకబ్బు నచట.

అంతియే కాదు మిథిలయం దద్భుతమ్ము దైవదత్తమునగు నొక్కధనువు కలదు దాని సంధింప నెంచి యుద్దండులైన వీరు లెందరొ పలుమార్లు విఫలులైరి.

ధనుస్సును రామ! నీ వరయ నలయు ననుచు వాకొని కౌశికు డాశ్రమమ్ము బీడ శిషమ్యలతో గూడి వెడలె నపుడె యతులు కొందరు కడుభక్తి ననునరింప.

దారి పొడవున నతిథిసత్మారములను స్వీకరించుచు శిష్మల వీను లలర స్థలమహత్త్వము అందందు దెలిపియటులె చాల దవ్వేగె ముని అనుచరులతోడ.

మల్లెమాల రామాయణం

192

193

194

196

197

198

193

బాలకాండము

అంతలో మిథిలాపురి కనతిదూర

మందు కన్గించె సువిశాలమైన వనము బ్రతికి చెడినట్టులున్షదీ ప్రాంతమెందు

కని కుతూహలమున రాము డడిగె గురుని.

పరమ ముని యంత శిష్యుని వంక జూచి దాశరథి! పూర్వమిద్ది గౌతముని వనము; ఆత డిచోట పత్ని యహల్యతోడ

ధర్మదీక్షను పెక్కేండ్లు తప మొనర్జె

అంత నొకనాడు గౌతము డాశ్రమమున లేనితరి దేవనాథుడు మౌనివేష మందువచ్చి అహల్బు! నీ పొందు గోరి వచ్చితి నటంచు బల్కెను వలపుమీర.

అతడు తన భర్త కా డింద్రు డని యెరిగియు బుద్ది చలియించి వాని ప్రసిద్ధినెంచి

రమ్ము! సురసార్వభౌమ! నీ రాకవలన మనసు గతిదప్టె నిక మారు మాటలేల?

అనుచు చేసాచి మునిపత్ని యమరవిభుని స్వాగతించెను వెంటనే వాసవుండు

తనివి దీరగ నామె సౌందర్య మెల్ల

కొల్లగొనె నహల్యయు మది నుల్లసిల్లె.

కాని యా వెన్క తనతప్ప కనులముందు నిలిచి ప్రశ్చింప నా కొంత కలవరమున చేయరానట్టి తప్పు చేసితిమి మనము

కనుక నమరేంద్ర! దయయుంచి కదలు మిపుడె.

ఆలసించిన నా భర్త అరుగుదెంచు ననుచు బతిమాలి దేవేంద్రు నచటినుండి పంపె నంతట నా శచీఒల్లభుండు వెనుకజూడక అటనుండి వెడలిపోయె.

అడుగు తడబడ తలవంచి యరుగుచున్న అమర విభునకు మార్గమధ్యమ్మునందు తాన మొనరించి వచ్చు గౌతమమహర్షి కమలసంభవ తేజుడై కంటబడియె.

39

200

201

202

203

204

205

206

207

40 మల్లెమాల రామాయణం

తే తపోబల సంపన్న నరసినంత దోషియగు వాసవుని గుండె దుర్ధ్గలమయి పాపభీతిని గడగడ వణకదొడగె | నతని దుశ్చేష్ట గోచర మ్మాయె మునికి. 208

ఉ. అంత మునీంద్రు డింద్రుగని యాగ్రహ మాకసమంట దుర్శతీ! యెంతటి ఘోరక్య్ళత్యమున కీవు గడంగితి వోరి ద్రోహి ! నీ యంతటి పాపి ముజ్జగములందున వేరొక డుండ బోడు నా స్వాంతము బ్రద్దలాయె నపచారము సైపను నీచవర్తనా ! 209

ఉ. కండలుపెంచి కామమున కన్నులు గానక యాశ్రమాన నే నుండని వేళ జూచి చని యొంటిగనున్న మదీయపత్తితో దుండగముం బొనర్షి కడుద్రోహము నా కొనరించినట్టి నీ యండము లూడి క్రిందబడునంచు శపించె యతీంద్రు డుగ్రుడై.

ఆ. అట్టి ఘోరశాప మమరేంద్రున కొసంగి సంయమీంద్రు డింత శాంతి గనక బుసలు కొట్టు కోపమును వెంటబెట్టుక అరిగె నాశ్రమమున కతిరయమున. 211

ఆ. ఆశ్రమమ్ములోని కడుగిడినంతనే

ఓసిపాపి! యెక్క డుంటివీవు!

మునికులమ్ము పరువు మున్నీటముంచిన

నీ ముఖమ్ము చూడ నేర మగును. 212 ©. సలిపినట్టియఘము క్షమియింప రానిది

అందువలన జీవితాంత మీవు

ఎవరికంటబడక యిచ్చట గాలినే

యశన మటుల మెసవి మసలుకొనుము. 213

ఆ. _ అని శపించినట్టి యాత్మేశు వదనమ్ము

నరయుధైర్య మింతయైన లేక

పాదయుగ్మమంటి ప్రార్థించు సాహస

మైన జేయలేక యా యహల్చు. 214 తే దూరమున నిల్లి కన్నుల నీరునింపి

కరములను మోడి శిలలైన కరగునటుల

పాగిరి యేడ్నుచు శాపవిమోచనమ్ము

నైన దెలుపుడు స్వామి యటంచు వేడె. 215

బాలకాండము 41

తే. ఆమె రోదన మాలించి యతివరేణ్యు

డాత్మలో కొంత చింతించి యాదరమున

పెక్కుసంవళ్ళరాల కీదిక్కు వెంట

నడచు దశరథరాజేంద్రనందనుండు. 216 .. అతని దివ్యద్యష్టి ఆనాడు నీపైన

సోకు నపుడు నీవు శుచి వగుదువు:

పిదప నేను వచ్చి హ్యృదయేశ్వరిగ నిన్ను

స్వీకరింతు నని వచించె మౌని. 217 తే అటుల గౌతమ మౌనీంద్రు డామెపట్ల

నాదరము కొంత బ్రకటించి యాశ్రమమును

త్వరితగతి వీడి నిశ్చింత తపమొనర్ద

నరిగె తుహిన భూధరశిఖరాగ్రమునకు. 218

తే. అండములు తెగిపోయిన యమరనాథు

శాలసింపక వీతిహోత్రాదిసురల

జేరి త్రిదశులక్షేమమ్ము గోరి వెడలి

గౌతముని తపశ్వక్తి భగ్న మ్మొనర్ధి 219 తే. అతని శాపమ్మునకు గురియైతి నేను

కనుక మీరెల్ల నాపట్ల కనికరించి

వడిగ సఫలుని గావింప వలయు న్న

టంచు నతిటీనముగ వేడె నంతవారు. 220

తే. లగ్షిదేవునితో గూడి యా క్షణమ్మె పయనమై యరిగి పితృదేవతల గలసి అఖిలమును తెల్టి రంత మేషాండములను వాసవున కమర్షిరి వారు గాసి దొలగ. 221

ఆ. నాటినుండి త్రిదశనాథుడు మేషాండు డాయె నని వచించె యతివరేణ్యు డంత పంక్తిరథుని యాత్మజుల్‌ ముద మొంది గళము లొకటి జేసి పలికిరిట్లు. 222

చ. జనకుడు గుర్తురానటుల సత్మపమీరగ మమ్ము జూచి, మా కనుపమవిడ్యలన్‌ గరపి యస్త్రము లెన్నొ యనుగ్రహించి, యీ దినము మహర్షి గౌతముని దివ్యకథన్‌ వినిపించినట్టి యో మునికులచంద్ర! గైకొనుము పుత్రు లొసంగు నమశ్శతమ్ములన్‌. 223

42

అని యాసోదరు లిరువురు

తనలో తమ తండ్రి నరసి తన్మయు లొటన్‌ గని విశ్వామిత్రుడు తని

సిన మనమున బలికె నిట్లు శిష్యులతోడన్‌.

పతి యొసంగిన తీవ్రశాపమ్మువలన

సతి యహల్య యామరుసటి క్షణమునుండి

కఠిన నియమాల నెవరికిన్‌ గానరాక తపము గావించుచున్నదీ స్థలమునందు.

ఎపుడు రాము డిచటి కేతెంచు నెప్పడా నళిననేత్రుదృష్టి నన్ను దాకు

ననుచు వేయికనుల నన్న పానీయాల జోలిమాని చూచుచున్నదామె.

అని గురుదేవుడు దెలిపిన

వెనువెంటనె రాముకనులు వెదుకదొడంగెన్‌

మునిపత్మినంత నొకచో కనుపించిన దామె దివ్యకాంతులతోడన్‌.

ఎన్నొయేండ్లనుండి యెంతవారికి గూడ దుర్చిరీక్షయైన దొడ్డవనిత

తనకు గానుపించె నని రఘురాముడు మురిసి మరల మరల నరయ దొడగె.

దశరథాత్మజు శుభద్యష్టి దగులగానె పాపము నశించి రూపవైభవము కలిగె నంత రాముడు లక్షణుం డామె నరసి నతు లొసంగి రహల్య యానంద మొంది.

అర్హ్యపాద్యము లద్దించి యతిథి పూజ సలిపె నంతట గౌతమ సంయమీంద్రు డచటి కేతెంచి యా విశుద్దాంగి నరసి చిత్త మలరార భార్యగా స్వీకరించి. పిదప నా మౌనిదంపతుల్‌ పేర్మిమీర గాధినందనరామలక్షణుల కెల్ల

సకల మర్మాద లొనరించి సాగనంపి కలసి నడచిరి తొల్లింటి నిలయమునకు.

మల్లెమాల రామాయణం

224

225

226

227

228

230

INS

rN AU Ht}

బాలకాండము

అంతట విశ్వామిత్రుం డంతేవాసులను యతుల నందర గొని, తృంతరయమ్మున జని చని సంతసమున మిథిల జేరె జనకుం డలరన్‌.

ఆ. నగరమునకు గాధినందను డేతెంచె ననిన వార్త దెలిసి జనకన్యపతి తనకులగురువగు శతానందుదోడ్కొని స్వాగతింప నెదురు జనియె వడిగ.

క. తనయాగము దర్శింపగ జనుదెంచిన కౌశికునకు సాదరముగ వం దన పూర్వక సత్కారము లను జనకు డొనర్డె మిగుల రాజస మొప్టన్‌. పిమ్మట మిథిలాధీశుం డమ్ముని పుంగవుని దశరథాత్మజులను, జ్ఞమ్మొనరించెడు తావున కిమ్ముగ గొనిపోయె నచటి హితవరు లలరన్‌.

తే అంత వారల కెల్ల సుఖాసనములు జూపి యాసీనులను జేసి తాపసేంద్ర | అశ్వినీ దేవతల వోలె యలరుచున్న యీ కుమారుల వివరమ్ము లెరుగ జెపుడి!

చ. అని వినయమ్మునం బలికినట్టి ధరాధిపుగాంచి కౌశికుం డినకులరత్న మాదశరథేశుని పుత్రులు వీరు, రాజ! నే నొనరుచుచున్న సత్రతువు నుద్ధతి గాచి యహల్య శాపమో చనమును జేసి గౌతముని సన్ముతులందిన రామలక్ష్మణుల్‌.

క్ర అని ముని శిష్యుల వివరము లను జనకున కెరుగ జెప్పి రాజోత్తమ! ర్వుని ధనువును దర్శింపగ ననువగు నీ సమయ మనుచు నరుదెంచి రనెన్‌.

తే. మహామౌని పలుకు లహల్యతనయు డగు శతానందయోగీంద్రు నలరజేసి; నటులె యా రామలక్ష్మణుల్‌ హరునివిల్లు నరయ వచ్చుట మిథిలేశు నలరజేసె.

43

232

233

234

235

236

237

238

239

44

es

అంత జనకుడు బ్రహ్మర్షి కంజలించి కౌశికమునీంద్ర! రామలక్ష్మణులు మీర లరుగుదెంచుట వలన నా యాగమెంతో ధన్మతను గాంచె ననె ప్రమోదమ్ముతోడ. జనకుని సచ్చీలమ్మును

వినయ విధేయతల నరసి విశ్వామిత్రుం డెనలేని మోద మందెను

చనుదెంచెద మరల ననుచు జనపతి యరిగెన్‌.

కౌశికుడు రాత్రి రామలక్షణులతోడ

విడిది గృహమున హాయిగా విశ్రమించె నంత మరునాడు మిథిలేశు డరుగుదెంచి తాపసోత్తమునకు శుభోదయము పలికి.

తరతరాలుగ తమయింట వరలుచున్న హరధనువు పూర్వవృత్తాంతమంత దెలిపి పురుటి నొప్పులు పడకుండ పుడమితల్లి

కని యొసంగిన వరపుత్రి కథయు దెలిపె. మునివర నే నొక సవన

మ్మును సల్బ గడంగి వలయు భూమిని దున్చన్‌ మన మలరగ నాగటిచా

లున దొరకిన దొక్క శిశువు లోకము మెచ్చన్‌.

మునుపటి జన్మల ఫలముగ

ననుజేరిన చిట్టితల్లి నాగ్యహదీప

మ్మని 'సీత' యనెడు పేరును

జనగణ మలరంగ నిడితి శాస్త్రోకముగన్‌.

ఆనాటినుండి మే మల్లారు ముద్దులన్‌ ప్రియమార దినిపించి పెంచినాము రాణివాసము పొంగ రత్న డోలిక నుంచి ఉయ్యాల జంపాల లూపినాము

మాటి మాటికి ప్రేమ మాధుర్య మంతయు ప్రతినిత్స్య మడుగక పంచినాము

వేద వేదాంగాదివిద్యలతో పాటు

పెక్కు శాస్త్రములు నేర్చించినాము

మల్లెమాల రామాయణం

240

241

242

243

244

245

బాలకాండము 45

తే వయసు వికసించి నిండు యౌవనమునందు నడుగు మోపెను గాన మా యనుగు సుతను వీర్యశుల్కము చెల్లించు వీరవరున కిచ్చి కల్మాణ మొనరింప నెంచినాము. 246

ఆ. ఎవడు శివధనుస్సు నెక్కిడునో యట్టి రాకుమారుకిత్తు నా కుమారి ననుచు దెలిసి కొనిన యవనీశపుత్తు నేకు లరుగుదెంచి రేక గతిని. 247

తే కాని వారలలోన నొక్కండుగూడ మహాచాప మెక్కిడుటట్టు లుంచి అంగుళమ్మేని కదలింప నలవిగాక తిరిగి చని రంద రవమానభరముతోడ. 248

తే, దశరథాత్మజు డాదివ్యధనువు నెక్కు

పెట్టినట్లెన సీతను ప్రీతితోడ

వసుమతియు మీరు మెచ్చంగ వాని కిచ్చి

పెండ్లి జరిపింతు నని పల్కె వినయ మెనయ. 249 తే, అంత బ్రహ్మర్షి ప్రియశిష్యునాననమ్ము

నొక్కపరి జూచి వెంటనే యుర్వినాథ!

వేగ ముక్కంటి ధనువు దెప్పింపు మిటకు

నవలిఘట్టము వీక్షింత మందరమును. 250 తే. అనిన మునియాన మేరకు యవనినాథు

డష్టచక్ర విభూషితమైైనపేటి

నరగడియ లోన దెప్పించి యజ్ఞశాల

మధ్యమున నుంచె రాముని మనసు మురియ. 251

ఉ. అప్పడు గాధినందను డనంత ముదమ్మున రాము జూచి, నీ కిప్పుడు పెట్టినాడు మిథిలేశ్వరు డొక్క పరీక్ష వేరె నే జెప్పెడి దేమిలేదు; హరు జిత్తమునం దలపోసి వేగ నా గొప్ప ధనుస్సు నెక్కిడుటకున్‌ గమకించు మటంచు వాకొనెన్‌. 252

తే. దాశరధియంత చేత నా ధనువు నొడిసి పట్టుకొని యవలీలగా పైకి లేపి అల్లెత్రాటిని బిగియించి యట్టె లాగె అంతలో యజ్ఞవాటిక అబ్బురపడ. 253

46

ఫెళఫెళార్భటు లెనయంగ విరిగె ధనువు భళిభళీయని శుభమస్తు పలికె గురువు ప్రీతిమెయి పులకించె భూమాత తనువు తెలియకయె సీత మోమున మొలిచె నగవు. పర్వతము బ్రద్దలైనట్టి భంగి విల్లు విరిగిపడి నట్టి ధ్వనిచేత పరమగురుడు జనకభూపతి రామలక్ష్మణులు దక్క

తక్కు వారెల్ల మూర్చిల్లి ధరణి బడిరి.

అంత మెరుగని ముదమున నవనినాథు డంత కౌశిక మౌనికి అంజలించి సంయమివరేణ్య! రాముని శౌర్యషటిమ అతుల మాశ్చర్యజనక మత్యద్భుతమ్ము. ముగ్గమోహన సౌందర్యమూర్తియైన ధర్మనిరతుని వీరుని దాశరథిని

ధవునిగా బొందు వరము నా తనయ కట్టె గాధినందన! మీయనుగ్రహము వలన.

చిన్ననాటి నుండి శ్రీలక్ష్మి నట్టింట దిరిగినట్టి లీల బెరిగినట్టి

చిట్టితల్లి సీత శ్రీరాముపత్మియౌ

చున్న దింతకన్ష్న శుభము కలదె?

తడ వికేటికి నేడె నే దశరథునకు మంత్రివర్శులచే వర్తమాన మంపి సకలబంధుగణమ్ముతో సాగివచ్చు నటుల జూచెద నని పల్కె నవని విభుడు. అంత బ్రహ్మర్షి మిక్కిలి సంతసమున రాము డొనరించినట్టి కార్యముల నెల్ల నొక్కటొకటిగ తెలుపగా నుర్వివిభుడు హర్షపులకిత గాత్రుడై యంజలించె. మునియానతి తలదాలిచి

జనకుం డతిశీఘ్రగతిని సచివోత్తములన్‌ పనిచె నయోధ్యకు దశరథు

గొని తెచ్చుట కొరకు రాచకొమరులు మెచ్చన్‌.

మల్లెమాల రామాయణం

254

255

256

257

258

259

260

261

బాలకాండము

సా

47

జనకు డంపిన దూతలు సకలరాజ

లాంఛనమ్ములతో మిథిలానగరము

వీడి సాకేత పురి కతివేగ మరిగి

పంక్తిరథునకు తెలిపిరి ప్రతివిషయము. 262 కౌశికుని వెంట జనినట్టి కన్నబిడ్డ

లినకులము కీర్తి దిక్కుల నినుచునట్టి

అద్భుతావహ విజయాల నాలకించి

కదను త్రొక్కెను దశరథు కడుపుతీపి. 263

ధరణిపతి వెంటనే కులగురువు గలసి

మంతనము లాడి మంత్రి సుమంత్రు బిలిచి

ప్రియకుమారుడు రాముని పెండ్లికుదిరె

నందరము రేపు మిథఖిలకు నరుగవలయు. 264

రాణులకు మువ్వురకు సకలమ్ము దెలిపి

బంధుమిత్రులగూడి వివాహమునకు

తరలి వెడలెడు నేర్ణ్జాటు త్వరితగతిని

జరుగునటు జూడుడని పల్కె ధరణి విభుడు. 265 అంత సుమంత్రుడు మిక్కిలి

సంతసమున రాత్రియంత సర్వము తానై

మంతురుల తక్కు ప్రముఖుల

చెంతను గూర్షుండబెట్టి చెప్పెను విధులన్‌. 266

రాణులు చీరెలు రత్సభూషణములు పసుపుకుంకుమ సిద్ధ పరచినారు మంత్రులు రథముల మదకుంజరమ్ముల తురగాల నాయత్త పరచినారు మౌనివరేణ్యులు మంగళ ద్రవ్యాలు కొరతలేకుండ చేకూర్చినారు బంధుమిత్రాదు లపారమౌ కానుక లుచిత రీతిని దెచ్చి యుంచినారు పంక్తిరథుడంత నన్ని యేర్భాట్ల నరసి పరమగురునకు వివరమ్ము లెరుక పరచి మేర మీరిన ముదమున మిథిల కరుగ బయలుదేరెను చతురంగబలముతోడ. 267

48

దారిపొడవున పెద్ద ముత్తయిదు వటుల పెండ్లిసందడి బృందము వెంటనడచి

అలసట యొకింతయును లేక అతిరయమున చేర్చ నందర మిధిలకు చిరునగవున. వచ్చుచున్నది మగపెళ్ళివా రటంచు జనకరాజేంద్రు డెదురేగి స్వాగతించి తోడికొనితెచ్చి మిగుల సంతోష మెనయ నతిథఖి సత్మారముల నెల్ల నాచరించి.

అపరిమిత గౌరవమున వియ్యంకు నరసి ఇనకుల విభూషణా! పరమేశు కృపను ప్రేమమయులైన మీతోడ వియ్యమందు భాగ్య మొనగూడె నేడు మా వంశమునకు. యాగవిధు లన్నియు సమాప్త మగును రేపు కనుక మీరును గురుదేవు లనుమతింప రామునకు సీతకును శుభలగ్ష్నమందు వైభవమ్ముగ జేసెద పరిణయమ్ము. చిత్తగింపుడు నాదొక చిన్న కోర్కె పెద్దలందరు శుభమన్న పిన్నతనయ నూర్మిళను లక్షణున కిచ్చి కూర్మి పెళ్ళి చేతు నని మిథిలేశుడు చెప్పె నంత. గాధిసూతి వసిష్టుని కలసి కొంత యోచనము జేసి వెంటనే యుర్వ్వినాథ! చాల సంతోష మెంతొ ప్రశస్తమైన

మాట దెలిపితి వింత మోమోటపడక. కాని... మామాట సైతము కాదు కూడ

దనక వినవలె నీవు నీయనుజు డిపుడు కోసల పతికి నలువురు కొమరులన్న

విషయమును మీర లిర్వురు వినియె యుంద్రు.

శౌర్యపటిమయందు సత్త్రవర్తనమందు వేదశాస్త్ర బహుళ విడ్యలందు

ధరణిమెప్ప గొన్న నిరుపమానులు నల్వు రందు వలన వలదు సందియమ్ము.

మల్లెమాల రామాయణం

268

269

270

271

272

273

274

275

బాలకాండము

సై

నాల్గు కల్మాణముల నొక్కనాడె జరుపు టుచితమని మేము భావించుచున్నకతన భరతశత్రుఘ్ములకు కుశధ్వజానితనయ లిద్దరిని జేసికొన నెంచె నినకులపతి.

పరమబుషినోట నామాట దొరలగానె

జనకుడును కుశధ్వజుడును క్షణము గూడ

నాలసింపక ముని శతానందుతోడ సంప్రదించి తెల్పిరి తమ సమ్మతమును.

దశరథుండంత మిగుల సంతసమునంది

జనకరాజేంద్ర! యీ శుభదినమునందు శిష్టతరమైన మీ దూరద్యష్టివలన

పావనము లాయె! మన యిరువంగడఢములు.

దశరథుని పల్కులకు కుశధ్వజుడు మురిసి హిత వచనభూష! మా కొమరిత లిరువురు

మీకు కోడండ్రగుట చేత మేరమీరి నట్టి గౌరవ మట్టె నాకని వచించె.

పిదప సాకేతనాథుడు విడిది కేగి కూర్మితనయుల మధ్యలో కొలువుదీరి అవసరమ్మగు చర్చల నతిముదమున జరిపి యా రాత్రి కొంత విశ్రాంతినంది.

ఉదయమున లేచి శాస్త్రోక్త విధుల నెల్ల పూర్తి గావించి, విప్రు లుప్తాంగునటుల కుండపొదుగులు కలిగిన గోగణమ్ము నవనిపతి దాన మిప్టించె నగణితముగ.

నాల్లు పెండ్లిండ్ల కొరకునై నగరమంత జనకరాజేంద్రు డెనలేని శ్రద్ధతోడ నమరు లైనను గని యిబ్ర మందులీల నింపు సాంపారగ నలంకరింప జేసె. పౌరు లందరు నాడు పట్టణమ్మంతయు తమ యిల్లుగా మది దలచినారు

వృద్ధ దంపతులంత పెండ్లికుమారుల దెవరూపములుగా దలచినారు

49

276

277

278

279

280

281

282

50

మంజరి.

పేరటాం డ్రందరు పెండ్లి కొమార్తెల తమ పుత్రికల మాడ్మి దలచినారు బాలబాలిక లంత పరిణయోత్ల్సవమును తులలేని వేడ్కగా దలచినారు

విధమ్మున నెనలేని అందములను మేన గైసేసికొని మిథిలానగరము వన్షెైయును వాసిగల నవవధువు వోలె

శుభముహూర్తమున కెదురు జూచుచుండె.

దశరథుండు వసిష్టు నాధ్వర్యవమున రాఘవేంద్రునితో పాటు రాగమొప్ట భరతలక్షణ శత్రుఘ్నవరులనెల్ల పెండ్లికొడుకుల జేయించె కనులు చెదర. అచట జనకుని రాజ హర్మ్యమ్మునందు సీతతోపాటు మాండవిన్‌ చేరదీసి నూర్మిళను శ్రుతకీర్తుల నొకటిజేసి నలుగిడగ తోడి తెచ్చిరి చెలులు వేడ్క.

వరుస నలువురు వధువుల స్వర్ణపీఠ ములను గూర్షుండబెట్టి సమ్ముద మెలర్థ మేలమాడుచు సంపెగ తైలమంటి కురులసొబగును పెంచిరా కోమలులకు.

అంత నలుగువెట్టి - యభ్యంజనస్మాన ముల నొనర్జకేసి చెలులు వారి మేనులెల్ల మురియ మెరుగుల నద్దిరి పుత్తడికి సుగంధ మత్తినటుల. వెంటనే వారికి పీతాంబరములు నవనవోశ్మేషమౌనగలు నాణెములు చెన్ను దలిర్దగా చెలికత్తిలంత ధరియింపజేసి రత్యంతమోదమున అంత వాళల్టిడలల్లి - అరవిచ్చినట్టి సన్నజాజి సుమాలసరములన్‌ జుట్టి కనులకాటుకదీర్షి కల్ళాణ తిలక మును మోములన్‌ దిద్ది మురిపెమ్ము లద్ది

మల్లెమాల రామాయణం

283

284

285

286

287

బాలకాండము 51

చెక్కిళ్ళ కళబెంచు సిరిచుక్కబెట్టి

రప్పడా నలువురి యంతరంగములు

పులకించె నా శోభ బుగ్గలన్‌ జేరి

లజ్జగా రూపాంతరమ్ము జెందినది. 288 మత్త. రాచకన్షైల మోములందున లాస్మృమాడెడు సిగ్గులన్‌

జూచి నెచ్చెలు లందరొక్కట సోగకన్నులు ద్రిప్కచున్‌

దాచుకొండవి శోభనానకు దర్దణమ్ములు కాన, మీ

రాచి తూచియు వాడుకోవలెనంచు బల్కిరి నవ్వుచున్‌. 289 ఆ. _ పెండ్లికొమరులైన ప్రియపుత్రులంగూడి

సకలబంధుమిత్రసహితు డగుచు

పంక్తిరథుడు యజ్ఞవాటిక కరుదెంచె

మునివరేణ్యు లెల్ల ముందునడువ. 290

ఆ. అంతలోన పేరటాండ్రు ముత్తయిదువల్‌ చెలులు వెంటనడువ తలలువంచి మందగమన లగుచు మంటపమ్మును జేరి రువిదలెల్ల మెచ్చ నవవధువులు. 291

తే. జనకు డంత వసిష్టుని సరస కరిగి పరమమౌనీంద్ర! యుత్తరఫల్లుణియును లగ్నమును జేరె కనుక కల్యాణములను పెద్దలగు మీరు జరిపింప వేడుచుంటి. 292

అని మిఖిలేశుడు పలికిన వెనువెంట వసిష్ట మౌని విశ్వామిత్రున్‌ ఘనయనుని శతానందుని గొని వేదిక కరిగె మిగుల కుతుక మ్మెనయన్‌. 293

తే అంత, కళ్ళాణవేదిపై అబ్బురముగ మునివరేణ్యులు మువ్వురు కనకగర్ణ విష్ణు శివమూర్తు లొకచోట వెలసినటుల కొలువుదీరిరి మంటప మృలరులీల. 294

ఉ. అంత వసిష్టమౌని ముదమారగ హోమముతేసి, వేగ సి ద్ధాంత పరమ్ములైన విధు లన్నియు పూర్తి యొనర్చి, జాగు, వ్వంతయు లేక, గౌరి సుతునర్చనయున్‌ ముగియించి, వేగ సీ మంతినులార! పెండిలికుమారులనల్వుర దోడి తెండనెన్‌. 295

52

లూ

మునిమాటమేరకు - ముత్తెదువలును వన్షెవాసి జెలంగ - వరుల నల్వురను ముందుగా దోడ్తెచ్చి - ముని కప్పగించి పెళ్ళికొమార్తెల పిదప గొనితెచ్చి

వేదికన్‌ గూర్షుండబెట్టినా రంత

సీతమ్మ క్రీగంట శ్రీరాము జూచి

తన యద్యష్టమ్మును దలచి యుపాంగె! ప్రక్క చూపులతోనె - తక్కుమువ్వురును వరుసగా కాబోవు వరుల వీక్షించి

కలలు పండెనటంచు కనిరి మోదమును.

జనకు డంత శతానందుననుమతిగొని వీతిహోత్ర సముజ్జ్విల వేదిమీద పరిసరాలకు మిసమిసల్‌ పంచుచున్న సీత కరమును రాముని చేతబెట్టి. రామ! నా వరపుత్రిని, రమణి సీత నిపుడు నీ చేత బెట్టితి నింక మీద అర్థమును వాక్కులీల మీ రనవరతము జంటబాయక బఒక్కరై సాగవలయు.

అనుచు శుభకామనలు దెల్చి జనకు డంత నూర్మిళాలక్షణుల చేతు లొకటిజేసి భరతుకరమున మాండవి కరమును, శ్రుత కీర్షికరమును శత్రుఘ్ముకేల నుంచె.

అంత నా మౌనిత్రయమ్ము మంగళపాద్య నాదాల వేదమంత్రాలు గలిపి నవవధూనవరుల కనంత సౌఖ్యమ్ముల ననుదిన మొదవున ట్లభిలషించి ఫాలభాగములందు పసిడి బాసికముల రాణ యొప్పార నలంకరించి

జిలకర బెల్లము గలిపిన మిశ్రమ మును శుభమ్మని శిరములను నుంచి

నభము మురియంగ దేవదుందుభులు మైోగు

చుండ నాలుగు మంగళసూత్రములను వరులకరముల కందించి వధువుల గళ సీమలను గట్టజేసి రాశీర్వదించి.

మల్లెమాల రామాయణం

296

297

298

299

300

బాలకాండము

సీతయును రాము డంతట చెలువ మొప్ప నాణిముత్యాలు దోసిళులందు బట్టి

మరల రాదిట్టియవకాశ మనుచు దలచి పెదవి దాటెడు నగవుల నదిమిపట్ట్‌.

వయసు పులకించునటు తలంబ్రాలు పోసి కొన దొడంగిరి వానిలో కొన్ని కెంపు లాయెను! మహేంద్ర నీలములాయె కొన్ని! దిక్కుదోచక ముత్యాలు తెల్లవోయె.

తక్కిన మూడు జంటలును తత్తరపా టిసుమంతలేక, బల్‌ చక్కగ పేరటాండ్రు సరసమ్ముల నాడుచు వేగిరింప, నే యొక్కరు తీసిపోక పరమోత్లుకతన్‌ తలబ్రాలతంతు, వే రెక్కడగాన రానియటు లింపు దలిర్భ ముగించి రంతటన్‌.

అప్పటిదాక నాకసమునందు వివాహమనోజ్ఞ దృశ్యముల్‌ తిప్పలు కన్నులున్‌ మురియు రీతిని జూచుచునున్న దేవతల్‌ ముషప్టిరిగొన్న మోదమున పువ్వులజల్లులు జల్లి దీవెనల్‌ కుప్పలుగా వధూవరులకున్‌ చదివించిరి పెండ్లి కాన్మ్కగాన్‌

అంత నా నాల్లు జంటలు సంతసమున నిమ్మళమ్ముగ నగ్మికుండమ్ముచుట్టు కేలుకే లందుకొని ప్రదక్షిణము జేసి ప్రణతు లొసగిరి గురుపాదపద్మములకు.

గాధినందను డంత నిక్ష్వాకువిభుడు సుతులతో గూడి యొసగిన నతుల నంది జనకరాజేశ్వరునకు దీవెనల నొసగి తరలిచనె వెండికొండకు తప మొనర్భ

సుతులు నలువురు పుట్టిన శుభదినమున నెంత సంతస మందెనో యినకులేశు డంతకన్నను ముదమొందె నంతిపురికి మురిపెమును బెంచు కోడండ్రు దొరికిరంచు. అత్తవారింట సకల భాగ్యమ్ములున్న

మగనిపై తన కెంతటి మమతయున్న

వధువు తొలిసారి పుట్టిల్లు వదలువేళ నామెకన్నులు చెమరించు నన్న నిజము.

53

301

302

303

304

305

306

307

308

54

a

అతిగమించగ తరమె? మా కనినరీతి నీరు నిండిన కనులతో నిలిచియున్న తనయలను నల్వురను జూచి జనక విభుని కనులు సైత మొకించుక కలతజెందె.

అయిన మిథిలేశు డలజడి నతిగమించి అందరను పేరు పేరున ననునయించి చీనిచీనాంబరములు, విశిష్టమైన వజ్రవైడూర్య భూషణావళుల నొసగి.

అరణముగ వేల గోవుల నశ్వములను స్వర్ణరథముల నేన్గ్లుల సైన్మములను దాసదాసీజనమ్ములన్‌ దశరథేశు డబ్బురమ్మును సంతోష మంద నొసగె. అంత జనకుని వీడ్కోలునంది పంక్తి రథుడు నవ దంపతులతోడ రాజధాని కరుగుచుండగ మార్గ్లమధ్యమ్మునందు దుర్షిమిత్తము లొక కొన్ని తోచె నపుడు. క్ష్మాతలేంద్రుడు మదిలోన భీతినంది యేమిటీ వైపరీత్యము? స్వామి! తెలుపు డని వసిష్టుని వేడె, నాయతివతంసు డన్షిదెసలను పరికించి యనియె నిట్లు.

వలదు భయము ధరణివల్లభ! కొంత బీ భత్స మొదవు! కాని యుత్త్గుకతను పెంచునట్టి శుభము వెంటనే సమకూరు ననుచు దెలిపె మౌని యంతలోనె.

గుండె లదరునట్లు - కొండ లూగిసలాడు నట్టు చెట్టు నేల కంటునట్లు హోరుగాలివీచె! కారు చీకటి గ్రమ్మె! గగనమంతధూళి కప్టెనంత

శిరమున నిడుపుగా పెరిగిన జడలకు దివ్యదీప్తులు ప్రసాదించువాడు! మధ్యాహ్న మార్తాండ మాయూఖ తీక్టతన్‌ కన్నులలో నింపుకొన్షవాడు

మల్లెమాల రామాయణం

309

310

at

312

313

314

315

బాలకాండము

కండలు బలిసిన గుండెధైర్యమ్మును రిపులు భీతిల ప్రదర్శించువాడు పదతాడన ప్రభావమ్మున పుడమిని గడగడలాడించు నడకవాడు పరశువును దివ్యధనువును బాణములును సహజదర్ధము నెలుగెత్తిచాటుచుండ త్రిపురఘోరాసురుల సంహరింపనరుగు హరుని విధమున ప్రత్యక్ష మాయె నొకడు. వానిచేతనున్న పరశువుం గనుగొని అతడు పరశురాము డనిగ్రహించి యతివరేణ్యు లంత నర్థ్యపాద్మాదుల

పూజ సర్టి రా తపోధనునకు. అయిననతని కన్నులందున బుసకొట్టు రౌద్ర మరసి మరల రాజవంశ పతనమునకు చేతపట్టెనో పరశువ టనుచు మదిని దలచుకొన దొడగిరి.

భార్లవుం డంత శ్రీరామభద్రు నరసి

హరుని చాపము నవలీల విరిచినట్టి

ఘనత దక్కించుకొన్న యోకార్యశూర! అందుకొను మిదె నాయభినందనలను. అనుచు రాముని యొక్కింత యభినుతించి తనభుజమ్మున వ్రేలాడు ధనువు జూపి శివధనుస్నమమైన వైప్లవ ధనువిది

దీని సైతము నీవు సంధింపవలయు.

నీబలపరాక్రమమ్ముల నేను గాంచి తత్‌క్షణమె నీకు కల్పింతు ద్వంద్వ యుద్ద మునకు నరుదైన యవకాశ మని వచించె నంత రాముడు భార్గవు పంత మెరిగి.

జనకు డచ్లోటనున్న కారణముచేత కోపమును కొంత దిగమింగి తాపసేంద్ర! పిత్యృవచనపాలనమ్మున విధిగ నిన్నె అనుసరించెద మనసార ననవరతము.

55

316

317

318

3+9

320

321

322

56

మల్లెమాల రామాయణం

కాని నీవు నన్ను కవ్వించినటు విష్ణు

ధనువు నిపుడె యందు కొనుచునుంటి

ననుచు పరశురాము హస్తమందలి చాప

మొడిసిలాగె రాము డుద్యమించి. 323 విల్లునట్టెవంచి అల్లెత్రాడు బిగించి

చక్కలాగి బాణ మెక్కువెట్టి

పరశురామ! నీవు బ్రాహ్మణుడవు గాన

సాహసించి నిన్ను చంపలేను. 324

వేదవేత్తయైన గాధినందనునకు

బంధువగుట నీకు వరమె! కాని

యెక్కువెట్టి నట్టి యూ బాణమును వృర్థ

పరుపరాదు కాన పలుకు మిపుడు. 325 పాదగమనశక్తిపరిమార్ష్ముమందువో

ఘోరతప మొనర్చి కూర్చుకొనిన

పుణ్యఫలము నెల్ల బోకార్డు మందువో

యోీవిె తెలుపు మనుచు హెచ్చరించె. 326 విష్ణుధనువు నెక్కు వెట్టి దేదీష్యమా

నముగ వెలుగుచున్న సమరశూరు

రాము నరయగోరి బ్రహ్మాదిదేవతల్‌

వచ్చి రచటి కంత భార్లవుండు. 327

నీలమేఘరూప! నీ దివ్యతేజమ్ము నరసి నాగరువము చెరగిపోయె పాదగతినికాక ప్రాప్తపుణ్యమ్మును త్రుంచి నన్ను కనికరించుమంత. 328

పోయెదను మహేంద్రభూధరమ్మును జేర

ననుచు వేడె రాము డాక్షణమ్మె

పరశురాముపుణ్యపరిపాకమెల్ల నా

శరముతో హరించి శాంతినందె. 329

పరశురాము డంత కరములు ముకుళించి

పలు విధముల రాము బ్రస్తుతించి

క్షణము నిలువకుండ చనె మహేంద్రాద్రికి

పంక్తిరథుని గుండె బరువుతరుగ. 330

బాలకాండము

త్రూ

అంతదనుక తిమిర మావరించినదిక్కు లెల్ల మురిసి తేట తెల్లమాయె;

సురలు రామభద్రు స్తోత్ర మొనర్చిరి మునివరేణ్బులెల్ల ముదము గనిరి.

పరశురాముని గర్వము భంగపరచి నట్టి రాముడు తా జేత బట్టి యున్న ధనువు శరమును వరుణదేవున కొసంగి వినయ మేపారగా వసిష్ణునకు మొక్కి.

జనకు నారసి, తండ్రి! మీ రనుమతింప, రాజధానికి చనచతురంగబలము

సిద్ధముగ నున్నదనె నంత క్షితిపతి కడు కౌతుకమ్మున శ్రీరాము కౌగిలించి.

శిరము మూర్కొని మెలమెల్ల కురులు నిమిరి నాయనా! రామచంద్ర! నా ఆయువందు సగమునీకిత్తు నీ శుభ సమయమందు కొనుము! పెక్కేండ్లు ధరనేలు కొనుము తండ్రి !

అని దశరథు డనినంతనె

మును లందరు మేలుమేలు మునుముందది నీ తనయునకు గొప్ప వరమగు

నని పలికిరి సురలు మురియ నవనీశునితోన్‌.

అంతహర్నాతిశయమున నంద రచటి నుండి కదలిరి వడిగ నయోద్మజేర దూత లాపార్త దెచ్చి సాకేతలక్ష్మి

చెవిని బడవైచి రత్యంత శీఘ్రగతిని

కొడుకుల కోడండ్ర గూడి రాజేంద్రుడు వచ్చుచుండెనటన్న వార్త వినిన నగరలక్ష్మిమొగమ్ము నందనవన మాయె కన్నులు వెన్నెల దొన్న్షై లాయె క్రొత్తసింగారాలు కోటపై కొలువాయె ముంగిళ్ళ నిండుగా ముగ్గు లాయె వాడవాడలయందు వేడుకల్‌ మొదలాయె సందుగొందులగూడ సందడాయె

57

331

332

333

334

335

336

58

రాజసౌధములన్ని విరాజమాన

మైన బహు విధాలంక్ళతుల్‌ మేనదాల్చి కొత్త జంటల కారతు లెత్తు కొరకు బద్ధకంకణహస్తాల సిద్ధమాయె. పురముఖద్వారమున పౌర ముఖ్యు లెల్ల వివిధ మంగళ వాద్యాలు వెల్లివిరియ కొత్తకోడండ్ర హృదయాలు గునిసియాడ స్వాగతము పల్కి రిక్ష్వాకు వంశజులకు.,

దశరథుం డంత రాజసౌధమ్ము జేరి కూర్మికోడండ్ర రాణులకు పరిచయము జేసి పెండ్లిండ్లనాటి విశేషములను పొల్లువోకుండ దెలిపె సంపుల్లమతిని. అంత నానల్వు రత్తల కందరకును సవినయమ్ముగ పాదాంబుజముల నంటి ప్రణతు లర్జించి రంతఃపురమ్ము మురియ దశరథేశుని హృదయ పద్మమ్ము విరియ. మువ్వురత్తలు కోడళ్ళ మోములరసి ముందుగా రూపలావణ్యములకు మురిసి నలువురను పేరుపేరున పలుకరించి అమ్మలుగ మారిపోయి రాయత్త లవుడు.

అంతనా ప్రాంగణములోని ఆలయముల కందరను దోడు కొనిపోయి అగ్చనలను పూర్తి జేయించి తామును పూజజేసి తోషితాంతరంగమ్ముల దోడి తెచ్చి.

ప్రభువు ముందుగ క్రొత్త దంపతుల కొరకు సిద్ధ మొనరించినట్టి విశిష్టమంది రముల కంపిరి కొమరు లుల్లాస మొంద పండువీనాడు మనకంచు పాన్టు లలర.

నాటినుండి రాజనందనుల్‌ నల్వురు హిత మెరింగి నడచు సతులతోడ సకల రాజభోగ సౌఖ్బ్యాల దేలుచు గార్హపత్య ధర్మకలితులైరి.

మల్గెమాల రామాయణం

337

338

339

340

341

342

343

344

బాలకాండము

ప్రై

అటుల కొన్ని దినము లరిగిన తరువాత భరతు నొక్కనాడు దరికి జిలిచి దశరథుండు నీవు తత్‌ క్షణమే గిరి వ్రజపురాన కరుగ వలయు ననియె.

నీ మాతామహుడైన కేకయన్యపుం డెన్నాళ్ళగానో నినున్‌ ప్రేమన్‌ చూడగ గోరి పుత్రు ననిపెన్‌ పెండ్డ్లిండ్లనా డంతటన్‌ నేమారాడక మాటయిచ్చితిని నిన్నీనాడు బంపింతు, నం చీమధ్యాహ్నము నీవు మాతులునితో నేగంగ నొప్టాననెన్‌.

భరతు డంతట తల్లులందరను కలసి ప్రణతు లద్దించి వారి దీవనల నంది రామునకు వందనము జేసి, ప్రేమ మీర లక్ష్మణుని కౌగిలించి యెల్లరను వీడి.

జనకుని యానతిమేరకు

మన మలరెడు లీల మేనమామ యుధాజి త్తునితో తమ్ముడు శత్రు

ఘ్మునితో వేవేగ జనియె కుతుక మ్మెసగన్‌,

భరత శత్రుఘ్ము లిద్దరు పురమునందు లేని కొరత యించుక గానరాని రీతి రామలక్ష్మణు లిర్వురు ప్రేమమీర సలుపదొడగిరి తల్లిదండ్రులకు సేవ.

రాజ్యపాలనమందు రాముడు తండ్రికి దొడ్డ చేదోడు వాదోడునాయె

ప్రజల బాగోగులు ప్రతినిత్య మారసి రాజ్యమంతటికి నారాధ్యు డాయె మంత్రాంగమందు సుమంత్రుని మెప్పించి బహుముఖ నుతులకు పాత్రు డాయె చతురంగ సైన్యాల శౌర్య పరాక్రమ ములకు సైతము తానె ముకుర మాయె నన్నిటిని మించి గురువసిష్టాది మునుల దీవెనలు మెండుగా దినదినమునంది అనతికాలములోనె యినకులమణి తండ్రి నన్షింట మించిన తనయు డాయె.

59

345

346

347

348

350

60

అపరిమితమైన బాధ్యత లనవరతము తనను వెన్నాడుచున్నను దాశరఖికి అంతరంగాన కొలువున్న యనుగుపత్ని సీతపై ననురాగము చెదరదాయె. ఆమె సమ్మోహనాకార మామె గుణము ఆమె నడవడి సౌజన్య మంతెకాక తండ్రి మనసార మెచ్చిన తరుణి యగుట రామచంద్రున కామెపై ప్రేమమెండు. తనకెంతటియనురాగము జనకాత్మజపైని గలదో? జనకాత్మజకున్‌ తనపై అంతకు మించిన

అనురాగముగల దటంచు నాత డెరుంగున్‌.

అరమరలులేని జంటనరసి మురిసి అమరగణమంత నబ్బురమందుచుండ్రి అటులె కౌసల్య, దశరథుడంతులేని కౌతుకమ్మున దినములు గడపుచుండ్రి. సీత చెంతనున్న శ్రీరాము హృదయము వాణిచేతిలోని వీణయౌను సీత చెంతలేక శ్రీరాము హృదయము వీణ చేతలేని వాణి యౌను.

బాలకాండ సమాప్రము

kkk

మల్లెమాల రామాయణం

351

352

353

354

355

అయోధ్యాకాండము

లూ

అయోధ్యాకాండము వరగుణాఢ్యులైన భరతశత్రుఘ్ములు గణుతి గనిన తాతగారియింట మాపు రేపు మేనమామ ప్రేమను జుర్రు కొనుచు నుండి రెట్టి కొరతలేక.

అచట నెనలేని సౌఖ్యములందుచున్న మిత్రబ్బంద మయోథధ్మను మించియున్న తండ్రి నా యన్నదమ్ము లిద్దరును మదిని గడియ గడియకు దలచుచు గడపుచుండ్రి. దగ్గరున్నను లేకున్న దశరథుండు

సుతుల నల్వుర సమముగా జూచుచుండు; కాని... రాముడు జనకుని మానసమున నర్థభాగము నొక్కడే యాక్రమించె.

అమరవిభునకు తల్లియౌనట్టి భాగ్య మదితి కజ్బన యటుల నా కట్టె రామ

భద్రునకు తల్లియౌనట్టి భాగ్య మనుచు స్వాంతమున నెంచుచుండు కౌసల్య యెపుడు.

తండ్రి సద్గుణములు తనవెంట పుడమికి పుట్టుకతోడనే పట్టితెచ్చి

సకల విడ్యలయందు సర్వోన్షతమ్రైన ఘనతర నైపుణ్యమును గడించి సుజనోత్తములకెల్ల శుశ్రూష యొనరించి వారి యాచారాల తీరు నెరిగి జ్ఞానయోగులనుండి గణనీయమరగు వేద విజ్ఞాన సంపత్తి స్వీకరించి రాచకొమరుడనన్న దర్దమ్ములేక

చెడును దరిదాపులకు గూడ చేరనీక దయయు ధర్మము రెండు నేత్రమ్ము లట్లు మదిని దలచుచు రాముడు మసలుచుండెే. బుద్ధియందు బృహస్పతి కుద్ది యగుచు శౌర్యమం దమరేంద్రుని సాటి యగుచు కాంతియందున నుదయ భాస్కరుడె యగుచు వరలు కజ్వేష్ణుని గనుగొని పంక్తిరథుడు.

61

62

మణ్గెమాల రామాయణం

మురిసిపోవుట పెద్దయబ్యురము గాదు కన్నులార్దక మేదినీకాంత గూడ ఎదురుజూడ దొడంగె నా యినకులమణి నాథు డగునట్టి మంచిదినమ్ము కొరకు. పంక్తిరథుడును ముదిమి పై బడె నటంచు రాము డిప్పుడు రాజ్ఞభారము వహింప నన్ని విధముల నర్హత నందె ననుచు సచివు లందర బజిలిపించి సంప్రదించి. యతివరేణ్యుల హితుల సైన్మాధిపతుల నాప్తమిత్రులపౌరుల నాదరమున నొక్కచో జేర్చి సభదీర్షి యుర్వినాథు డనియె నీరీతి దుందుభి స్వనము తోడ.

మా పూర్వుల్‌ మును కన్న బిడ్డలటు సామాన్య ప్రజానీకమున్‌ రేపున్‌ మాపును జూచి రాజ్య మరిదుర్భ్ణేద్యము గావించి నా రా పుణ్ళాత్ముల యున్నతాశయములే యాదర్శసూత్రాలుగా దీపింపన్‌ ప్రజ లండగా నిలువ నీ దేశమ్ము పాలించితిన్‌. కాని ముదిమి రాజకార్యనిర్వహణకు

గడియ గూడ తోడు పడుట లేదు;

సడలినట్టి మేను సంపూర్ణ విశ్రాంతి

నభిలషించు చున్న దందువలన.

అన్ని యోచించి మీరంద రనుమతింప

జ్యేష్ట పుత్రుని పట్టాభిషిక్తు జేసి

యన్ని బాధ్యత లాతని కప్పగించి

కొడుకులో నన్ను నే జూచుకొందు ననియె.

ధరణిపతి యట్లు పలికిన మరుక్షణమ్మె అమ్మహాసభ ముక్తకంఠమ్ముతోడ యెంతశుభవార్త దెల్చితి రింతకన్న కోరదగినది లేదేది? కోసలేంద్ర!

రాముడు ధర్మవర్తనుడు, రాము డకుంరిత ధైర్యశాలి, శ్రీ రాముడు నీతికోవిదుడు, రాముడు సత్మపరాక్రముండు మా రాముని వంటివాడు కనరాడు మరొక్కడు ముజ్జగాల నా రాముని రాజు జేసి జనరంజక పాలన మిమ్ము మీవలెన్‌.

10

11

12

అయోథధ్యాకాండము

తే. అటుల సభ గొంతు వినినంత యవనివిభుడు హర్ష పులకిత గాత్రుడై యాసనమ్ము డిగ్గి కొంగ్రొత్త సందీప్తి యగ్గలింప కులగురువు వసిష్టుని తోడ బలికె నిట్లు.

తే. ఉర్విపై నేను జీవించి యుండగానె ప్రజలు రాముని ప్రభువుగా పరిగణించి రింతకన్షను భాగ్యమింకేమి వలయు? చాలు నీ జన్మకిది చాలు చాలు ననియె.

క. అంత వసిష్టుడు దశరథు నాంతర్యము ప్రజలనాడి నారసి తానున్‌ సంతసమున రామున ర్పింతము సింహాసనమును వెంటనె యనియెన్‌.

ఆ. ఇనకులేశు డంత నిది చైత్రమాసము ప్రకృతి మేనినిండ పచ్చదనము వెల్లివిరియు కాల మెల్ల శుభమ్ముల కమిత కుశల మైన దని తలంచి.

తే రామపట్టాభిషేక కార్యమ్ము కొరకు వలయు నేర్జాట్లు మిక్కిలి త్వరితగతిని పూర్తియగునట్లు చూడుడు మునివరేణ్య! యని వసిష్ణున కెరిగించె నవనివిభుడు.

తే వెంటనే మారుమోగెను వేనవేల హస్తనాదాలు సాకేత మలరులీల; మరునిమేషమె మంత్రిసుమంత్రు బిలిచి దశరథుడు తోడి తెమ్మనె దాశరథిని.

క్ర అంత సుమంత్రుడు రాముని యంతిపురమ్మునకు పోయి యచ్చట నాధీ మంతునకు సభను జరిగిన దంతయు వివరించె మిగుల నానందముతోన్‌.

తే. కజేష్ణుడును సర్వ సద్దుణ శ్రేష్టుడైన దాశరథి వెనువెంటనే తండ్రికడకు మారుమాటాడకుండ సుమంత్రు గూడి బయలుదేరెను గుడి కేగు భక్తునివలె.

63

15

17

18

19

20

21

22

64

ఉదయభానుడు దివివీడి యుర్వికి దిగి నడచి తనుజేర వచ్చుచున్నటుల దోచు కూర్మితనయుడు రాముడు కొల్వుకూట మందు పదమూని నంతనే యవనివిభుడు.

కనక సింహాసనము దిగి కౌగిలించె

రాము డంతట కరకమలములు మోడి తండ్రి పదపంకజమ్ముల దాకి మొక్కి వినయమున నిల్టై విశ్వాస మెనయునటుల. దశరథుండంత సుతుని హస్తములు పట్టి యున్నతాసనమందు గూర్షుండ బెట్టి ప్రజలు నిను రాజుగా జూడవలె నటంచు నన్ను మాటికి గోరుచున్నారు తండ్రి!

నా మనమ్ము కూడ రామరాజ్యమ్మును కనులకరువు దీర గాంచవలయు

నన్న కాంక్షతోడ నున్నది కావున నాలసింపదగ దటంచు తలచి. లోకహిత మెంచి పట్టాభిషేకమునకు నెల్లి శుభలగ్షమును నిర్ణయించినాము; తండ్రిగా కాక ఒక్కమిత్రమ్ము రీతి తెలుపుచున్నాడ నాల్లు మాటలను వినుము. ప్రభువు ముఖ్యమ్ముగా ప్రజల సంక్షేమమే కలలోన సైతము దలపవలయు కామక్రోధాదుల నేమాత్రమును జాలి దలపక ఛీకొట్టి తరుమవలయు సచివులతో సదా సంప్రదింపు లొనర్షి వారితోడ్యాటును బడయ వలయు సర్వకాలముల కోశాగారముల నెల్ల నొక్కింత తరుగక నుంచవలయు

అన్నిటిని మించి దండనాయకులతోడ సణఖ్యముగనుండి యిసుమంత శత్రుభయము లేని విధమున జనుల బాలింపవలయు

నని హితవు దెల్చె పుత్రున కవనివిభుడు.

మల్లెమాల రామాయణం

23

24

25

26

27

28

అయోధ్యాకాండము

జనకునోటివెంట జారిన ప్రతిమాట అడుగకుండ దొరకినట్టి వరమ

టంచు మదిని దలచి యాశీలసంపన్ను డాసనమ్ము డిగ్డి యనియె నిట్లు.

“నిండు సభలోన ప్రభువు నా నెత్తిమీద నమితభారము మోపె మీయండ చూచి; వారి యానతి మీకోర్కె మీరలేక నౌదలను దాల్జితిని భారమంత నేను.”

అనుచు శ్రీరాముడు వినయ మెనయ బలికి మరల తండ్రికి భక్తి నమస్కరించి

జయ జయధ్వానముల మధ్య సభను వీడి మాత్యమందిరమును జేరె మరునిముసమె. అప్పటికె ఆమె సుతుని పట్టాభిషేక

వార్త లాలించి యానందబాష్టములను పూజగది నిండ చల్లి యా పూలతోనె

దీక్షగా జినార్దనుని ప్రార్థించుచుండె.

ఆమె సరనన లక్షణు డవనిజాత

సతి సుమిత్రయు కూర్చుండి శాంతిజపము జేయుచుండెడునంతలో జేరె నటకు

నగు మొగమ్మున దశరథనందనుండు.

వరకుమారునియడుగు సవ్వడులు వినిన జనని కౌసల్య యెనలేని సంతసమున లేచి చేతులు సాచి, “నే వేచియుంటి

నీ శుభంకర దినముకై యిన్నినాళ్ళ,

కన్ష కలలన్ని నేడు సాకార మాయె

రమ్ము శ్రీరామ! కోసల రాజ్యలక్ష్మి

కోరి వరియించె నిన్ను నా గోర్కెటీర” ననుచు కౌసల్య ముద్దాడె ననుగుసుతుని.

అంత రాముడు తల్లికి యంజలించి తండ్రి పలుకుల నొక్కటి తప్పకుండ ఆమె కెరిగించి మిగుల గారాము తోడ పలికె నీరీతి పసిపిల్లవాని లీల.

65

29

30

31

32

33

34

35

36

66

“అమ్మ! కులగురువు వసిష్టునానమేర నేను నీకోడ లీరాత్రి నిద్రమాని దీక్షలో నుండవలయును తెల్లవారు

వరకు కావున మాకు దీవనల నిమ్ము.”

అని రాము డనిన వెంటనె జనకజ తనయత్తగారి చరణయుగమ్మున్‌ వనయమున నంటి మొక్కెను

కని, పూజామందిరమ్ము కడు ముద మొందన్‌.

అంత కౌసల్య వైదేహి నట్టె లేపి

“నిన్ను యువరాజ్ఞగా రేపు నేను జూతు నమ్మ! నా బిడ్డచేయి నీ వందుకొనుట వాస్తవమ్ముగ నా పాలివరము తల్లి!” అని సీత నత్త పొగడుట

గని రాముడు మురిసి యోరగంట కులసతిన్‌ తనివార జూచె నామెయు

మునిపంటను పెదవి నొక్కి మోదము దెలిపెన్‌.

అంత దంపతు లిద్ద రనంతమైన భక్తితోడ సుమిత్రకు ప్రణతు లొసగి సజలనయనాల నా మహాసాద్వియిడిన యాశిషములను భక్తితో నందుకొనిరి.

ప్రక్కనే బంటు పగిదిని చక్కనిలిచి అంజలి ఘటించి కనురెప్ప లార్టకుండ తననేె వీక్షించు చున్నట్టి తమ్ము నరసి మురిసి శ్రీరాము డిట్లనె భుజము దదట్టి.

“లక్ష్మణా! నేటి యూ సంబరమ్మునందు సగము నీయది - మిగిలిన సగమెనాది! నాకు కోసల సింహాసనమ్ము కన్న

జోడు బాయక నడచు నీతోడు మిన్న”

అని కౌసల్యా తనయుం

డనినంత సుమిత్ర సూనుడన్నా! నీవ ట్లని నన్ను వేరు సేయకు

కనుమా! నీ సేవకునిగ కలకాలమ్మున్‌.”

మల్లెమాల రామాయణం

37

38

39

40

41

42

43

44

అయోధ్యాకాండము

[da

అనిన తనయుని పలుకులు విని సుమిత్ర మోము వికసించె; రాముని ప్రేమ హెచ్చె యొకరి కొకరుగ నున్న యిర్వురను చూచి దేవి కౌసల్మ్యమనము సంతృప్తి నందె.

అంత రాముడు వైదేహి అచటినుండి

కదలి మరునాటి ముచ్చటల్‌ కలసి పంచు కొనుచు నెదురైన ప్రతివారి ననునయమున పలకరించుచు నరిగిరి భవనమునకు.

అప్పటికె వసిస్థమునీంద్రు డచట వేచి యుండె నుపవాస దీక్ష నిర్వుర కొసంగ రాముడును సీత వారికి ప్రణతు లొసగి స్వీకరించిరి వ్రతదీక్ష చేత మలర.

వార లారాత్రి పాటించ వలసినట్టి

విధులు వివరించి రేపటి వేడుకలకు సిద్ధపడుడని తెల్టి వసిష్టమౌని

యరిగె దశరథ రాజేంద్రునంతిపురికి. శ్రీరామపట్టాభిషేకము రేపన్న

వార్త అయోధ్యకు పండువాయె। నగరవీథులు మొత్త మగరుధూపములకు కమ్మకమ్మని నిలయమ్ములాయె! కదనుత్రొక్కెడు కౌతుకమ్మున పౌరుల వీడులు కల్ఫాణ వేదులాయె!

రామ సంకీర్తనారవము పట్టణమంత పైరగాలి విధాన ప్రాకిపోయె! ఆకసమునంత జాబిలి కప్పగించి

మబ్బు లొక్కటి లేకుండ మాయమాయె! ప్రజలకోలాహలము గాంచి భయము నంది ఊరువిడనాడి నిద్దుర పారిపోయె.

ఎప్పడు తెల్లవారు నిక నెప్పుడు జూతము రామునంచు, రా దెప్పడు జీవితాన మన కింతటి భాగ్య మటంచు నిండ్లపై కప్పల కెక్కి కూర్తొనిరి, కాలిడ వీథుల చోటులేని వా

రప్పడు జూచె నొక్కదురితాత్మ అయోధ్య వినూత్న రూపమున్‌.

67

45

46

47

48

49

50

మల్లెమాల రామాయణం

పుట్టుకతోడనే భువికి పుట్టె డసూయను వెంటదెచ్చుకొ

న్షట్టిది, ద్వేష భావమున కద్దము వంటిది, మంచి యన్న దె ప్టట్టునగూడ గిట్టనిది, పాపభయ మృణుమాత్ర మేని లే

నట్టిది, మత్సరమ్ము విడనట్టిది గాంచె జ్వలద్దగంతయై. 51 అది కైకదాసి మంథర

హృదయము చెదపుట్ట దానికెవ్వరి సుఖముల్‌

మదినొల్ల వెల్లవేళల

వెదకును జగడములు వేయి వీక్షణములతోన్‌. 52

క్రిక్కిరిసినట్టి ప్రజలు నల్దిక్కు లలర

పెట్టు కేరింతలా దుష్ట విని సహింప

లేక వీనులు మూసి చిరెత్తినట్టి

కనుల నగరిని మరి మరి కలయ జూచె. 53

నిండు పున్నమ నాటి వార్షిధి విధాన

పురజనతరంగములతోడ పొంగిపొరలు

నగరశోభను గని, ఈర్ష్య రగులుచుండ

కదలె నటనుండి కైకేయి సదనమునకు. 54

దారి నడుమ కన్ఫించిన దాసి వలన

వివరముల నెల్ల గ్రహియించి విస్తువోయి

పరుగుపరుగున గూనిని సరకుగొనక

అరిగి తన రాణి శయనమందిరము జేరి. 55

“అమ్మా! కైకా! లేలె

మ్మమ్మా! నిదురెట్టు లబ్బైనమ్మా! నీపై

నమ్మకము ప్రభువునకు లే

దమ్మా! నామాట నమ్ము మమ్మా కొమ్మా! 56

మాటవరుసకైన మర్యాద కైనను

చిన్నమాట నీకు జెప్పకుండ

రాజు పెద్దసతిని రాజమాతను జేయ

బూనుకొనుట యెంత మోసమమ్ము! 57

రామచంద్రుడు కోసల రాజ్యమునకు

సార్వభౌముడెయైన కౌసల్య కీవు

దాసివౌదువు నే నట్టి దారుణమును

గాంచి జీవించుటన్నది కల్ల తల్లి!” 58

అయోధ్యాకాండము

అనుచు తెచ్చిపెట్టుకొనిన కన్నీటితో పాగిలి పాగిలి యేడ్రె వగలమారి కాని దానియేడ్డుకన్న, అందలివార్త కడుముదమ్మునింపె కైకమదిని.

వెంటనే పాన్ఫు దిగి యోసి పిచ్చిదాన అమిత శుభవార్త దెచ్చితి వందుకొను ' టంచు నొకమణిహారమ్ము నట్టి విసరె పాపమంథర కంఠాన బడు విధాన.

కాని మంధర దానిని కాలనాగు

పగిది భావించి మెడనుండి పైకి లాగి చెంతనే యున్న కైకేయి చేతనుంచి

కోపము నటించి మరల వాకొనియె నిట్లు.

“నాకు కడుపు మండునబ్టి వార్తలు నీకు ముదముగూర్ష్శునెడల బొట్టు విషము నాల్మ్క దురదదీర నానోటిలో వేసి సత్వరమ్మె నన్ను చంపు మన్ను! పుట్టినింటినుండి మెట్టినయింటికి వదలలేక వెంట వచ్చినాను!

నాటినుండి నిన్నె నా దైవముగ నెంచి చేతనైన సేవ చేసినాను.

కాని నేడు నన్ను కానిదానిగ జూచి నేను చెప్పినట్టి నిజములోని

మూల మరయలేక మురియుచుంటివి నీవు

దేవు డొకడె యింక దిక్కు నీకు.

బ్రతికియుండి నీవు పడు బాధలను జూడ జాలనమ్మ'" యనుచు రాలు గరగు

రీతి నేడ్డుచున్న ప్రియదాసి దుఃఖము

కైక మదిని కొంత కలత నింపె. ప్రభువరేణ్యుని గారాల పత్తియంత “మంథరా! యేడుపాొక్కింత మానివైచి నాకు రాముని పట్టాభిషేక మెట్లు బాధలకు కారణమ్మౌనొ పలుకు” మనియె.

69

55

60

61

62

€3

64

65

66

70

“అడిగినావుగాన రహస్మమ్మెల్ల వీసమంతయైన విగువకుండ

చెప్పచుంటి నిపుడు చెవియొగ్గి వినుమమ్మ! కన్నకొడుకు బాగు గాంచుమమ్మ.

రాజుగా రిన్షి యేండ్లుగా రాత్రి పవలు పలుకు పలుకున నీ మీద నొలకబోసి

నట్టి ప్రేముడి బూటక మనుచుదేలె! నిష్టటికినైన నీ కనుల్‌ విప్పమమ్మ!

భరతు నటు తాత యింటికి బంపివైచి వర్తమానము సైతము పంపకుండ పట్టమును రామునకు కట్టబెట్టవలసి నట్టి యవసర మేటికి యవనిపతికి? నీవె యోచించుకొనుమమ్మ! నీ కడుపున పేగు డ్రెంచుక పుట్టిన బిడ్డకన్న మిన్ష్నయెట్లాను రాము డెన్షటికిని”" అనుచు వచియించె మంథర ఆపకుండ

అనగ ననగ రాగ మతిశయించినయట్లు తినగ తినగ వేము తియ్యనైన

మాడి మరల మరల మంథర మాటలు వినగ వినగ కైక మనసు మారి.

బుద్ధి భరతువైపు మొగ్గుజూపగ సాగె కడుపుతీపి చుట్టు గ్రమ్ముకొనియె; భర్తపట్ల ద్వేషభావమ్ము పొడసూపె చేతనున్న గొలుసు చెలికి దక్కె.

పయిని కైక పానుపు రూవుమారి అలుక పాన్హాయె! నగలెల్ల నవనిరాలె జడను దురిమిన విరులన్ని జారిపడియె

కురులు రివ్వున ముఖమంత బరచుకొనియె.

కైక దారిని బడెనన్ష కౌతుకమ్ము

హెచ్చి మంథర హృదయము విచ్చుకొనియె; జాగుజేసిన ఫలితము శారిపోవు ననుభయమ్మున మెల్లగా నామె జేరి.

మల్లెమాల రామాయణం

67

68

69

70

71

Te

73

74

అయోధ్యాకాండము

తే

మత్త.

pr]

“అమ్మ! యిటు జాడుమమ్మ! కైకమ్మతల్లి మరచిపోయితి నతిముఖ్బ్యమైన మాట సత్వరమ్ముగ నీకోర్కె సఫలమగుట కొక్కటేమార్గ”మని చెవి నూదె నేదొ. అంతలో నొక్క చెలికత్తె యరుగుదెంచి “అమ్మ! అమ్మ! యేలినవా"రటంచు దెలిపె నంత మంథర దొంగ యట్లడుగు లిడుచు బైట కరుదెంచి ద్వారమ్ము ప్రక్క నక్కె. ధరణివిభుడంత శచివద్ద కరుగుదెంచు వాసవువిధాన గంభీరవదను డగుచు ప్రేమ తొనికిసలాడ దేవీ! యటంచు వచ్చి చేరెను, ప్రియసతి పడకటిల్లు.

అప్పటికె కైక నేలనే అలుక పాను

జేసికొని మాసిపోయిన చీరతోడ నొక్కనగయైన లేనట్టి యొడలితోడ లోచన భయంకరముగ బరుండియుండె.

మొదటిసారిగ తన రాణి పుడమిమీద రెమ్మలాకులు లేనట్టి కొమ్మలీల చలనరహితమ్ముగానున్న చంద మరసి హాయి చేజారి నిశ్చేష్టు డాయె ప్రభువు

భర్తరాకను గమనించి పగను పెంచి మోము నటుద్రిపష్టి నాగమై బుసలు కొట్టి మాటిమాటికి నా బ్రతు కేటి కనుచు కైక సాకేతవిభుని యుత్మంఠ బెంచె.

అనుగుసతికోపకారణ మరయలేక రఘుకులేంద్రుడు కొంత ధైర్యమ్ము జేసి “దేవి! నీకొక శుభవార్త దచ్చినాడ!"

ననుచు మెలమెల్ల స్ట్యశియించె నామె మేను.

కైక వెంటనె భర్తచేతిని కక్షతో తొలగించి, చీ

71

75

76

77

78

79

80

81

కాకునన్‌ వడిలేచి గద్గ్దదకంఠయై “యిక చాలు నన్‌ తాకబోకుము నీ మనమ్మున దాచుకొమ్ము శుభమ్ములన్‌ నాకు చావె శరణ్య మిప్పడు నన్ను వేచక పొ"మ్మనెన్‌.

72 మల్లెమాల రామాయణం

ఉ. ఐన నయోధ్యభూపతి రవంతయు నాగ్రహ మొందకుండ, “ఏ మైనది దేవి! నీకిపు శయారె? శుభమ్మని రాజ్ఞ్యమంత, మో దాన మునింగియుండ నిటుతల్లడమందగనేల"'యంచు, మానిని మానసవ్యథను మాస్చగనెంచి వచించె నిట్టులన్‌. 83

తే. “తరుణి నీవును నేను సంతసమునెట్లు

పంచుకొందుమొ అట్టులే బాధకూడ

పంచుకొనవలె నిద్దర మంచు దలచి

వేడుచున్నాడ! తెల్బుమా వివరములను. 84 తే ఏను నీపట్ల కలనైన ఎగ్గుదలచి

యెరుగ నేనాడు మరియొక రెవ్వరైన

నీ మనసుగాయపరచిన నిర్భ్ధయముగ

దెలుపు మాపాపి ప్రాణముల్‌ తీతు నిపుడె. 85

తే. కారణము నీవు ప్రాణమ్ము కన్న మిన్న నాకు! నీకన్న మిన్న యీ లోకమందు రాము డొక్కడె' యనుమాట రాజునోట జారగనె కైక హృదయము జ్వలిత మాయె. 86

ఆ. ధవునిమాట తనకు దావానలముకాగ,

దానినణచిపెట్టి దారిమార్జి

కనుగొలంకులందు కాపురమ్మున్నట్టి

బాష్ట్రములను మీటి పలికె నిట్లు. 87 తే “నాకు దెలియు మీకు నాపైన గల ప్రేమ

కాని లోకమునకు కన్ముగుట్టు

నట్టు చెప్పవలసినట్టి యగత్యము

నన్ను వెక్కిరించుచున్న'దనియె. 88 ఆ, అంత దశరథుండు కాంతకు తనపైన

కూర్మి తగ్గలేదు కొంచెమైన

యని దలంచి “చెప్ప మగ్గిసాక్షిగ నీదు

కోర్కె దీర్తు నిపుడె? కోమలి!"యనె. 89

ఆ. వీనులలరు మాట విభునినోట వినిన కైక జాగు గొనక కౌతుకమున “నగ్షిసాక్షియేల? అందాల రాముని సాక్షి యనిన చాలు స్వామి"యనుచు. 90

ఆ. చేయిసాచి మగనిచేయి ముందుంచగా

కపట మెరుగలేక క్షావిభుండు

“ప్రాణతుల్భుడైన రాముని సాక్షిగా

చేతు నేడె నీవు చెప్పినట్లు.” 91 అని కైక హస్తమందున

తన హస్తమునుంచి మాట తప్పనటంచున్‌

జనపతి పలికిన వెంటనె

వనజదళనయన ముకుళిత వదనము విరిసెన్‌. 92

తే. వెంటనే కైక క్రీగంట విభుని జూచి “నాథ! మరచితిరేమొ! ఆనాడు రెండు వరముల నొసంగి నీకవి వలసినపుడు కోరుకొమ్మని చెప్పియున్నారు మీరు. 93

తే వరమ్ముల నిప్ప డే నడుగుచుంటి రామునకు మారు భరతు నీ రాజ్యమునకు పట్టభద్రుని గావింపవలయు స్వామి! అదియె నేగోరుచున్నట్టి మొదటి వరము. 94

క. ఇక రెండవ వరమందుర

సకలాలంకృతుల వీడి సంయమివలె, తా

నొకపదునాల్లేండ్లు వనము

లకు బోవలె జ్యేష్ణుడైన రాముం” డనియెన్‌. 95 తే స్వష్టమందైన నూహింపజాలనట్టి

వరములను గోరి కైకేయి వసుమతీశు

వృద్ధ హృదయాన నిరయన్‌విషము జిలికి

క్షణములో మార్జె కల్లోల సాగరముగ. 96 క. అషప్టటి వరకును మాటున

చప్పుడు లేకుండ నిలచి జరిగెడు తంతున్‌

అప్పలు వాల్చక యెప్టటి

కప్పుడు గమనించి దాసి అతిముద మొందెన్‌. 97 తే దశరథుని గుండె దడహెచ్చె తనువు వణకె!

కనులనిండుగ తిమిరమ్ము గ్రమ్ము కొనియె!

కైక యురిత్రాడుగా మారి కంఠమునకు

ఉచ్చు బిగియించె నని యెంచి రెచ్చిపోయి. 98

74

మల్లెమాల రామాయణం

పిచ్చిబట్టిన చందాన భీకరముగ

నంతిపురమంత గడగడ లాడునట్టు

అరచి “దుర్మతీ! యింత దురాశ యెట్లు

కలిగెనే నీకు నీ నాల్క కాలిపోను. 99

ప్రజలచే తాను పూజింపబడుటెగాక

అన్షివేళల కౌసల్య కన్న నిన్ను

మిన్నగా జూచుకొను రాముడన్న నింత

కక్ష నీకేల చెప్పవే కరిన హృదయ! 100

తోయజాప్పుని గనకుండ తూర్చుకొండ

ఉండగలదేమొ గాని నేనుండగలనె

ప్రాణసముడైన రాముని బాసి క్షణము?

హింస విడనాడి కోరు మేదేని వరము 101 రామపట్టాభిషేక కార్భమ్ములన్ని

పూర్తిజేసె వసిస్థు డా పూజనీయు

తోడ నిపుడేమి బల్కగలాడ నేను

సీత కేమని యీ వార్త చెస్టగలను?” 102

అనిన దశరథు ధోగణి గనిన కైక

ముగడు రామునిపై గల మమతకొలది

ఆడి తప్పెడు మార్గము ననుసరించు

చుండె నని యెంచి వడి బల్మె మండిపడుచు. 103

“చాలుంజాలును కట్టిపెట్టుమిక వాచవాలత్వమోరాజ! పో

గాల మ్మిప్పడు దాపురించినది మీ కాకుళ్ల్ల వంశప్రతి ష్టాలంకారవిభూషితమ్మయిన రాజ్ఞశ్రీకి నీవల్ల! నిం

కేలా మాటలు రాముపై నిడిన యొట్టేమాయెనో చెప్పమా!” 104

అనుచు కైక, దెబ్బ దినిన చిరుతమాడ్మి

రెచ్చిపోయి కొట్టవచ్చినట్టు

లాడినట్టి మాట లాలించి యా వృద్ధ

నేత తూలిపడియె నేలమీద. 105

అయిన మగని జూచి యావంతయైనను

కరుగలేదు మనసు కైక కపుడు;

కాని ప్రభువు స్థితిని గాంచి యంతఃపుర

మంతుపాొంతులేని చింతనందె. 106

' ! S$ \|\

——

~

°' పో షా RE gS

{2 he

అయోధ్యాకాండము

ఆ. _ వెన్షనొక్కవైపు వేరొకవైపున రాతినుంచి చేసె ధాత నాతి ననెడు సత్యసూక్తి కద్దమై నిలిచెను పంక్తిరథుని కూర్మిపత్ని కైక.

తే. చేయునదిలేక ప్రభువంత చిన్నపిల్ల వానికైవడి యేడ్డుచు భార్య పాద యుగ్మమును రెండు చేతుల నొడిసిపట్టి పలికె నీరీతి కంపిత స్వరముతోడ.

తే. “మాటయిచ్చితినను ఒక్కమాట కొరకు జ్యేష్ట పుత్రునడవిపాలు జేయు మనుచు పట్టు బట్టకు దేవి! కావలయునన్న భరతునకె గట్ట బెట్టెద పట్టమేను.”

మ. _ అని రాజేంద్రుడు దర్దమున్‌ విడిచి యట్లర్థించి వాపోయినన్‌ కినుకన్‌ వీడక కైక యాత్మవిభు కన్మీరైన లెక్కించ కో జననాథాగ్రణి! పుత్రవళ్సలుడవై సత్యమ్మునే చంపబూ నిన నీ భార్యగ నింకనొక్క క్షణమేనిన్‌ నేను జీవింతునే?”

తే. అనుచు కైకేయి సివమెత్తి నట్టు లరచి యంఫ్రుయుగమున వ్రాలియున్నట్టి భర్త తలను కోపాతిరేకాన దొలగ ద్రోసి శూలముల వంటి చూపుల జూచె నతని.

చూపులు దశరథునకు

కాచిన గునపమ్ములాయె ! కడుయత్నముతో

లేచి పదమూన జాలక

“హా! చెనటీ'యంచు మరల నవనిం బడియెన్‌.

తే అంతలో సుమంత్రు డచటి కరుగుదెంచి క్షితిని బడియున్న భూపతి స్థితిని జూచి దిగ్భమము జెంది మిగుల నుద్వేగ మంది “అమ్మ! కైకేయి! ప్రభువు కేమాయె తల్లి!

తే. అట వసిష్టుడు రామపట్టాభిషేక మునకు వలసిన పనులన్ని పూర్తిజేసి వేచియున్నాడు ప్రభునకు వివరములను దెలిపి యావలి విధులను సలుపుకొరకు.

75

107

108

109

110

112

13

76

తే. ఇట్టి శుభవేళ నవనీశు డేలయిట్లు నేల శయనించి కన్ములనీరు నింపి మౌనముగ నుండె? హేతు వేదేనియున్న తప్పగా మదినెంచక చెప్ప” మనియె.

తే. అంత కైకేయి “మీకింత చింతవలదు సుతుని పట్టాభిషేకము శుభముహూర్త

మునకు జరుగునో? జరుగదో యనుచు నిటుల

పలవరించుచు నున్నారు ప్రభువువారు.

తే. కనుక వెంటనె శ్రీరాముకడకు నరిగి అతని మీరిట కంపిన అప్పడన్ని చక్కబడు" నని మిక్కిలి సవినయముగ కైక బలికెను లోగుట్టు గప్టిపుచ్చి.

తే. ఆమె మాటల ఆంతర్య మరయలేక మంచిదనితెల్సి వడిగ సుమంత్రు డచటి నుండి చని రామభద్రుని యునికి జేరి తెలిపె పినతల్లి దెలిపిన పలుకులెల్ల

తే. అంత రాముడు చెంతనున్నట్టి సీత అనుమతింగాని వేగ లక్ష్మణునితోడ తాను దైవముగా నెంచు తండ్రినరయ నరిగె పినతల్లి కైక మందిరము కడకు.

తే, అపుడు దశరథు డొక యుచితాసనమున దిగులుగా గూరుచొని యుండె దీనునట్లు ప్రక్కనే నిల్చి కైకేయి భర్తనొక్క కంట, ద్వాగమునొక కంట గాంచుచుండే.

తే. అంత లోలోని కరుదెంచినట్టి రాము డమిత భక్తిని తండ్రి పాదములనంటి మొక్కి పినతల్లి నరసి కైమోడ్డు నొసగి మరల నిద్దర గనుగొనె! మార్చి మార్చి,

తే, వ్యాకులితచిత్తుడై యున్న అవని నాథు డనుగు సుతుమోము కనులార నరయలేక మౌనముగ నుండలేక రామా! యటంచు పలికె తలవంచి గద్గద స్వరము తోడ.

మల్లెమాల రామాయణం

115

116

TH7

118

120

121

122

అయోధ్యాకాండము 77

ఆ. కాని మనసులోని కల్లోల మంతయు కైక యెదుట వెడల గ్రక్కలేక మరల మరల రాము నరసి “రామా! రామ!” యనుచు మోము ద్రిష్టై నవలివైపు. 123

తే. తందడ్రిస్థితి గాంచి రాముడు తల్లడిల్లి “అమ్మ! సాకేతపురమెల్ల హర్షవార్థి దేలి యాడుచునుండ నేడేలతల్లి! జనకు డీరీతి చింతలో మునిగియుండె. 124

తే. తండ్రి నీయొద్ద నేదియు దాచడమ్మ!

తల్లిగా నీకు నాకడ దాచవలసి

నట్టి దేముండునమ్మ! కాబట్టి నీవు

సంశయింపక చెప్పము సత్య మిపుడు. 125 తే. ఇతరు లెరుగంగ రాదమ్మ! యింటిగుట్టు

చిక్కు లేవేని యెదురైన చెప్పమమ్మ!

పరులచెవిదాక పోకుండ వానినెల్ల

పరిహరించెద తండ్రి తాపమ్ముబాయ.” 126 అని రాము డనిన వెంటనె

అనువగు సమయమ్ము దోరకె నను భావమునన్‌

జననాథుని క్షణమాత్రము

గని రాముని తోడనిట్లు కైక వచించెన్‌. 127

“రామా! చింతింపంబని

యేమాత్రము లేదు మనకు నినకులపతి, నీ

సేమము నా సంతోషము

కామించుట చేత కొంత కలవరపడియెన్‌. 128 క్త కలవరమును నీవే

పోకాగ్టగ వలయు! దాన బొందెద వీవున్‌

లోకమున నింతవరకే

రాకొమరుడు పొందనట్టి ప్రాశస్త్యమ్మున్‌. 129

ఆ. తండ్రి మించునట్టి దైవమ్ము లేడని యాత్మదలచు తనయులందు నీవు మొదటి వాడ వంచు ముజ్జగమ్ములు నిన్ను బ్రస్తుతించు నింక ప్రతిదినమ్ము.” 130

78 మల్లెమాల రామాయణం

తే. అనిన పినతల్లి మాటల కర్గమేమి టనుచు యోచించకుండ నాయినకులమణి “లోక విఖ్యాతి కోసముగాక నేను త్యాగ మెంతైన జేతు నా తండ్రికొరకు. 131

ఉ. కావున నేను చేయగల కార్యవిశేషము సత్వరమ్ముగా నీ వె వచింపుమమ్మ! మదినింతయు సందియ మందకమ్మ! నీ భావమునాకు దెల్టు మది భవ్యగుణుండగు తండ్రియానగా భావనజేసి కమల బాంధవుసాక్షిగ నాచరించెదన్‌.” 132

మ. అని శ్రీరాముడు నొక్కిపల్మ మనమం దానంద ముప్పాంగ, నా యినవంశోత్తము కూర్మిపత్ని “తనయా! యింకేలజాపష్మ్యమ్ము, నే ననిలో పూర్వము ప్రాణనాథునకు సాహాయ్యమ్ము గావింప, నీ జనకుం డప్ప డొసంగె రెండు వరముల్‌ సంతృప్తితో నా కటన్‌. 133

ఆవరములిపుడు గోరితి భూవిభుడును వాని దీర్చ మోదము దెలిపెన్‌ నీ విపుడు తండ్రిమాటకు జీవము నందించవలయు స్థిరచిత్తుడవై. 134

నీ తమ్ముడు గుణగణ్యుడు నాతనయు డయోధ్యనేల నాకున్‌ నీకున్‌ చేతోమోదము గల్లును కాతలనాథునకు గూడ సంతస మొదవున్‌. 135

Mm

ఇది మొదటి వరమురెండవ

దెదియన నీవీక్షణమ్మె యీ రాజ్యమ్మున్‌

వదలి జడదారి విధమున

కదలవలెన్‌ రామభద్ర! కాననములకున్‌! 136

త్తే జీవితమ్మంత అడవుల నీవు గడుప

వలయు నని మది దలపగ వలదు రామ!

ఒక్క పదునాలుగేండ్లట నున్నజాలు

నవల నీయదె యీ రాజ్ఞ” మని వచించె. 137 ఆ. తల్లిగాని తల్లి తనతోడ యుక్తి యు

క్రముగ దెలిపినట్టి కథను రాము

డప్రమత్తు డగుచు నాలించి జనకుని

బాధలోతు లెరిగి పలికె నిట్లు. 138

అయోధ్యాకాండము

౪,

“ఇంతమంచి వార్తనేల నా జనకుడు చెప్ప సంశయించె జెప్పమమ్మ! భరతుకొరకు నేను ధరణి పాలనమును గడ్డిపరకలీల గాంతునమ్మ!"

అనుచు ధర్మనిరతుడైన శ్రీరాముడు చింతసుంతగనక శిరసు వంచి

యెదుట నిలిచినంత, ముదముతో కైకేయి పలికి నిట్లు రాము బ్రస్తుతించి.

“అవని నిక్ష్వాకు వంశజుల్‌ త్మాగమునకు నిలువుటద్దములను మాట నేడు నీవు నాకు చెప్పకయే చెప్పినావు రామ! ధన్యమైనది నీవల్ల తండ్రిప్రేమ.”

అనుచు సుతుతోడ మెరమెచ్చులాడుచున్న

కైక హృదయాన బుసకొట్టు కపట మెరిగి ప్రాణమాత్రావశిష్టుడా పంక్తిరథుడు

రామ రామా యటంచు మూర్చను మునింగె

అప్పటిదాక కైక వగలన్ని సహించిన లక్షణుండు, మై నిప్పులు చల్లివల్లి నవనీతము బూసిన మాడ్క్మి బల్కు, నా తప్పుల మారియెత్తులను ధ్వంస మొనర్హగ నెంచి కుద్దుడై

చప్పన నన్నవంకగనె! శాంతగుణాఢ్యుడు రాము డంతటన్‌.

“ఆగు! లక్ష్మణ! ఆవేశ మన్షియెడల నక్కరకు రాదు: తండ్రి వాక్ష్ళమ్ము మనకు సర్వదా శిరోధార్యము: సత్వరమ్మె ఆచరించుట దష్ట యనృమ్ము తగదు.” అనుచు కనులతోనె - అనుజను వారించి జనకునొద్ద కరిగి తనివితీర

నరసి పాదయుడ్మమందు శిరమ్ముంచి మొక్కి పిదప కైక ముందు నిలిచి.

మస్తకము వంచి ముకుళితహస్తు డగుచు “అమ్మ! కానల కిపుడె నే నరుగుచుంటి: నాలసింపక భరతు కాహ్వాన మంపి

వేగ నభిషేకమును జరిపింపు మమ్మ!

79

133

140

141

142

143

144

145

146

80

ప్రభువుగా రాజకార్యభారమ్మువలన జనకుసేవలయెడ నలసత్వ మూన

కుండ కడు శ్రద్ధతో జూచుకొను మటంచు ననుజునకు నేను దెల్పితి ననుము తల్లి!"

అని వచించి రాము డంతఃపురము వీడె రగులు గుండెతోడ లక్షణుండు మౌనముద్ర దాల్చి మందగమనమున అన్షయడుగుజాడ లనుసరించె.

పాదచారియౌచు పట్టణవీథుల వెంట నడచుచున్న విమలగుణుని రాము నరసి పౌరు లేమిటీ వైచిత్ర్య మనుచు కలవరమ్ము నంది రపుడు

రాము డటులె నడచి ప్రేమధామమ్మైన జనని సౌధమునకు జనియె నంత

తల్లి యెదురువచ్చి “తనయ! నిన్‌ రాజుగా నరయునట్టి గడియ దరిసె తండ్రి!"

అనుచు నానంద బాష్టము లనుగు సుతుని శిరముపై జల్లి ముద్దాడి చెలిని బిలిచి “పరుగునంబోయి హారతి పళ్టెరమును దెమ్ము! దృష్టిదోషమ్మును దీయవలయు.”

అని కౌసల్ళాసతి దెలి

పిన మరునిముసమ్ములోనె ప్రియసఖి గొనితె

చ్చిన హారతి వెలుగులలో తనయుని మో మరసి తల్లి తనివిం జెందెన్‌.

అతిశయించినట్టి యానందమున నొక్క మారు హారతిని కుమారుముందు

ద్రిష్ట! నంతలోనె దిగ్గున చేజారి

పడియె! నేల మీద పళ్జెరమ్ము.

భళ్ళుమని పళ్టెరము క్రిందబడినతోనె తల్లికౌసల్మ్యగుండియల్‌ ర్లుల్లు మనియె; నేమిటీయపశకున మం చెరుగలేక అంతిపురమంత దిగ్భ్రాంతి నలము కొనియె.

మల్లెమాల రామాయణం

147

148

149

150

151

T52

+53

154

అయోధ్యాకాండము 81

తే అంత సౌమిత్రి పెదతల్లి చింత నరసి “పక్టెరముగాదు చేజారి పడిన దిపుడు భవ్యగుణుడైన నాయన బ్రతుకుతల్లి” యనుచు విలపించె నుద్వేగ మాపలేక. 155

తే లక్ష్మణుని వేదనం గని రామజనని కనులు దుఃఖారవములాయె! కంఠము విడి మాట బైటకు రాదాయె! మనమునందు భీకరమ్ముగ నలజడి పెరిగిపోయె. 156

తే అంత సౌమిత్రి యిక తప్ప దని తలంచి చేదు నిజమును పెదతల్లి చెవిని వేసె: నశనిపాతముకన్న భయంకరమగు వార్త విన్నంతనే యామె వసుధబడియె. 157

తే _ ఫెళ్ళమని గాలివానకు వ్రేళ్ళతోడ నేల కొరిగెడు తరువట్లు తూలిపడిన అమ్మకరముల శ్రీరాము డట్టెబట్టి లేపి కన్నీరు దుడిచి యీ రీతి బలికి. 158

తే. “జోలలో ధర్మబోధను మేళవించి నీవు పాడినపాటలో నీతి కేను కట్టుబడినాడనమ్మ! కైకమ్మ ముందు వీరమాతగ నన్ను దీవింపుమమ్మ!" 159

తే అనుచు నంజలి బద్దుడై తననె జూచు

చున్న ముద్దుల తనయుని కన్నులందు

వెల్లువెత్తుచు నున్నట్టి వెలుగు నరసి

తల్లికొసల్య యొక్కింత దర్ధమందె. 160 ఇ. కాని యంతలోనె కడుపు తీపిని జంపు

కొనగ లేక మరల గొల్లు మనియె

అమ్మ నిప్పడెట్టు లనునయించగలాడ

నన్న దిగులు రాము నలము కోొనియె 161

తే. కాలహరణ మొనర్చిన కలుగునెన్మొ ఇడుమలని యెంచి హృదయాన నెగసి పడెడు బాధ దిగమింగి తల్లిని బారజూచి యనియె తమ్ముడు సౌమిత్రి వినెడు లీల 1

ey] m

82

“కారణమ్మేదియైన నీకంటినీర

మేను బొడగను శిక్ష నాకిడకు మమ్మ! పట్టమహిషిగ యీ దేశప్రజలకెల్ల

మాత వీవను సత్యము మరువకమ్మ!

అట్టి యున్నత స్థానమందున్న నీవు పుత్రవాళ్ళల్యమును సదా పురజనులకు పంచి నను వారిలో జూచుకొంచు గడపు మమ్ము! వేరొక వరము ని న్షడుగనమ్మ!"

అనుచు ధర్మోపదేశమ్ము నమ్మ కిడిన అన్నయౌన్నత్య మనుజుని ఆగ్రహమును బాపి శాంతిని మది నింపె! పరమయోగి సరణి గన్సట్టై రాముడా సమయమందు.

కొడుకు తన నిర్ణయము మార్చుకొనడటన్న నిర్ణయమునకు వచ్చి కన్నీరు మీటి తల్లి కౌసల్య రామునితలను నిమిరి “పోయిరా! తండ్రి! సుఖముగా పురముజేర.

సప్తసాగరములు సకలలోకమ్ములు శ్రుతులునాలు గన్ని బుతువులందు కాచిబ్రోచుగాక! కాననమ్ముల ని” న్ష ఇంచు దీవెనలను అందజేసి.

దాశరథి యంత జనని సౌధమ్ము వీడి సీతకీ వార్తనే రీతి జెష్టగల

టన్న దిగులును బలిమిమై నణచుకొనుచు త్వరితగతి నేగె సతియున్ష్న భవనమునకు

అపుడు భూగర్భ సంజాత అతివ సీత తా నయోధ్యకు పట్టపురాణి నౌదు నన్న మధురోహలందేలి యాడుచుండె వచ్చు ఉప్పిన నెరుగదా పిచ్చితల్లి. రాము డామెను కదుపు ధైర్యమ్ములేక చేదు వార్తను తననోట జెష్టలేక ప్రేమతో జానకీ యని పిలువలేక రాయిగా మారె వేరు మార్గమ్ములేక.

మల్లెమాల రామాయణం

163

164

165

166

167

169

170

అయోధ్యాకాండము 83 తే. అద్దమందున్న సీతపై యవనిజాత

మొలకనవ్వులు కాసేపు చిలుకరించి

వెనుక నిల్ల్ముండి యూరక తనను జూచు

పతిని ముకురాన గాం'ది సంభ్రమమునంది. 171

తే వడిగ వెన్మకు తిరిగి యవ్వలికి బొండ టనుచు చెలికత్తెలకు వాలుగనులతోనె దెలిపి నాథుని బొడగని కలత నంది యనియె నీరీతి వడిగ నా యవనిజాత 172

తే. “స్వామి! యేమిటి? యూ శుభసమయమందు కంట నీరేల? చింత ని న్షంటనేల? త్వరితముగ కారణము దెల్చి వంతబాపు" డనుచు నతిదీనముగ వేడుకొనియె నంత. 173

తే. తనను దైవమ్ముగా మదిం దలచి కొలుచు యనుగునతి కెంతొ యప్రియమైన వార్త స్వయముగా తానె దెలుపంగ వలసి వచ్చి నందు కా ధైర్యగుణు డెంతొ యార్తినంది. 174

ఆ. కన్ను లార్హకుండ కల్యాణి జానకి నరయ దొడగె నామె యాత్తవిభుని భావమందు మెదలు బాధను పసిగట్టి యమితనిగ్రహమున ననియె నిట్లు. 175

ఆ. “ఇంతలోనె నాథ! యేమిటీ మారుపు సంశయింపనేల? సతికి దెలుప జాగుసేయకుండ సత్యము వచియింపు మద్ది యెంత ఘోరమైన దైన 176

తే _ దర్షుకొనగలశక్తి యూ యుర్వితనయ సీతకున్నది యని వేరె చెప్పవలెనె? మంచియైనను చెడుగైన మగనిమాట వేదముగ నెంతు నే నెల్ల వేళలందు.” 1

NN ~

అని గంభీరముగా బలి కిన కూరిమి సతిశిరమ్ము కేల నిమురుచున్‌ “జనకుని యానతి మేరకు వనములకే నరుగవలసి వచ్చెను దేవీ! 178

84 మల్లెమాల రామాయణం

తే నాకు బదులుగ నొకపదునాలుగేండ్లు రాజుగా నుండు భరతుడీ రాజ్ఞమునకు; ధరణిజా! యిది నాపినతల్లికోర్కె ఆమె మాటను కాదన నౌనె? మనము. 179

తే. _ అనిన రాముని సీత కన్నార్దకుండ నరసిప్రాణేశ! నీవంటి త్యాగధనుని భర్తగా బొందినట్టి నా భాగ్యమునకు గర్వపడుచుంటి” నని తెల్టై కరము మోడి. 180

తే భార్య తన నిర్ణయమ్మును స్వాగతించి నందు కాధర్మనిరతు డానంద మొంది “కువలయతనూజ! యిపుడు నా గుండె బరువు చిన్న పలుకున తొలగ జేసితివి నీవు. 181

తే ఇంకనిశ్చింత నడవుల కేగువాడ!

నని మనోహరు డనగనే యడ్డుదగిలి

“అర్థమును వాక్కు వంటి వారాలుమగల

టన్ష సత్యము మరువకు” డనియె సీత. 182 ఆ. ఆమె మాటలోని యంతరార్థ మెరింగి

రాము డొక్కక్షణము మ్రానుపడియె;

మగనిమోములోని మార్చును గమనించి

మరల నామెయిట్లు మాటగలిపె. 183

ఆ. “తండ్రిమాట వెంట తనయుడు పయనించు టొప్ప ననెడు సూక్తి నొప్పకొంటి: నటులె భర్తబాట యర్జాంగి కనుసర ణీయ మనెడు నీతి బాయజాల.” 184

తే. అనుచు దృఢముగ వచియించి యవనిజాత కరము నాక్తేశు ముందుంచె! పరమగుణుడు దాశరథఖియొక్క నిముస మర్గ్జాంగి నరసి చిర్షగవుతోడ చేతిలో చేయివేసి. 185

తే. తనను వెంటదీసి కొనుపోవుటకు నాథు డనుమతించె నన్న హర్ష మవని తనయ మోమునందు తాండవ మాడెను విభుని మోము గూడ వెల్లివిరిసె. 186

ఉ. అంతకుమున్నె వచ్చి వదినమ్మకు నన్న్షకుమధ్య, భవ్య భా స్వంతు కులమ్ముగర్వపడసాగుచు నున్న ప్రధానభాషణా లెంతయు శ్రద్ధతోడ గమనించిన లక్ష్మణు డిట్లు చెప్పె “ని శ్రింతగ నేను గూడ వనసీమలకున్‌ జనుదెంతు నగ్రజా!” 187

తే. రామునకు వామనేత్రము రమణిసీత! యటులె కుడికన్ను లక్ష్మణు డందువలన వలదు మా వెంట నీవు రావల దటంచు బలుక మన మిచ్చగించక పలికె నిట్లు. 188

తే. “అనుగు సోదర! నిన్ను తమ్మునిగ కాక మనము నిండుగనున్ష మిత్రునిగ నెంచి చెడును మంచిని తర్కించి చిన్నమాట చెప్పుచున్నాడ వినుము నిశ్చింతతోడ. 189

తే. అడవులకు నీవు వచ్చుట యవనిజకును

నాకు సమ్మతమేకాని నగరమందు

ఇద్దరము లేక యున్నచో వృద్ధజనకు

సేవజేసెడి దెవరొ? యోచింపు” మనియె. 190 తే. అంత సౌమిత్రి “అన్న! నా కవనిలోన

తల్లియును దండ్రి గురువును దైవ మీవె

అట్టి నీ సేవ కొరకె నేబుట్టినాడ

బాధ్యతను విస్మరించుట భావ్య మగునె? 191 తే. నేనునిను వీడి జీవించలేనటన్న

సత్య మెరిగిన అనుదిన సాక్షి వీవు

కనుక తుదితీర్ణు నీయదే” యనుచు బలికి

యరగ్రజుని గట్టి వైచె రామానుజుండు. 192

తే. మరది సంకల్ణ మెరిగిన ధరణిజాత

యన్న కేనాడు నే మాత్ర మడ్డు జెప్ప

నట్టి తమ్ముని కోర్కె కాదనిన యెడల

కలుగు ఫలితము నూహించిపలికి నిటుల. 193 తే. “వినుము లక్ష్మణ! నీవు రామునకు నాకు

పుత్రసముడవు! నోరార ముచ్చటపడి

వెంట వచ్చెద నన నిన్ను వీడి చనుట

కెట్లు మనసాప్ప? మాకు, నీకేల చింత?” 194

మల్లెమాల రామాయణం

వదిన పలుకులు సౌమిత్రి హృదయమంత

తడిసి ముద్దగునంత సంతసము నింపె;

సీతమోమున చిరునవ్వు చెంగలించె

దాశరథియును తలనూపె తమ్ము నరసె 195

సీతారాములు పెద్దలందరి శుభాశీస్లంది సౌమిత్రితో

చేతోమోద మెలర్భ రాజు కడకున్‌ జేరంగ నచ్లోట, నెం

తో తాపమ్మున నిల్షియుండిన సుమంత్రుం డంతనుద్విగ్నుడై

“రా! తండ్రీ! రఘురామ! భూవిభుడు నీరాకన్‌ నిరీక్షించెడిన్‌.” 196

అనుచు బలికి మువ్వురను వెంటగొనిపోయి

రాము బలవరించు ప్రభువునొద్ద

నిలిపి. తట్టి మేలుకొలిసి “మహారాజ!

యరుగుదెంచె రాము" డని వచించె. 197

మంత్రినోటి వెంట మంచిమాటను విన్న

అవనివిభుడు దిగ్గు రనుచు లేచి

కరములార రాము గౌగిలింపగ బోయి

కాలు నిలుపలేక తూలిపడియె. 198

రాముడును సీత వెంటనే ప్రభువు నొడిసి

పట్టి మెలమెల్లగా లేపి ప్రక్కనున్న

యుచిత పీరమ్ము పైన గూర్చుండబెట్టి

రంత నిట్టూర్డి దశరథు డాత్మజు గని 199 “రామ! యేనాడో నేనొక రాక్షసి కిడి

నట్టి మాట శిలాక్షర మనుచు నెంచి

యడవులకు బోవ సిద్ధమైనావ! తండ్రి!"

యనుచు రోదించె కంటినీ రలయునటుల. 200

జనకుని యావేదనమును

కని రాముడు మదిని గుంది గంభీరముగా

“వనములకు నే నొకండనె

జనుటకు సమ్మతములేక సదయహృదయులై 201

మీ కోడలు. నా తమ్ముడు

నాకట తోడుండ దలచి నా వెనువంటన్‌

మీకడకు వద్ధి రిప్పుడు

వ్యాకులతను వీడి వారి కనుమతి నిడుడీ!" 202

అయోధ్యాకాండము 87

క. అని కూరిమి తనయుడు దెలి పిన వెంటనె దశరథుండు విమలాత్తను, సీ తను గని “తల్లీ! యిక రా ముని భారము నీదె'' యనుచు పాగిలి వచించెన్‌ 203

తే. మరల వెంటనె మంత్రి సుమంత్రు నరసి “రాతి కన్నను కరినాత్మురాలు కైక మారదది! రాముడును దారి మార్గుకొనడు కనుక తలవంచినాడ! నే కాలమునకు. 204

తే కర్శవశమున నా బిడ్డ కాననముల సంచరించెడు దుర్గతి సంభవించి: నంతమాత్రాన కాకూడ దడవిపాలు వాని సౌఖ్యము! కావున వలసినంత

Nn bo) (అ

తే. సంపదను సైన్స్నమును ననుచరుల నొసగి రాజలాంఛనయుతముగా రథము మీద మువ్వురను నీవె దోడ్కాని పోవలయు" టంచు పంక్తిరథుడు పల్మె నంతలోనె 206

తే _ కైక రాక్షసి విధమున కన్ను లురిమి

“మోము నిటుద్రిప్పమయ్య! ముసలిరాజ!

బొక్కసములోని ధనము నీ పుత్రు కొనగి

బిచ్చమిత్తువె? ధరను నా బిడ్డకీవు" 207 ఆ. అటుల కైకనోట నతికర్శశమ్మగు

మాట దొర్లగానె మండిపడుచు

“భ్రష్ణురాల: నీవు ప్రాణాలతో నుండ

తగ” వటంచు లేచి దశరథుండు 208 ఆ. సడలినదట్టి మేని సత్తువనంతయు

కరమునందు నింపి కైకమీది

కురికి కొట్టబోవ పురుషోత్తముడు రాము

డాసి తండ్రి తోడ ననియె నిట్లు 209 తే “జనక! నా పినతల్లి వాకొనిన మాట

లందు తప్పేమి? యడవుల కరుగు వారి

కేల సంపద? సైన్మ్యమ్ము లేల? వల్మ్క

లములె మునివ్యత్తి కనువైన లాంఛనములు." 210౧

88 మల్లెమాల రామాయణం

శా. శ్రీరాముం డటు తండ్రితో ననగనే చిత్తమ్మునం బొంగి, యా నారీ వ్యాఘ్రము కైక వేగజని లోనన్‌ ముందె సిద్ధమ్ముగా వేరున్‌వేరుగ నున్న వల్మ్కలములన్‌ బీరమ్ముతో దెచ్చి, చే యారన్‌ రామున కిచ్చై మూడు జత లన్మంబేమి మాటాడకే. 211

త్తే అంత రఘురాము డొక జత ననుగు సతికి తమ్మునకు నొకజత నిచ్చి తక్కుజతను తాను ధరియించి! సౌమిత్రి తాను గూడ యన్న జూపిన మార్గము ననుసరించె. 212

తే కాని పాపము సీతవల్కలము లెపుడు కనులజూచి యెరుంగని కారణమున కట్టుకొను రీతి దెలియక కాంతు జూచి కనులతో దెర్జె! నా చేతగా దటంచు. 213

తే. మరుల కిరవైన యేకాంతమందిరమున చీని చీనాంబరములను చెలులచేత మనసు మెచ్చగ గట్టించుకొనెడు సీత వల్కలము లెట్లు ధరియించు పదుగు రెదుట? 214

తే అనుచు వలవల పలపించె నంతిపురము

తప్పదని రామభద్రుడు తానె చుట్ట

బెట్టి నిల్లాలి యుడుపుల నట్టెయుంచి

సంయమి వసిష్టు డట్టి ద్యశ్య్చమ్ము నరసి. 215 తే వ్యాకులత జెంది “శ్రీరామ! యవనిజాత,

మోసగత్తె కైకేయికి దాసిగాదు;

తాను విసరిన వలువలు మేనదాల్చ

రాజ్ఞ మున్షను లేకున్న రాణి యామె.” - 216

తే అనుచు దశరథ రాజేంద్రు శలర బలికి వాడి చూపుల కైకేయి నంక జూచి “పాతకీ! నార చీరలు సీత కొసగు గట్టి యధికార మిడెనె? నీ కవనివిభుడు? 217

ఆ. సీత మగనివెంట చీనాంబరములతో రత్న భూషణాల రాశితోడ నరుగు కాననముల కట్టుగా దందువా! నీకు దగిన శాసి నేనె చేతు. 218

అయోధ్యాకాండము

తే.

వివరముల నెల్ల నా నోట విన దలంతు

వేని దెల్టెద, నట్టుగాదేని యిపుడె

సీత యొడలిపై గల నార చీర లీవె

యొలిచి గుట్టుగ నీ యొద్ద నుంచుకొనుము.”

అని వసిష్టుడు తనది రాజాజ్ఞ యనిన

పగిది బలికిన కైక దిగ్లాంతినంది

ఆగ్రహమ్మును దిగమింగి “యమ్మ సీత! కులగురువు మాట పాటించవలయు మనము.”

అనుచు తలదించుకొని పోయి అవనితనయ మేనగల వల్కలములను తానె యొలిచి చెంతనేయున్న చెలికత్తె చేతి కిచ్చి రాముమోమున గనక దూరముగ నరిగ

ప్రభువుగా కాక, తానొక పౌరునివలె దశరథుడు వసిష్ట మునికి ధన్నవాద ములను దెలిపెను వికసితముఖముతోడ కలకలమ్మున మునిగె కైకమ్మ మేడ

అంతలోపల పట్టు పీతాంబరములు రత్నభూషలుగల పళ్టెరములతోడ

సతి సుమిత్రయు, రాణి కౌసల్య తక్కు రాణు లరుదెంచి రచటికి రాజు మురియ తరుణి సీతమ్మ యిద్ద రత్తలను జూచి మురిసి యెదురేగి భక్తితో మొక్కు లిడియె: వారు పీతాంబరములు ధదీవనలు నగలు కోడలికి నిచ్చి రెనలేని కూర్మితోడ.

అంత సుమిత్ర లక్ష్మణుని అక్కున జేరిచి “నాయనా! సదా చెంతనె యుండి రామునకు సీతకు సేవ లొనర్చి, వారికే చింతయు లేనియట్లు వనసీమలు సైతము మెచ్చునట్లు, నీ స్వాంతము తప్పపట్టనటు సత్యపథమ్మున సాగగావలెన్‌.

అన్నను తండ్రిలీల వదినమ్మను తల్లివిధాన గొల్ఫి, నీ

కన్నుల కప్రమత్తతను కాపుగ నుంచి అరణ్యవాసమం దెన్షడు నిద్దురన్‌ దరికి నించుక యేనియు జేరనీక, సన్నుత పుణ్యదంపతుల స్వాంతము లుల్లసిలంగ జేయుమా!”

89

219

220

221

(S) mM by

224

9] nm fa

90

ETS

ha

వరపుత్తుని గుణగణముల

నెరిగియు తన ధర్మ మనుచు హితవచనము

ట్లెరిగించి దీవెనల నిడి తరుణీరత్నము సుమిత్ర తనిసెను మదిలోన్‌.

అంతలో సుమంత్రు డరుదెంచి శ్రీరాము నరసి రథము సిద్ధ మని వచించిె; దాశరథియు సీత దవ్వున నిలుచుండి తమ్ము జూచు కైక దరికి నరిగి.

ఇరువు రొకమారె మొక్కగా నింతి కైక క్షేమముగ వెళ్ళిరం డని చెప్పకుండ మంచి దని క్లుప్తముగ నొకమాట మాత్ర మనియె! లక్షణు డదిగని మండిపడియె.

కాని శ్రీరాము డిసుమంత కలతవడక అంతయును మంచికేయని యాత్మదలచి తల్లివిధముగనే పినతల్లి నెంచి

హస్తములు మోడ్డి ఆమెతో ననియె నిట్లు.

“ఆ సూర్యభగవాను డాదేశ మిచ్చినన్‌ తండ్రి యానతి జవదాటనమ్మ చిన్నారి భరతుని సిద్ద సంకల్పుని సింహాసనాధీశు జేయు మమ్మ

నాకు నీవిడినట్ట్‌ నారచీరలె పట్టు వలువలుగా మదిం దలతునమ్మ!

నీ యబభీష్టము మేర నిశ్చింతగా పదు నాలుగేం డ్లడవుల నడతునమ్మ కన్ననాతల్లికే యీర్ష్య గలుగునటుల ప్రతినిమేషము ప్రేమను పంచినట్టి

నీ బుణమ్మును దీర్చెడు నియతికంటె వేరె యాశింపనేది? దీవింపు మమ్మ!”

దశరథాత్మజు నెనలేని త్యాగనిరతి

నతని సచ్చీలతను కైక యంతరాత్మ యామెయనుమతి లేకయే యభినుతించె చేయునదిలేక విధిగ నాశీర్వదించె.

మల్లెమాల రామాయణం

227

228

E29

230

231

232

అయోధ్యాకాండము 91

తే. అంత నా మువ్వు రటనుండి ఆయుధములు

కవచములతోడ ద్వారముకడనె యున్న

స్మందనము నొద్ద కరుదెంచి యందరికడ

సెలవుగైకొని పిదప నాసీను లైరి. 233 తే. రథము కదలె సుమంత్రు సారథ్యమందు;

కౌతుకము నిండె కైకేయి కనులయందు,

ఎగసె వేదన కౌసల్యహృదయమందు;

ముసిరె! చీకట్లు దశరథుమోమునందు 234

.. జారిపోవుచుండె జాతిరత్సమ్మని గుండెదిటవు నంత గోలుపోయి పాప మవనినాథు డాపు సుమంత్రుడా! యడవి కేనువత్తు ననుచు నరచి 23

on

ఆ. _ తండ్రికేక విన్న దశరథరాముడు మదిని కలతజెంది మంత్రితోడ సందనమ్ము నాప, జనలేము ముందుకు వేగ మింక కొంత బెంచు మనియె రది

ఆ. పంక్తిరథుడు తూలి పడుచు లేచుచు వెంట పరుగువెట్టు టరసి పట్టమహిషి భర్త నొడిసిపట్టి బలవంతముగ తన భవనమునకు జేర్ణై బాధతోడ ౨7

చం. జనక వచో నిబద్దు డయి జానకిగూడి సుమిత్రసూతితో ననుపమలీల ఘోరవిపినాంతర సీమల కేగు రాఘవన్‌ గని జనులెల్ల పట్టణము గ్రక్కునవీడి విపణ్ణచిత్తులై చని రిక మాకు నీ యడుగుజాడలె దిక్కని రామువెంబడిన్‌ 8

తే. _ వారి ప్రేమానురాగముల్‌ వారి భక్తి

గాంచి రాముడు, పోవంగ కాళ్ళురాక

యొక్కచో నిల్చి బిడ్డల నూరడించు

తండ్రివలె బలె గొంతుక తడబడంగ. 39 క్ర “మీబాధనాకు దెలియును

నా తే విస్తరించి నాయన యాజ్ఞన్‌

నేబాటింపకపోయిన

నే బిడ్డండైన తండ్రి కిచ్చునె విలువన్‌? 240

92

Gb

ప్రభువు నడచు బాట ప్రజల కాదర్శమై నిలిచినపుడె నీతినియమములును బ్రతికిబట్టగట్టు: బహుజనాభ్యుదయము సకల జగతిలోన జరిగితీరు.

ఏను లేనను చింత మీకింత యేల? అన్ని విధముల నాకన్న మిన్షయైన

తమ్ము డున్నాడు భరతు డాతండె నేత! అతనిలో నన్ను గనుడని యనునయింబి.

కాని, వారంత ముక్త కంఠాన “రామ! దుష్ట కైకేయి తనయుడు భరతు డెంత నిగ్మలుండైన అతనిలో నిన్ను గనుట కిచ్చగింప దయోధ్యలో ఈగగూడ.

నీవు లేని నగరు నీర మెండిన వాద్ధి కలను గూడ నచట కాలు మోప

మనసు రాదు మాకు: మామాట మన్నింపు మడవులే శరణ్య మందరకును."

అనుచు జనగణమంత స్మందనము వంట పరుగు పెట్టుట గని, మంత్రి పగ్గములను లాగె వెంటనె రామయ్య రథము డిగ్గి నంతలో కమలాప్పు డస్మాద్రి కరిగె

ప్రక్కనే తమసానది పారుచుండు

టరసి వేగ సుమంత్రుడు తురగములను విష్టి నీరము ద్రావించి విశ్రమింప

జేసి, సాకేతపౌరుల చింతబాపె.

క్రమముగా నంత చీకటుల్‌ క్రమ్ముకొనియె నిదె విడిదియని తృణశయ్య నేరుపరచె నన్నకును వదినెకును రామానుజుండు ప్రజలు పచ్చికబైళ్ళ విశ్రాంతిగొనిరి.

సీతయును రామభద్రుడా సెజ్జమీద బవ్వళించిరి దానినే పట్టుపాన్గు

రీతి మదినెంచి మిక్కిలి ప్రీతితోడ కాపుగా నుండె చింత లక్షణుడు నిలిచి.

మల్లెమాల రామాయణం

241

242

244

245

246

247

248

అయోధ్యాకాండము 93

తే. ఆలుబిడ్డల విడచి న్షనుసరించి వచ్చియున్నట్టి ప్రజలకు నచ్చజెప్పి తిరిగి పంపుట యెటులన్న దిగులుతోడ రామునకు నిద్రపట్టక రాత్రివేళ. 249

తే లేచి, మంత్రినిజేరి “యే లీలనైన

నుదయ మగుటకు ముందె యీ నదిని దాట

వలయు నటుగానిచో వీరు వదల రింక

మనల రే" పని దెల్బై సుమంత్రు డంత 256 సడిసవ్వడి లేకుండగ

వడిగా స్మందనము సిద్ధపరచెను పిదపన్‌

ఎడలేక సీతయును, రా

ముడు లక్ష్మణు డెక్కగానె ముందుకు నడపెన్‌. 251

తే, రథము తీరము వెంట దూరముగ బోయి అడ్డదారిని నది దాటి యవలి కరిగె; నంత రాము “డమాత్య! మీరాప వలదు పయన మాగకూడదు తెల్లవారు వరకు." 252

క. అని తెల్చ మంత్రి యటులే యని పల్లెల ప్రక్కదారి నరదము దోలెన్‌, దినకరు డుదయించెను వడి తన వంశస్థులకు స్వాగతము బలుకంగన్‌. 253

.. పౌరు లంత తెల్లవారి నిద్దురలేచి రాముజాడ గనక రథము గనక “పాడునిద్ర యెంతపని జేసె దేవుడా! ఇప్పడింక దారియేది మనకు?” 254

అనుచు తలలు బాదుకొనుచు జేసెడిదేమి

గనక, నగరి కరుగ కాళ్ళురాక

కొంతతడవు వగచి చింతయే తోడుగా

తిరుగుదారిబట్టి యరుగునపుడు 255 ఆ. కట్టుకున్నసతుల - కన్నబిడ్డల వీడి

ప్రేమధాముడైన రామువెంట

నింత దవ్వువచ్చి యెట్టి ఫలములేక

అరుగవలసివచ్చె ననుచు జనిరి. 256

94

D2

Gh

తిరిగివచ్చినట్టి పురజనుల్‌ రామయ్య తిరిగిరాడు దీక్ష తీరువరకు

ననుచు మాటలాడు కొనుటను చెవియొగ్డి వినిన కైక మురిసె మనమునందు.

సాకేత రాముని స్మృందన మృతివేగ ముగ నెన్నా జనపదములను దాటి ఆలమందల మేత కాలవాలమ్ముగా పేర్లన్ష్న పచ్చికబీళ్ళదాటి

పరిగెపిట్టకు కూడ పట్టెడన్షముబైట్టు మేలైన పంటపాలాలు దాటి

శిలల నెమ్మేనులు పులకించునట్టుగా నెగసి దూకెడు సెలయేళ్ళు దాటి దారి కిరువైపులను బార్లు దీరి నిలిచి కొమ్మలే చేతులుగ స్వాగతమ్ము బలుకు సరణి గన్నట్టు సంపెంగ తరులదాటి చేరె! గంగాతరంగిణీ తీరమునకు

మెల్లమెల్లగ వీచెడు పిల్లగాలు లానదీతరంగమ్ముల నల్ల నల్ల

మీటి వెలువడు నాదమున్‌ పాటగట్టి ఆలపించుచు నుండే నాహ్లోద మెనయ

పాట స్వందనమును పరవశింపగ జేసె నశ్వములును గమన మాపి నిలిచె అంత సీత యెంత హాయిగా నున్చదీ ప్రాంత మనుచు ఐబలికె భర్తతోడ

అనిన వెంటనె శ్రీరాము డనుగుపత్ని మనసు గుర్తించి తాను సృందనము డిగ్గి చేత ముప్పాంగ సతికి చేయూతనిచ్చి దింపె! అంత సౌమిత్రి మంత్రియును దిగిరి

రామభద్రుడు జానకీరమణ్‌ తోడ

దీక్ష వహియించి జాహ్నవీతీరమునకు వచ్చియున్నా డనెడు శుభవార్త దెలిసి పరుగునన్‌ వచ్చా నా సీమప్రభువు గుహుడు

మల్లెమాల రామాయణం

257

258

259

260

261

అయోధ్యాకాండము 95

తే. సృందనమునొద్దనుండి నిషాదరాజు బ్యందమును గాంచి రాము డానంద మొంది తమ్మునిం గూడి యెదురేగి “రమ్ము సఖుడ! యెన్నినాళ్లాయె కనులార నిన్ను జూచి.” 263

ర్‌ అని రాముడు వనరాజును మన మారగ కౌగిలించి మధురోక్తుల నా తని శిరమున వెదజల్లెను కని యనుచర బ్యందమునకు కన్నులు మురియన్‌ 264

తే. అంత గుహుడు శ్రీరామున కంజలించి

“పూర్ణచంద్రున కొక నూలుపోగు పగిది

పేదగుహు డిచ్చు కానుకల్‌ స్వీకరింపు"

డనుచు తెచ్చిన యుడుగర లచట నుంచి. 265 తే. రాము డవియెల్ల నరసి చిర్షగవుతోడ

“వలదు మిత్రమా! నే వనవాసదీక్ష నుంటి గావున బహుమతు లంటదగదు

చేతనైనంతలో విందుజేయు” మనియె. 265 అ. భాను డంతలోనె పశ్చిమాద్రిని జేరె।

గువ్వలన్ని సొంతగూళ్ళు జేరె

నిసికి వెలుగు బంచ శశి వియత్తలి జేరె

చెట్టుపుట్ట లెల్ల సేదదీరె. 267

ఆ. అంత శబరనాథు డడవితల్లికి గూడ చవులుగొలుపునట్లు షడ్రుచులను పిండి వండితెచ్చి వెన్షెల పందిట విందొసంగె రాముబ్బందమునకు. 268

తే. గుహుని యనుచరు లంతలో కొండపూలు

గంపలం దెచ్చి పచ్చని గరికమీద

నొత్తుగా బేరి మిక్కిలి మెత్తనైన

శయ్య నేర్తాటు చేసిరి సంతనమున. 269 తే సీతయును రాము డాపూల సెజ్జిమీద

విశ్రమించిరి వనము నంప్రీతినంద:

లక్ష్మణుండును గుహు డోక రాతిమీద

గూరుచుండిరి నిద్దురన్‌ బారద్రోలి. శరై

96

Gh

రథములోనె సుమంత్రుడు రాత్రియంత కునుకుదీసెను చెంతనే గుజ్జములును నోళ్ళ చాలను వరకు గుగ్గిళ్ళ మెసవి

చాల సంతృప్తి నొంది విశ్రాంతి నందె.

అలసి నిదురించు ప్రకృతిదేహమ్ముపైన వెలుగులను జల్లి మేల్కొల్చె వేగుచుక్క: కోయిలలు తామె వైతాళికులుగ మారి దాశరథికి సీతకు శుభోదయము బాడె

అంతనాపుణ్యదంపతుల్‌ సుంతయేని జాగుసేయక లేచి లక్ష్మణుని బిలిచి పూజ్య భాగీరథిన్‌ ప్రొద్దుబొడుపువేళ దాటుటెంతేని సంతోషదాయకమ్ము అనుచు దెలిపిన సౌమిత్రి యాక్షణమ్మె గుహున కెరిగించె! నగ్రజుకోర్మెనంత పరుగుపరుగున జని సిద్ద పరచె నతడు బహువిధాలంకృతులతోడ బరగునావ.

రాముడును జానకీదేవి లక్షణుండు నూతనోత్లాహమున నటనుండి కదలి విమల జాహ్నవీ తీరాన వేచియున్న నావ జేరిరి మెల్లగా నడచుకొనుచు

సారథి సుమంత్రు డంత దాశరథి నరసి “మహితగుణశీల! యిపుడు నా మార్గమేదొ నీవె వచియింపు" మనిన నా నీలమేఘ వర్గు శానందమేపార బలికెనిట్లు.

“సచివసత్తమ! మాకీవె సారథి వయి

రథము నడిపించి, యింత దూరమ్ము శ్రమను లెక్కసేయక వచ్చి నిర్షిద్రవృత్తి

సాయపడినావు! నీకు నే దోయిలింతు.

మే మిక వనసీమలలో

సామాన్యులరీతి పాదచాగుల మగుచున్‌ నీమము వీడక పదునా

లామనులను సంతసమున గడపెద” మనియెన్‌.

మల్లెమాల రామాయణం

ere

272

273

274

PRES

276

277

278

అయోధ్యాకాండము

క్ర

అని రామభద్రు డనగనె

మన మించుకచిక్కబట్టి మంత్రి సుమంత్రుం “డినకులతిలకా! నిన్నీ

వనముల విడనాడి చనగ వగపాయె” ననెన్‌

రాము డంత సుమంత్రుకరములు బట్టి “చాల బుణపడియున్న దిక్ష్వాకువంశ మిప్పటికె నీకు! నైనను దప్ప దిపుడు రథమునన్‌ వేగ జేరుము రాజధాని.

నిన్ను మించిన హితులు గా కన్నతండ్రి కెవ్వ రున్నారు? తిరిగి నే నేగుదెంచు వరకు వారిని నీ వెడబాయకుండ జూచుకొ'మ్మని పల్కి యశ్రువులు దుడిణె

అంత శ్రీరామచంద్రుని యానమేర

క్షణములో మర్తిపాలను శబరవరులు దొన్నెలం దెచ్చి యొక రాతితిన్నై మీద బెట్టి వినయాన చేతులు కట్టుకొనిరి.

రామలక్షణు లంత నుల్లాసన మెనగ కొద్దికొద్దిగ పాలను కురుల కలది

జడలు దాల్లిగి వారల జానకి గని “మునికుమారులనలె నుంటి" రని వచించె

అంత గాముడు లక్షణు డవనిజాత పడవ నెక్కి నుమంత్రుని బాగజూ చి హస్తముల నూపి వీడుకో లందజేసి గుహునికడ గూడ సెలవు గైకొనిరి వడిగ

నావ నదిమీద పూల స్లేందనములీల ఎత్తి కట్టిన తెరచాప లెగసియోడ నుదయుకిరణము, లలలతో నూసులాడ నరిగె నా వలియొదడ్డుకు త్వరితగతిని.

పడవనుండి రామభద్రుడు ముందుగా దిగి యనుంగుసనతిని దించుకొనియె: లక్షణుండు శబరరాజ బృంద మ్మెల్ట నలర ధన్మవాదములను దెలిపి.

97

279

280

285

286

98 మల్లెమాల రామాయణం

©. నావడిగ్గి “వదిన! నడకలో నెపుడైన ముందు నేను బోదు నెందు కనిన యడవిదారివెంట నరిగెడు సమయాన ముందుచూపు చాల ముఖ్బ్య"మనియె. 287

మత్త. నువ్వు రంతట సంతసమ్మున ముందు కేగుచు మధ్యలో పువ్వుదేనెలు, దోరగాయలు, మూలకందము లెల్లెడన్‌ నవ్వులన్‌ గలబోసి తృప్తిగ నారగించుచు సాగగా దవ్వులన్‌ గనిపించె వారికి తాపసాశ్రమవాటికల్‌. 288

చ. అది మలిసందెవేళ యిను డాకసమున్‌ విడిపోవుచుండె: నా యదనున హోమకుండములయందున వెల్వడు ధూమమేఘముల్‌ కదిసి సువాసనల్‌ పరచె రాముడు వానిని గాంచి “తమ్ముడా! ఇది కడు మంగళాస్ట్రద మదే! మన గమ్మము పోద” మంచనెన్‌.289

3h

అంత నామువ్వురును తాపసాశ్రమముల

దరిసి యందున్న ముని భరద్వాజునరసి

మహాత్ముని దివ్వపాదారవింద

ములకు ప్రణతుల నరద్దించి నిలిచి రంత. 290

తే దాశరథి యొక్ళ క్షణమాగి తనను దాను పరిచయము జేసికొని వనవాసమునకు హేతువును దెళ్చి స్వామి! యీ రాత్రి యిచట గడపునరుద్దైన భాగ్గ్యమ్ము గలిగె ననియె 291

eh

వెంటనే భరద్వాజుడు ప్రీతిమీర

“రఘుకులోత్తమ! నీవి ట్లరణ్యములకు

వత్తు వని నే నెరుంగుదు. వాసయోగ్య

మైనదీతావు మీకికపైన" ననియె. 292

తే. అంత రాముడు “మేము మీచెంతనున్న ననుదినమ్మును దొరకు మీయాశిషములు కాని... కోసల మిచటికి కడు సమీప మన్న దొక్కటె మాకు రానున్న చిక్కు. 293

అ. జనపదమ్ము లిటకు చాల దగ్గర గాన ప్రజలు పరుగు లిడుచు ప్రతిదినమ్ము మిక్కుటముగ వచ్చి మీకు మాకును శాంతి తొలగజేతు రందువలన మేము. 294

అయోధ్యాకాండము

త్తే

శాంతిమయ జీవనము, దీక్ష సాగువరకు గడపుటకు కొంతదూరాన కాననముల

ననువుగా నుండుచోటు నో యతివరేణ! తెలుపు" డని రాఘవుండు ప్రార్థించి నంత

మౌని వచియించె, “కొన్షి యామడల దూర మందు ప్రక్యతి సౌందర్శ్భాన కాలవాల మగుచు విలసిల్లు చిత్రకూటాద్రియున్న దదియె మీ రుండుటకు యోగ్యమైన చోటు

అందు గలవెన్నొ మౌనుల ఆశ్రమములు పరవశముగొల్బు నఛ్చటి పరిసరములు కనుక నీ రాత్రి నిచ్చట గడపి రేపు

తరలి చన వచ్చు" ననె భరద్వాజమౌని

అంత మౌనిశిష్మ లతిభక్తి నిడినట్టి యతిఖి పూజ లెల్ల నందు కొనిన పిదప కమ్మనైన విందారగించి శ్రీ రామబ్యంద మచట రాత్రి గడసె.

మరునాడు భరద్వాజుని

చరణములకు మొక్కి వారి సమ్మతితో నం దర నభినుతించి యా ము

గ్గురు పయన మ్మైరి చిత్రకూటము జేగన్‌

అటుల కొంతదూర మరిగి కాళిందిని వెదురుగడల తెప్ప్టవేసిదాటి కాలినడకతోనె కనువిందు జేసెడు చిత్రకూటమునకు జేరిరంత.

వదిన కోరిక మేర కిం పొదవునటుల త్వరితగతి లక్షణుం డేరు పరచె నొక్క ఆకుటి ల్లంత మువ్వురు నగ్నిపూజ

జేసి కడుమోదమున బ్రవేశించి రందు. శూన్మరథముతోడ సాొక్కి సోలుచు నుమం త్రుం డయోధ్య కేగి గుండెచెదరి

యున్న పురము నరసి కన్నీరు దిగమింగి ప్రభువరేణ్యుమందిరమున కరిగె.

99

298

299

390

301

302

100 మల్లెమాల రామాయణం

తే. రాజభవనము శోకవారాశియందు మునిగియుండుట గనుగోని మనమునందు జరుగగూడని దేదైన జరిగెనేమొ అన్న సందియ మందియు నంతలోనె. 303

తే. అట్టిదేదియు జరుగరా దవనివిభున కనుచు దేవుని ప్రార్థించుకొనుచు నరిగి పట్టెమంచాన జీవచ్చవమ్ము పగిది నున్న నృపు పాదముల చేతు లుంచె మంత్రి. 304

చ. నరపతియంత పాదముల నంటిన స్పర్శకు లేచి, చెంతనే

కరములు మోడ్డియున్న గుణగణ్యు సుమంత్రుని బారజూచి, “నా

వరసుతుభీకరాటవుల పాలొనరించి, విషాదనార్త, నీ

శిరమున మోసితెచ్చితివె? చెప్పము వేగ నమాత్మశేఖరా!" ౩05 ఆ. అనుచు పిచిబట్టినట్లు సుమంత్రుని

కరము లొడిసి పట్టి క్షాతలేంద్రు

డింక, “నా కుమారు నెపుడు గాంచెద నేన

టనుచు గుండె లవియునట్టు లేడ్జె 306

తే. అంత కౌసల్య, పెనిమిటియశ్రుజలము పైటతో నద్ది “యిపు డెంత బాధపడిన నది యరణ్యరోదన మగు నంతెగాని ఫలిత మింతేని గల్లునే ప్రాణనాథ! 307

చేతులార మీరు జేసిన యపరాధ మునకు శిక్ష నిప్ప డనుభవించు చుంటి నేను గూడ సుతునకు దూరమై" యనుచు గొల్లు మనియె నా పురంద్రి. 308

తే. మంత్రి “రాజేంద్ర! సుంత నామాట వినుడు రాముడును జానకీదేవి లక్షణుండు వననివాసము తమ పాలివర మటంచు దెలుపు మనినారు తమకు సంతృప్తిమీర. 309

ఆ. _ తిరిగిచూచుసరికి పరుగెత్తి పోవును పదియు నాలుగేండ్లు పట్టణమున కరుగుదెంచు రాము డా మరుక్షణమె మి మృరసి యాశిషమ్ము లందుకొనగ.” 310

అయోధ్యాకాండము 101

తే. అనిన సచివోత్తముని మాట కడ్డుదగిలి యుర్వినాథుడు క్షణమాగి “యో సుమంత్ర! లేదు! నాకంత భాగ్యము లేదు లేదు! కాటువేయగ నున్నది గతము నన్ను 311

మత్త. తొల్లి నేనొకనాడు వేటకు దూరమౌ వని కేగితిన్‌ కొల్లగా మ్యృగసంచయమ్ముల గూల్లియున్‌ తనివందకే మెల్లమెల్లగ ముందుకేగ సమీపమం దొక యేటిలో పిల్లయేనుగు నీరు ద్రావెడు వింత శబ్దము విన్పడెన్‌. 312

తే అంత నా సవ్వడికి మోదమంది నేను శబ్దవేధిని గురిజాచి సత్వరమ్మె వదలిపెట్టితి నదియొక బాలమునికి దగిలె నా పాపభాంఢము పగిలినట్లు. 313

అత డఢౌక అంధ దంపతుల యాత్మజు: డాతేడె దిక్కు వారి కా సుతుడటు నాశరమ్మున ప్రసూనము కైవడినేలరాల, నా వెతను భరించలేక విలపించుచు నా తలిదండ్రులంత, “నో క్షితివర! నీవు మావలెనె చెందుము పుత్రవియోగమ్యృత్యువున్‌ " 314

అనుచు శాపమిచ్ది యా వృద్ద దంపతుల్‌ కుమిలి కుమిలి యేడ్డి కుష్టగూలి తనయు దలచు కొనుచు తనున్ర చాలించి రా పాప మిపుడు నన్ను పట్టి కుదిపె. 3

తే. అదిగొ! అటు చూడు! కౌసల్య! ఆరిపోక భగ్గుమని మండుచుండె దంపతుల చితులు గుండెలకు బ్రాకె! నావేడి గొంతు నెవరో నులుముచున్నారు నే నిక నిలువజాల." 316

తే, అనుచు తలబాదుకొనుచు “రామయ్య తండి! నేను జనుచుంటి నీనాడు నిన్ను వదలి యీయ లేనైతి రాజ్బ మీయాయువైన నందుకొను మది నీకు దీర్ణాయు వగును.” gy

అ. అదియె చివరీ మాట యంతలో మృత్యువు స్వాగతించె నేమొ క్షాతలేంద్రు డంతిపురమునంత చింతాబ్దిలో ముంచి చివరి శ్వాస విడిచి చేరె దివికి 318

102 మల్లెమాల రామాయణం

తే. ప్రభువు మరణించెనను వార్త పట్టణమున క్షణము లోపల సుడిగాలి కరణి బ్రాకె; కులగురువు వసిష్టుండు వ్యాకులత జెంది వడివడిగ జేరె రాజేంద్రు భవనమునకు. 319

క్ర అంత వసిష్ట సుమంత్రులు చింతను దిగమ్రుంగి మిగుల శేముషి తోడన్‌ మంతనములాడి “వే బిలి పింతము భరతుని నరాజజీతి దొలంగన్‌. 320

తే. అరగడియకాలమేని సింపాసనమ్ము రాజరహితముగా నుండరాదు గాన తత్‌క్షణమె పాయువేగాన తరలి చనెడు నాశ్వికుల గిరివ్రజపురి కంపవలయు.” 321

క్త అని నిశ్చయించి వెంటనె అనువగు దూతలను బిలిచి అన్ని వివరముల్‌ వినిపించి, “రామభటద్రుని వనవాసము ప్రభువు మ్యతియు బలుకవలదటన్‌.” 322

™. అనుచు హెచ్చరించి రంత వసిష్టుడు

భరతుతోడ నేను బంపితి నని

పలికి ముఖ్యమైన పనియుశ్షదని యగ్న

దమ్ముల గొనిరండు త్వరితగతిని 323 తే. అనిన కులగురుశ్రేష్టున కంజలించి

దూత లావెంటనే సుమంత్రునకు మొక్కి

రమ్మమగు కాన్మ లచటివారలకు నొసగ

వెంటగొని యయోరధ్య్మాపురి వీడి చనిరి. 324

తే ప్రభువు మ్యృతదేహమును రాజభవన మందె తైలపేటికలో నుంచి తగు విధమున భద్రపరచి రమాత్ములు భరతు డటకు వచ్చులోపల శిథిలమై విఛచ్చకుండ. 325

ఆ. అయిదురేపు మాపు లతివేగముగ దూత అరిగి భరతుడున్న పురము జేరి వెంటదెచ్చినట్టి విలువైన బహుమతు అందజేసి నిలిచి రమిత భక్తి. 326

అయోధ్యాకాండము 103

మ. భరతుం డంతట “సేమమే ప్రభునకున్‌, భద్రాత్ముడౌ అన్నకున్‌ పరమోదార గుణుండు లక్ష్మణునకున్‌, కల్పాణి సీతమ్మకున్‌ కరుణామూర్త్తులు పెద్ద తల్లులకు నన్‌గన్నట్టి మాయమ్మకున్‌ గురుదేవాదులకెల్ల? తెల్టు" డనియెన్‌ కొండంతయాత్రమ్మునన్‌ 327

మత్త. అంతదూత “లయోధ్య యందున నందరున్‌ కుశలమ్మె, మీ చెంత కిప్యడు మమ్ము బంపె వసిష్ట సద్గురువర్యు త్యంత ముఖ్య విశేష మేదియొ, యశ్చటన్‌ గలదంచు, మి మెంత మాత్రము జాగుసేయక యీ దినమ్మున రమ్మనెన్‌” ౩28

తే దూత లారీతిగా తన చేత మలర బలికి నంత తమ్ముని తోడ భరతు డరిగి తాతకును మేనమామకు జోత లొనగి బయలు దేరెను రథమెక్కి త్వరితగతిని. 329

తే. స్మందనము వెంట కొంత సైన్యమ్ము గూడ రక్షణగ వచ్చ! వారట్లు రాత్రిపవళు లేడునాళ్ళు ప్రయాణించి యెనిమిదవ ది నమున జేరిరి సాకేత నగరమునకు. 339

తే. తేరు తోరణద్వారము జేరుసరికి కొన్ని యపశకునమ్ములు గోచరించె: కాంతి హీనమ్ముగా పురి కానుపించి కైక కొమరుని హృదయాన కలత పెంచె డత!

తే. భరతు డంతట “శత్రుఘ్మ! పురమునందు దుఃఖసంకేతములు పెక్కుతోచుచుండె కనుక ముందుగ మన మమ్మ కడకు నరిగి యేమిజరిగెనొ? తత్‌క్షణ మెరుగవలయు.” 332

తే అనుచు తమ్మునితో బలి యరదముననె రాణ దరిగిన ముఖ్నమార్లములు దాటి వడివడిగ నేగి కైక భవనము జేరి స్యందనము డిగ్గి లోనికి జనిన యంత 333

తే కొడుకు రాకను గమనించి కుమతి కైక సంతసమ్మున నెదురేగి స్వాగతించి “ఇన్నినాళ్ళకు నాకల లన్ని పండు నట్టి శుభలగ్న మాసన్ష్న మాయె తనయ!" 334

104 మల్లెమాల రామాయణం

ఆ. అనిన తల్లిమాట లావల బోద్రోచి “జనకు డేడి” యనుచు శయనగ్భహము లోని కరిగి యందు గానక భరతుండు తల్లడమున తిరిగి తల్లిజేరి. 335

ఆ. “అమ్మ! నగరమంత యలముకొనె విషాద

మెందువలన? తండ్రి యెచటి కేగె?

వాస్తవమ్ము దెలిపి వంతబాపుము వేగ”

ననుచు బట్టి కుదిపి యడిగె నంత. 336 తనయుని యా వేదనమును

గని కేకయ రాజపుత్రి కలవర మందెన్‌

జనపతి మరణము నే విధ

మున దెలుపగ వలయు కూర్మి పుత్రున కనుచున్‌. 33/

తే కాని... తష్టదు గాన నా కఠిన హృదయ

కొమరునకు చేదు వార్తను కొంతతీపి

నలది చెప్పటయే మంచి దని “కుమార!

జరుగకూడని దేదియు జరుగలేదు 338 క. _ పుట్టిన ప్రతి మనుజుండును

గిట్టుట సహజమ్ము భువిని కేవల మటులే

చెట్టంత మనుజనాథుడు చిట్టచివరి శ్వాస విడిచి చేరెను దివికిన్‌." 339

అ. తల్లినోటి వెంట నుల్లము భగ్గున మండు వార్త వినిన మహితగుణుడు భరతు డంత “రామభద్రు డేమాయె? భూ మీశు మరణమునకు హేతు వేమి?” 340

తే అనుచు నావేశ మడరంగ నడిగినట్టి కొమరునకు మెల్లగా తాను గోరినట్టి వరములను దెల్చి, “రాముడు వనుల కేగె సీతతో లక్ష్మణుని తోడ చేతమలర. 641

తే. జనకునానతి తలదాల్లి చనియె జ్లేష్ణు డడవులకు; నీవు మీయమ్మ యానమేర కిపుడు పిత్యకర్మలను జేసి నృపపదమ్ము స్వీకరింపుము గురుని యాశీస్సు లంది.” 342

అయోధ్యాకాండము 105

తర. _అటుల కేకయరాజిపుత్రిక యన్న వెంటనె “దుష్ట! నీ కెటుల నాలుక వచ్చె చెప్పమ? యింత దుర్భరవార్తలన్‌ కటకటంబడకుండ దెల్బగ, కానలోపలనగ్రజుం డటమటించుచునుండ రాజ్యము హాయిగా నెటు లేలుదున్‌? 34౩

మత్త. ఇంత దుర్మతి వన్న సత్యము నించుకేని యెరుంగకే

సంతసమ్మున బెండ్లియాడెను సార్వభౌముడు నిన్ను, నీ

వెంత హింసలపాలు జేసితొ? యీ నరమ్ములు పొంద, నే

కాంతమందున నా మహాత్ముని కర్మ శస్వరడాకిని!" 344 ఆ. అనుచు నీసడించి యాగ్రహమ్మును బెంచి

భరతు డంత కైక నరసి “నిన్ను

హత మొనర్భ చేతు లాడుటలేదు నా

కన్షతల్లివైన కారణమున 345

ప్రై

నవమాసములు మోసినట్టి తల్లిని మించి ప్రియమార నిన్ను సేవించిసాడు కన్నతండ్రిని మించి న్నైల్లవేళల

గారాల సుతునిగా గాంచినాడు పట్టణపౌరుల ప్రాణమిత్రులరీతి

జూచి వారల మదిన్‌ దోచినాడు ధర్మరక్షణమందు తండ్రిని మించిన తనయు డన్న ప్రశస్తి దాల్చినాడు

తే. పరమగురునొద్ద "కాబోవు ప్రభువు రాను” డనిన శుభకానునల నందుకొనిన ఘగుని యడవులకు పదునాలుగేండ్లంపు మనుచు మగని గోరగ నీకెట్లు నునసు వచ్చా? 315

తే భర్భఘాతుకీ! యిక్ష్వాకువంశమునకు ప్రకయమును దెచ్ది పెట్టిన పాపమునకు తగిన దండనగా నిన్ను తల్లి యనుచు బలుక నిక మీద నాయన్నపదములాన! 34

తే. రామలక్ష్మణు లెద్దరీ రాజ్బమునకు రెండు నేత్రాలు: వారు లేకుండ నెట్లు గద్దె నెక్కెద నని కలల్‌ గంటి వీవు చూడ! నీ మోము జన్మలో చూడ నెపుడు. 348

106 మల్లెమాల రామాయణం

తే. జనకునంత్యక్రియలనెల్ల సత్వరమ్మె

పూర్తి గావించి యడవికి బోయి నేను

జ్షేషు నొప్పించి కొనితెచ్చి సింహపీరి

నధివసింపంగ జేసెద” నని వచించి. 349 తే. భరతు డటనుండి కౌసల్య భవనమునకు

తమ్మునిం దోడుకొని యేగి తండ్రిదేహ

మరసి గొల్లున విలపించి యచటనున్న

తల్లు లిరువురకును బ్రణమిల్లి పలికె. 350

తే. “తండ్రియేగా దిపుడు నేను తల్లిగూడ లేని దీనుడ నా తప్పలేదు సుంత కాని పాపమ్ములో పాలు కలదు కొంత నాకు, కైకేయి బిడ్డనైనందువలన. 351

తే కనుక దయయుందచి నన్ను మీ కన్నబిడ్డ లందు నొకనిగ భావించు” డనుచు యేడ్డి యశ్రుజలమున కౌసల్య అంఘ్రియుగము కడిగె నాతల్లిహృదయము కరగునటుల. 352

చం భరతుని వేదనం గని చివాలున వానిని లేవనెత్తి యా దరమున కౌగిలించి కనుదమ్ముల కొంగున నద్ది, “నాయనా! దురితము నీదిగాదు: మన దుఃస్టితి కెవ్వరు బాధ్యులైన, నం దరకును చింతయే మిగిలె;: నైనను చేసెడిదేమి లేదికన్‌.” 353

తే. అనుచు కౌసల్య పసిబిడ్డ ననునయించి నట్టు భరతుని నోదార్డె నంతలోనె ముని వసిష్టుడు చనుదెంచి “జనకున కిపు డుత్తరక్రియ లీవె శాస్త్రోక్తరీతి. 354

తే. జరుపవలయును కనుక నో భరత! గతము దలచి వగవక రమ్మని పలికె నంత దశరథుని దేహమున్నట్టి తైలద్రోణి కడకు నా యన్నదమ్ములు వెడలి రవుడు. 355

తే ప్రభువు పార్థివ దేహమున్‌ రాజలాంఛ నములతో దీసికొని శృశానమున కేగి చితిని గంధపుచెక్కలు ేర్చిపేర్చి దానిపై నుంచి వేదమంత్రాల మధ్య. 356

అయోధ్యాకాండము

త్తే

De

107

ధర్మసమ్మతమగు రీతి దహనవిధులు

పూర్తి గావించి; రంతట ముని వసిష్ట

డవనివిభు పాలనను గొనియాడి, రాజ

పుత్రులను గొని సాకేతపురికి నరిగె. 357

భరతశత్రుఘ్ము లిరువురు పది దినమ్ము

లశ్రుజలములు తోడుగా నవని శయ్య

పవ్వళించిరి ఆచార భంగి నటుల

నిర్వహించిరి కర్మల నిష్టతోడ 358

భరతు డంత తండ్రి ద్వాదశదినకర్త

బుధగణమ్ము మెచ్చ పూర్తికేసి

భూసురోత్తములకు భూదాన గోదాన

ముల నొసంగి వార లలరునటుల. 359

అంతలో మేని నిండుగ వింతవింత

స్వర్ణ భూషలు ధరియించి సంబరమ్ము

దర్భ మెనయంగ కైకేయి దాసియైన

దుష్టమంథర లోనికి తొంగిచూచె. 360

ముసలికోతికి జలతారు వసనములను

కట్టి బంగారు గొలుసులు జుట్టినట్లు

దోచు మంథర నపుడు శత్రుఘమ్ము డరసి

“భ్రష్ట! నిను జంపెద” నటంచు పైకి దుమికి. 361

“నీ మూలమున గదా! ఇట్లు మా జనకుడు విలపించి ప్రాణముల్‌ వీడవలసె

నీ మూలమున కదా! ఇట్లు మా వంశాబ్ఞి చంద్రుడు వనముల సొగవలసె

నీ మూలమున కదా! ఇట్లు మా వదినమ్మ కందమూలములతో గడుపవలసె

నీ మూలమున కదా! ఇట్లు మా పెదతల్లి సుతునకు దూరమై బ్రతుక వలసె.

ఇన్షి దారుణ క్రియలకు హేతువైన

నీవు జీవించియున్న ననేకమైన

ఆపదలు దెచ్చి సెట్టెద వంతిపురి"క

టంచు పిడికిలి పైకెత్తె హత మొనర్ద. 36

UN)

108 మల్లెమాల రామాయణం

తే. అపుడు మంథర శత్రుఘ్ము నాగ్రహమ్ము నరసి తష్టదు చావిక నని గ్రహించి వెంటనే వంగి పాదములంటి మొక్కి వగవ దోడగెను నను జంప వలదటంచు. 363

తే. కాని శత్రుఘ్ము డిసుమంత కరుణ గనక జుట్టుబట్టుక లేపి ఛీకొట్టి “దుష్ట! వగలు చాలింపు: మిపుడు నిన్‌ వదలిపెట్ట" ననుచు గర్జించె దశధిశ లదరునటుల. 364

తే. అంత భరతుడు “తమ్ముడా! అతివ లెంత పాప మొనరించినను చంప పాడిగాదు; మెచ్చ డిటువంటి పనుల నమేయగుణుడు రాము: డటుగాన తీయకు ప్రాణములను. 365

ఉ. కైకను జంపకుండుటకు కారణ మద్దియె? లేక యున్నచో పీకను నుర్మి యంతిపురి భీతిల నామెను గూ ల్ఞకుందునే? లోకము మెచ్చనట్టిపని రుద్రుడు సైత మొనర్ధడందుచే కుమతిన్‌ క్షమింపు: మది అన్నకు నాకును గూర్చు మోదమున్‌. "3౩66

తే. అనిన భరతుని నూటల అర్థ మెరిగి ఆగ్రహము వీడి శత్రుఘ్ము డట్టె నెట్టె: ముసలిమంథర కైకేయి ముందు బడియె గడచె గండము లెమ్మని కైక యనియె. 367

క్ర మరునా డుదయ మమాత్యులు గురువు వసిష్ణుండు మరియు కొందరు ముఖ్యుల్‌

భరతుని సాన్షిధ్యమ్మున కరిగి పరామర్శ జేసి రాదర మొప్టన్‌. 368

ఉ. అంత వసిష్టమౌని ప్రియ మారగ నిట్లు వచించె “రాజ్యమం దంతట రాజులేని కతనన్‌ పొడసూపె నరాజకత్వ: మిం కింతయు జాష్మ మూనదగ; దీదిన మెల్ల జనాళి మెచ్చ ని శ్రింతగ రాజ్ఞ్యపాలనము చేకొనుమో! యినవంశభూషణా.” ౩369

క్ర అని కులగురువు వచించిన వెనువెంటనె భరతు డోవివేకివతంసా! ఇనవంశమందు జ్లేష్టుడె ఘనమగు నీ రాజ్ఞమేలగా వలె నెపుడున్‌. 370

అయోధ్యాకాండము 109

తే. నిజము మీకు దెలియదే మౌనివర్శ! అగ్రజుడు రాము డుండ సింహాసనమ్ము నధివసించుట గాదు నే నంటుకొనుట గూడ పాపము! వినుడు నా వేడికోలు. 371

తే సకలమగు రాజలాంఛనచయముతోడ ప్రబలమై యొప్ప చతురంగబలముతోడ రాము డడవుల నున్నట్టి ప్రాంతమునకు జనెద మందర మాపైన వినయ మెనయ. 372

తే అన్న నర్థించి యొష్టించి అడవులందె రామ పట్టాభిషేకము రంగ రంగ వైభవమ్ముగ జరిపించి పట్నమునకు దోడితెచైైెద మెంతొ సంతోషమెనయ. 373

తే. అష్టటికిగాని నా హృదయమ్మునందు రగులుచున్నట్టి బాధ చల్లారబోద"” టనుచు భరతుడు కులగురువునకు దెలిపె మేలుమేలని అందరు మెచ్చునటుల. 374

క. అంత సుమంత్రుడు మిక్కిలి సంతసమున పయనమునకు సర్వము సిద్ధ మంతయు త్వరితముగా జన మంతయు మెచ్చంగజేసె నతులితరీతిన్‌. 375

ఉ. రామునిదర్శనమ్ము మరలన్‌ లభియించునటంచు కొందరున్‌ రాముని పాత్తులేని నగరమ్ముననుండ మటంచు కొందరున్‌ రాముని నెట్టులైన కొని రావలె పోయి యటంచు కొందరున్‌ రాముడు రానిచో యడవులందె నివాస మటంచు కొందరున్‌. 3౩76

అంద రయోధ్యను వీడిరి సందడి మిన్నంటునటుల సాగెను రథముల్‌ ముందుగ జను సచివాగ్రణి స్మందనమున భరతు డెక్కె! సర్వము తానై. ar

తే. తాననొనర్జిన ఘోరమౌ తప్పిదమును దిద్ది రాముని తిరిగి తోడ్తెచ్చుకొరకు కాననములకు జనుచున్న కన్న కొడుకు విజ్ఞతను కైక మదిలోనె వినుతి జేసి. 378

110 మల్లెమాల రామాయణం

తే. అతనితో మాటలాడు ధైర్యమ్ములేక

తాను కౌసల్య కడకేగి తలను వంచి

“అక్క! నా తప్ప మన్నింపు" మనుచు వేడి

అడవి కేనును వచ్చెద ననుచు పలికె. 379 తే అంత కౌసల్య కైకేయి ననునయించి

“బాధపడకుము చెల్లెలా! బ్రహ్మవ్రాత

తలగ ద్రోయగ నెవ్వరి తరముగాదు!

కలసి చనియెద మడవికి గతము మరచి." 380

అని కౌసల్య వచించిన మనమున ముదమంది కైక మరు నిముసమె, తా నును తేరు నధివసించెను కని నగర మృ్మంతులేని కౌతుక మందెన్‌. 381

తే. దండు సాకేతపురి వీడి త్వరితగతిని అడవిదారుల జని సూర్యు డస్తమించు సరికి జాహ్నవీతీరము దరికి జేరె నెల్లవారల హృదయము లుల్లసిల్ల. 382

ఆ. రాత్రి విడిది కదియె రమణీయ మగుచోట టంచు నెంచి సైన్య మందరకును యెట్టి కొరతలేని యేర్హాట్లు గావించె లలితభక్తి భరతు డలరునటుల 383

తే, కైక తనయుడు భరతుడు కాననముల కగణితమ్మగు సైన్యము నందివచ్చి విమల జాహ్నవీ తీరాన విడిదిజేసె నని గ్రహించిన గుహుడు తా నతిరయమున. 384

తే. అర్హమగు కానుకలతోడ నతని గలసి వినయమును భక్తి జాల్వార తనను తాను పరిచయముజేసికొని మీకు వలసినట్టి పనులు సెలవిండు నేజేతు నని వచించిె. 385

తే. అంత భరతుడు గుహుని సమాదరించి “ఆప్తమిత్రుడ వీవు మా యన్షగారి కతడు పూజ్యుడు నాకు నే నడవినుండి వాని గొనిపోవు పనిమీద వచ్చినాడ. 386

అయోధ్యాకాండము

తే,

ప్ర

పిలువకయె పల్మినట్టి యో ప్రేమమూర్తి! అరుగవలె భరద్వాజుని యాశ్రమమున కందరము రేపు నీ వెటులైన మమ్ము గంగ దాటించి పుణ్యము గట్టుకొమ్ము.”

అని భరతు డనిన వెంటనె

వనయమ్మున గుహుడు పలికి “వినుతగుణాఢ్ల్మా! జనహిత మగు పనులను నా

పనులుగ భావించు టానవాయితి నాకున్‌.

కనుక నీరాత్రి మీరంత కలతమాని విశ్రమింపుడు హాయిగా వేగుచుక్క బొడుచువేళకు నేవచ్చి మోద మలర మరల దర్శింతు నని చెప్పి తిరిగి చనియె

భరతశత్రఘ్మ్ను లంతట వారివిడిది

కరిగి శయనించి రైనను వరగుణుండు భరతునకు నిద్ర కంటిపై వాలదాయె నగ్రజుని చింత తనను వెంటాడుకతన.

కుటిలబుద్ధిని కైకేయి కోరినట్టి వరములకు వ్యద్ధ భూపతి శిరసు వంచి చేయరానట్టి దుష్కృతి జేసినాడు

కాన రఘువంశ ఘనకీర్తి గంగ గలిసె. ప్రభువుగా ధర నేలవలసిన నాయన్న అడవిదారుల దిరుగాడవలసె! శిల్చసుందరమైన తల్బమ్మునకు మారు తృణశయ్యపై బవ్వళింపవలసె! షడ్రసోపేతమౌ సరసాన్నమును వీడి అడవిదుంపలతోనె గడుపవలసె! సచివసత్తములతో సభ నిర్వహించుట మాని మృగాలలో మనసలవలసె! అన్నిటిని మించి నీరెండవైన నెన్న డరసి యెరుగని వైదేహి ఆత్మవిభుని విడిచి సాకేతపురిని జీవించలేక కొండకోనల తలదాచుకొనగ వలసె.

387

388

389

390

391

392

ప్రా

ఇంతకన్న ఘోర మేమున్న దిలలోన అనుచు తెల్లవారు లలమటించి కాస్త కునుకుటీయ గడగె నా లోపల గునుగు పరుగుతోడ గుహుడు వచ్చి.

ధర్మబద్ధముగా శుభోదయము పలికి “అయిదువందల నావలాయత్తపరచి నాడ! రామానుడా! మీరు నదినిదాట” ననుచు వచియించె సౌవహార్ద మెనయునటుల.

అంత నాయన్షదమ్ము లనంత మైన ఆదరమ్మున గుహని స్నేహాతిశయము నభినుతించుచు పరివార మనుసరింప రేవు దరి కేగి రమిత సంప్రీతితోడ,

అలలపైన దేలియాడు మహారాజ సౌధమటుల దోచుచక్కనైన పెద్ద నావలోన నొద్దిక నాయన్న దమ్ము లెక్కిరంత దానిలోనే.

రాజమాతలతో పాటు పూజనీయ గురువరేణ్యులు మంత్రులు, ధరణిసురులు మొదలుగా గల ముఖ్యుల నధివసింప

జేసె స్వయముగ గుహుడు జేజేల నడుమ. తక్కిన పరివారమ్మును

మిక్కుటమగు సంతసమున మేల్‌మే లనుచున్‌ ఎక్కెను నావలనిండుగ

నక్కజమున అరుణకిరణు డాహా! యనగన్‌.

కొన్షి నావల నశ్వాలు కొలువుదీరె అరదములు కొన్ని నావల నాక్రమించె కారిలము కొన్ని నావల కాలుమోపె కదలి నొకసారె యోడఢడలు కలకలముగ.

మావటీండ్రెక్కిన మత్తేభ సందోహ మేటికడ్డమ్ముగా నీదసాగె!

మల్లయోధుల బృంద ముల్లాసమున చేతు లూతగా ముందున కురుకసాగె!

మల్లెమాల రామాయణం

39౩

394

395

396

327

398

399

అయోధ్యాకాండము

కుర్రకారెక్కిన కర్రతెప్పలబారు వడిగ కేరింతల నడుమసాగె! కుండలే అండగా కొందరి జలయాన ముయ్య్మాల జంపాల లూగిసాగె!

తే. మనోహరయానద్యశ్యముల నరసి పుణ్య భాగీరథీనది పులకరించి చలిత లలిత తరంగ హస్తములతోడ శీకరమ్ముల రూపాన సేసజర్లి.

ఆ. అంతలోనె బృంద మంత మెరుంగని కౌతుకమున నవలిగట్టుజేరె; వారి రాక నరసి కూరిమి బ్రకటించి చెప్పె స్వాగతమ్ము చిగురుటెండ.

తే. భరతు డందర నచ్చటే వదలిపెట్టి అస్తశస్తాలు విడిచి శ్వేతాంబరములు దాల్చి కులగురువును గూడి త్వరితగతిని ముని భరద్వాజునాశ్రమమునకు జనియె.

తే. వర వసిష్టుని గని భరద్వాజమౌని అతిథి సత్మార మొనరించి “యతివరేణ్య! యెదురుజూడని శుభము నాయెదుట నిలిచి నటుల దలపోయుచుంటి నిన్నరసినేడు.”

తే. అనుచు ప్రియమార వచియించి అంతవరకు కరములను మోడి నిలుచున్న భరతు నరసి “కైక ముద్దుల తనయ! యే కార్య మభిల షించి వచ్చితి విటకు వసిష్ణుతోడ.”

తే. అనిన ముని పల్ములందలి యంతరార్థ మెరిగి భరతుడు ఖిన్నుడై “వరగుణాడ్మ! కైక తనయుడుగా నేను కాననముల నడుగు నిడలేదు మీ పాదమాన! వినుడు.

తే. పూజ్య డిక్ష్వాకువంశ విభూషణుండు రాము నెటులైన యొప్టించి రాజ్యమునకు తోడుకొనిపోయి వేదశాస్తోక్తవిధుల పట్టముం గట్టు పనిమీద వచ్చినాడ.

400

401

402

403

404

405

406

‘bh

తల్లిజేసిన తప్పకు తనయుడ నని నాకు శిక్ష విధించక లోకమాన్న! అడవులందున రాము డున్నట్టి నెలవు దెలిపి మనసార ఆశీర్వదింపు” డనియె.

భరతు పలుకులదాగిన భావ మెరిగి దార్శనిక వర్యుడా భరద్వాజమౌని మొలకనవ్వుల నతనిపై చిలుకరించి

ముని వసిష్టుడు మురియంగ ననియె నిట్లు.

“బాధనందకు మిక్ష్వాకు వంశతిలక! నే నెరుంగుదు నీ త్యాగనిరతి: కాని విన దలంచితి నీనోట వివర మెల్ల నీ మహోన్నత లక్ష్యమే నీకు రక్ష!” అనుచు భరతుని దీవించి క్షణమ్మె సంయమీంద్రుడు తన తపశ్శక్తిచేత సకల వసతులు గల సువిశాలమైన స్నిగ్ధ సుందర భవనమున్‌ సృష్టిజేసి.

అందులోగల రాజసింహాసనమ్ము నరసి భరతుడు శ్రీరామునాత్మ దలచి ప్రణతు లర్జించి మునిపాదపద్మయుగళి నతుల భక్తిని కన్నుల కద్దుకొనియె.

అంత నా మౌని పుంగవు డాదరమున భరతు బృందము వారినందరను జిలిచి వేరువేరుగ షడ్రసోపేతమైన

విం దొసంగెను మిక్కిలి వేడ్మతోడ.

ఏనుగులు గుట్టములు గూడ నింతమంచి తిండి దొరకదు మనకని తృప్తిదీర వలయు భక్ష్యములను గొంతువరకు మెక్కి అంద రబ్బురపడులీల చిందు లిడియె.

అంద రారాత్రి హాయిగా నచట గడపి

రంత భరతుండు తొలిజామునందె లేచి ఉదయవిధులను ముగియించి ముద మెలర్ధ చనె భరద్వాజమౌని దర్శనము కొరకు.

మల్లెమాల రామాయణం

407

408

409

410

412

413

414

అయోధ్యాకాండము

ప్రా

అప్పటికె మౌనిపుంగవు డాశ్రమమున అగ్మిహోత్రాదిక్ళృత్యము లాచరించి సరసిజాప్తుని మించుతేజిస్థుతోడ శిష్యబ్బందము మధ్య వేంచేసియుండె. భరతు డఢామహనీయుని పాదపద్మ ములకు ప్రణమిల్లి “మౌనీంద్ర! పూజనీయు డైన మాయన్న నివసించు నట్టి చోటి కరుగు మార్గము సెలవిం” డటంచు వేడె.

మునివరేణ్యుడు భరతుని వినయశీల

మునకు హర్షించి “ఇనవంశభూష! నీకు 9.

కలుగు మీయన్న దగ్గర కార్యసిద్ధి

అనుచు నాశీస్లు లందించి అనియె నిట్లు.

రాముడు చిత్రకూటమున లక్ష్మణుసేవలు నిత్యమందుచున్‌ భూమిజతోడ మౌనిజనముఖ్యులు మెచ్చగ నున్నవాడు, నీ వా మహనీయవర్తనున కన్షిట దీటగు వాడ వందుచే

415

416

417

యేమియు సందియమ్ము వల దేగుము నీకట మేలుచేకురున్‌. 418

మౌనియాశీస్లులను వేదమంత్రములుగ దలచి భరతుని బృందము తత్‌క్షణమ్మె పయన మాయెను రాముని వాసమైన చిత్రకూటాద్రిజేర నిశ్చింతతోడ. కొంతదూర మటుల కోలాహలమ్ముగా యాత్రసాగిపోయె నంతలోనె వెంటనున్న గుహుడు వ్రేలెత్తి చూపుచు “నదియె చిత్రకూట” మని వచించె.

భరతు డాప్రాంత సౌందర్య గరిమ నరసి సంతసమునాపుకొనలేక చెంతనున్న ముని వసిష్టునితో “సాధుజనవతంస! అద్భుతావహ మిచ్చటి అడవిశోభ. ఒకవంక బొడగన్ష్న నకలంక జలముతో నెగసిదూకెడు సెలయేళ్ళ సాబగు ఒకవంక బొడగన్న నుద్మానవనముల జ్ఞిప్తిజేసెడు నికుంజముల సొబగు

419

420

421

116 మల్లెమాల రామాయణం

ఒకవంక బొడగన్న శుకములతో నిండి కనువిందుసేయు వ్యక్షముల సొబగు ఒకవంక బొడగన్న సకల సౌభాగ్యముల్‌ ప్రతిఫలించెడు భూధరముల సొబగు తే అరసి ఆనంద నర్తన మాడుచున్న దంతరంగము మాటల కందనటుల నెంత పున్నెము జేసెనో యిచట దిరుగు జంతుజాలము తోొల్లింటి జన్మమందు. 422

తే అగ్రజుం డిఛ్చటే తన యాశ్రమమ్ము నేల నిర్మించుకొనెనొ నాకిప్ప డర్ధ మాయె గురుదేవ! బృంద మంతటిని యిచటె యుంచి మన మిద్దరమె బోవు టొప్ప" ననియె. 423

తే సమయమందు శ్రీరాము డాశ్రమమున గాక మందాకినీ నదిగట్టుమీద ననుగు సతితోడ గూర్షుండి అలలు పంచు అనుపమానందమున దేలియాడుచుండె. 424

En

వారి కల్లంత దూరాన భూరిగుణుడు

లక్షణుం డొక భూరుహరాజ మెక్కి

అన్న వదినల సేమమ్ము నాత్మ దలచి

అప్రమత్తత నల్లిక్కు లరయుచుండి. 425 తే అచట భరతుని సైన్మమా యడవి సోయ

గమున కచ్చెరు వందుచు కాంచనుంటి

మార్తజనబంధు నన్న హర్నాతిరేక

మున నరువసాగె! నింగి మార్తోగునటుల 426

ఆకేకలు లఅక్ష్మణు చెవి సోకగనే కలతజెంది శుభసమయమునం టీకలకల మేమిటియని చేకొని చాపమ్ము చెట్టు చివరకు జేరెన్‌ 427

౪. అచటినుండి చూచి అది కైక తనయుని సైన్య మనుచు దలచి సత్వరమ్మె కొదమసింహ మటుల కుప్టించి చెట్టుపై నుండి దూకె! పుడమి గుండె లదుర. 428

అయోధ్యాకాండము

అతని యాగ్రహావేశాన కాజ్బ మటుల మరల కేకలు విరివిగా మారుమోగె: నంత సౌమిత్రి నిస్థంశయముగ భరతు డగ్రజుని పైకి దండెత్తి నని భ్రమించి.

విల్లు చేతబట్టి వేగ నారి బిగించి

బాణ మెక్కువెట్టి పర్వు బెట్టె;

నన్నకడకు; రాము డది జాచి “తమ్ముడా! యేమి జరిగె? బాణ మెందు" కనియె.

అంత లక్ష్మణు “డన్న! నిన్‌ హతు నొనర్భ దలచి దుష్టుడు భరతుడు దండుతోడ వచ్చుచున్నాడు వెంటనే వాని కెదురు బోయి తీక్ల బాణాలతో పుడమిగూల్ల్తు. వానినే గాదు గ్రుడ్డిగా వానివెంట నరుగుదెంచిన సైన్స మంతటిని జంపి నెత్రుటేరులు పారించి నీ బుణమ్ము దీర్షుకొనియెద నాశీర్వదింపు” మనియె.

అనుగు తమ్ముని యాగ్రహమునకు హేతు వాతనికి తనపట్ల నున్నట్టి భక్తి

యని గ్రహించిన శ్రీరాము డాత్మలోన భరతునైజము దలపోసి పలికె నిట్లు.

“లక్ష్మణా! నాకు భరతుడు ప్రాణసముడు చెడును కలనైన దలపని స్నేహశీలి పగర సైతము ప్రేమించు భవృ్యగుణుడు తప్పగా వాని నెంచుట తగదు మనకు. కైక కొమరుడన్న కారణమాత్రాన సాధుచరితు భరతు జంస బూను కొనుట మానవత్వమును హత్యజేయుటే యని యెరుంగవలయు ననుజ నీవు!

అగ్రజుండు తమ్ము లందర తనయుల ట్లరయవలయు నట్టు లరయడేని వానికన్ష పాపి వసుధలో నుండడీ నిజ మెరుంగ వలయు నీవు కూడ.

117

429

430

431

432

433

434

435

436

వాస్తవముగ వచ్చువాడు భరతు డైన వాని సంహరించి వసుధ నేలు

కొను తలంపు నీకు మనమున గలదేని తెలుపు మివుడు తేటతెల్లముగను.

భరతునకు నేను నీ కోర్కె నెరుగజేసి హింసయన్నది లేకుండ యీ దినమ్మె

రాజ్య మిష్టింతు నీ" కని రాము డనియె! తత్‌క్షణమె లక్షణుని యమ్ము ధరణి బడియె.

అన్న నోటివెంట నంతటి కఠినమౌ మాట నెపుడు వినని మహితగుణుడు కంటనీరువెట్టి కరములు ముకుళించి అనియె నిట్లు మిగుల ఆర్తితోడ.

“అన్నా! పొరబడితిని నే

నన్నా! నా తప్ప దెలిసె నన్నా! యిక నే

నెన్షడు నొప్టించను, ని

నన్నా! నను కరుణజూడు మన్నా” యనియెన్‌.

అంత శ్రీరాము డనుజుని నాదరమున దగ్గరకు దీసి కన్నుల తడిని తుడిచి “మనసు నొప్పించినానని గనకు వగపు; ధర్మమే గెల్లితీరు నీ ధరణి తుదకు.”

అనుచు తమ్ముని నోదార్చి యనుగుపత్తి వంక బొడగని రాముడు “వనరుహాకి! లక్ష్మణుని యాగ్రహమును జల్లార్లుకొరకు కటువుగా బల్కితిని వేరుగా దలపకు.”

అనిన వెంటనె జానకి “ఆర్యపుత్ర! అన్నదమ్ముల మధ్య ప్రేమానురాగ ములకు శాశ్వత సంకేతములుగ మీరు నిలిచిపోయెద రవనిలో నిశ్చయముగ.”

అని ధరణిజాత వచియిం చిన లక్షణు డామె నరసి చేతులు మోడైెన్‌ అనుజుని ప్రియసతి నొకపరి

గని రాముం డా శమమున కరిగెద మనియెన్‌.

మల్లెమాల రామాయణం

437

438

439

440

441

442

443

444

అయోధ్యాకాండము 119

తే. కులగురువు తోడ నగ్రజుకొరకు నాల్లు దెసల నరయుచు జనుదెంచు దివ్యగుణుడు భరతు డొక సాలవృక్షముపైకి నెక్కి

కనియె రాముని కన్నుల కరవుదీర. 445 తే. వెంటనే చెట్టుదిగి తన వెంటనున్న

మునివరేణ్యు వసిష్టుని గని “మహాత్త!

అదిగొ! కన్షించునదియె రామాశ్రమమ్ము

ముందు నేబోయి అన్నకు మకు లిడెద. 446

తే. అంతలో మీరు మనవార లందరకును పరమ క్యపతోడ నీ శుభవార్త దెలిపి వెంటబెట్టుక రం"డని వినయ మెనయ బలికి భరతుడు తురగమై పరుగుపెట్టె. 447

తే. ఆశ్రమము ముందు కూర్చుండి యాకసమున

మెల్ల మెల్లగ పయనించు మేఘములను

సతికి జూపుచు రాముడు “సరసిజాక్షి!

చాల ఇష్టము నీలిమేఘాలు నాకు.” 448 తే. అనిన భర్తను గని దరహాస మెనయ

“అవును మీమేని వర్ణము నదియెగాన

నేను సైతము పులకింతు నీలిమబ్బు

నరసి"యని పర్కె వైదేహి మరది మురియ. 449

తే. అంతలో “అగ్రజా! రామ!” యనెడు పిలుపు దిక్కు లన్షిటి యందు ప్రతిధ్వనించె; రాము డా కంఠరవము భరతుని దంచు దలచి వెంటనె లేచి యుత్తాహ మొప్ప. 450

తే హస్తములు సాచి తమ్ముడా! యనుచు బిలిచి అడుగుముందుకు వేసెడునంతలోనె బాణమటు దూసుకొని వచ్చి భరతుడన్న అంఫ్రియుగ్మము ముందు సాష్టాంగపడియె. 451

లై

అంతలో సాకేత మడవిజేరినయట్టు లగుపించునట్టి సైన్మ్యమ్ము తోడ రాజధర్మమ్మును పూజనీయమ్ముగా దలచెడు సచివసత్తముల తోడ

120

నాలుగు వేదాల నౌపాననము బట్టి

నట్టి భూసుర సమూహమ్ముతోడ

గణన కందని లీల గన్టట్టుచున్నట్టి

సకల వ్యత్తుల పౌరజనము తోడ

ఆర్తితో దూగు రాజ్జీత్రయమ్ముతోడ

బుషి వసిష్టుని తోడ శత్రుఘ్ముతోడ భరతుబ్యంద మహో రామభద్ర యనుచు వచ్చి నిలిచెను యాశ్రమవాటిచుట్టు. పరమభక్తుడు దేవుని పదములంటి శిరము సోకంగ మొక్కిన సరణి ధరణి పైన బడియున్న భరతుని పట్టిలేపి

అటులె ముద్దాడి శ్రీరాముడనియె నిట్లు “తమ్ముడా! యేమిటి? యకాలదర్శనమ్ము నాయన మరెట్టు లున్నారు నగరమందు రాజ్ఞపాలన కార్యభారమ్ము వలన వారిసేవను విసరింపంగ దగదు.

నేను లేని కొరత నీవు శత్రుఘ్ముడు తీర్చవలయు నట్లు తీర్చకున్న

నందు కొంత పాపమంటు నాకును కాన జనకు ప్రేమ జూడు” డని వచించి.

శ్వేత వస్తాల మాటున చింతదాచి తన్మయత్వములో మున్గి తన్నుజూచు తల్లులను గాంచి రాముడు తండ్రి నాక మునకు జనె నని దుఃఖాన మునిగిపోయె.

“తండ్రి దివికేగు సమయాన దగ్గరుండి

వలయు పరిచర్యలను జేయు భాగ్యమునకు

నోచుకొననైతి మారునే? నుదుటి వ్రాత అకట! యెంతటి నిరయు డా విధాత.”

అనుచు భోరున విలపించు ననుగు సుతుని

తల్లి కౌసల్య యోదార్జి గొల్లు మనియె, అంత శ్రీరామచంద్రుడు అమ్మకంట జాలువారెడు నీటిని కేల దుడిచె.

మల్లెమాల రామాయణం

452

453

454

455

456

457

458

అయోధ్యాకాండము 121

ఆ. ఒకరి నొక్క రట్టు లోదార్ముకొనుచున్న

తీరు నరసి కైక “దీనికంత

కారణమ్ము నేను గావున మన్మించు”

మంచు రాము కరములంటి యేడ్డె. 459 తే. అపుడు రామయ్యు కైకమ్మ ఆర్తి నరసి

“ఇందు నీ తప్ప రవ్వంతయేని లేదు;

అమ్మ! దయయుంచి నా మాట నమ్ముమమ్మ!

జరుగవలసిన దేదైన జరిగితీరు. 460

తే. అడవులకు నన్ను బంపించినందువలన తాపసుల మధ్య జీవన తత్త మెరిగి నడచుకొనునట్టి భాగ్యము నాకు దక్కె లోక కల్యాణ ఫలితమ్ము నీకు దక్కె.” 461

తే అట్లు రాముడు తన తల్లి ననునయించు

వైన మారసి భరతుని మానసమ్ము

సంబరమ్మున నుప్ప్తాంగు సంద్రమాయె

మాత కైకేయి వేదన మాయమాయె. 462 తే. అంత దాశరథి వసిష్టుననుమతిగొని

దివ్య భాగీరథీనదీ తీరమందు

తండ్రెగారికి పిండ ప్రదాన విధులు

నియమనిష్టాగరిష్టుడై నిర్వహించ. 463

క్ర ఆపైన నంద రొకచో

కోపము తాపమ్ము మరచి కూర్జొని యుండన్‌

తాపసియైన వసిష్టుడు

చూపరులను తేరిపార జూచి వచించెన్‌. 45+ తే. “నాయనా! రామభద్ర! మీనాన్న్షగారి

ఆత సంతృప్తి గనురీతి నంత్యకర

జ్యేష్ట పుత్రుడ వైన నీ చేతితోడ

జరుపుటను గాంచి నా మది సంతసింబె. 465 తే తాను సైతము నారవస్తాలు దాల్చి

భరతు డీరీతి సాకేతపురిని వీడి

నేడు బందుగులందరి తోడవచ్చి

నిన్ను అర్థించుచున్నాడు చిన్న వరము. 466

122 మల్లెమాల రామాయణం

అని కులగురువు వచించిన వెనువెంటనె రాము డనియె! “ప్రియసోదర! నీ కనుమాన మేల నాకడ మనమున గల వాంఛితమును మానక చెపుమా!” 467

తే, భరతు డామాట మీద దాశరఖి నరసి “అగ్రజా! నీవు రాజుగా అధివసింప దగిన సింహాసనమ్ము నే దాకుటకును అర్హుడను గాను మన్నించు” మనుచు మొక్కి. 468

తే. “నే నయోధ్యానగరమున లేనివేళ

జరుగరానట్టి ఘోరము జరిగిపోయె;

టీనబాంధవ! తప్ప దిద్దుకొనెడు

వరము దయసేయు మని వేడ వచ్చినాడ! 469 తే. _ క్రేష్ణుడవె గాక పూరుష సింహ మీవు

సార్వభౌమాధికారము సాహసమును

సత్యశీలము గలిగిన సజ్జనులకె

దక్కవలె కాన నగరికి తరలిరమ్ము. 470

అన్నా! ఇది నా ఒక్కని విన్నపమే గాదు వేద విదులును మంత్రుల్‌ పిన్నలు పెద్దలు తల్లులు

నిన్నాహ్వానింప వచ్చి నిలిచిరి కనుమా!” 471 © జాను రామచంద్ర! అందర మొక్కటై

నిన్ను వేడుకొనుట కన్షవేరు

మార్గమేది మాకు మదిలోన మెదలదు

అనియె! వేలగొంతు లాక్షణమ్మె. 472

తే అంత శ్రీరామచంద్రు డేమనునొ యనుచు

చిత్రకూటమ్మునంగల చిరుతపులులు,

పక్షులును, లేళ్ళు కుందేళ్ళు పన్షగములు

మించుతమితోడ చెవులు రిక్కించి నిలిచె. 473 తే ప్రేమధాముడైన రామున కాద్యశ్య

మంతరంగమందు అలజడులను

రేపె; కొంతసేపు లోపల చింతించి

చివర కిట్టు లనియె చిరునగవున. 474

అయోధ్యాకాండము

(Aad

“మీ కోరిక కాదనుటకు

నాకు మనం బొప్పదైన నాయనయాజ్ఞన్‌ చేకొని పాటించక, నే

నీ కాననసీమ వీడి యె ట్లరుదెంతున్‌?

తమ్ముడా! విను మన అన్న్షదమ్ములందు సత్హవర్తనమందు సంస్కారమందు ధర్మ సంరక్షణమునందు తాల్మియందు హెచ్చు తగ్గుల భేద మింతేని లేదు.

ఎన్ని చిక్కు సమస్య లెదురైన మనుజుండు అడ్డదారులవెంట నరుగరాదు

ఎన్ని ప్రలోభమ్ము లెదుట గవ్వించిన ధర్మమార్గమ్మును దష్టరాదు

ఎన్ని ఆలోచన లెదను రాపాడిన నిశ్చలత్వము జారనీయరాదు!

ఎన్ని భీకర శక్తు లేకమై దూకిన యెదురొడ్డవలెగాని బెదరరాదు కష్టములు చుట్టుముట్టిన కాలమందు సైత మాదర్శ జీవన సరణి దప్పి వక్రమార్గాన పయనించు వాని నెపుడు జగతి హర్పించ దని గదా! సత్మసూక్తి,

తులసి వనమందు గంజాయి మొలవనటుల మాన్యరఘువంశమందసమర్ధులైన

రాజు లుదయించ రన్న పురాతనోక్తి

మరల నే దెల్బ్హవలయునా? భరత నీకు!

బిడ్డలకు తండ్రియానతి వేదవాక్ళ మగును గావున నద్దాని కందరమును కట్టుబడవలె! కాన నీ పట్టువీడి

వెడలి రాజ్బాధికారము బడయుమయ్య!"

అనిన... వెంటనె జాబాలి అడ్డు తగిలి

మరణ మొందిన జనకుని మాట కొరకు రాజధర్మము విడనాడి రమణితోడ అడవులను సంచరించుట న్మాయ మగునె?

123

475

476

477

479

480

124

తల్లియును, తండ్రి, ఇల్లాలు, తనయు లనెడి అన్ని బంధాలు ప్రాణమున్నంతవరకె పండినేలను రాలిన ఫలము కొరకు

చెట్టు దుఃఖించ దంతియే జీవికూడ.

పతిని గోల్లోయి విలపించు పడతివోలె దిక్కుమొక్కును లేనట్టి దీనలీల రాజసింహాసనమ్ము నీ రాక కొరకు ఎదురుజూచుచు నున్నది యేలుకొనుము.”

అటుల జాబాలి పలికిన నాలకించి దశరథాత్మజు డిట్లనె! “తాపసేంద్ర! పరమనాస్తికుడైనట్టి వానినోట

వెలువడెడు మాట నీనోట పలుక తగునె?” అనినంతనే వసిష్టుడు

“జననాథా! రామభద్ర! జాబాలి నినున్‌ కొనిపోవలె నగరమ్మున

కను సంకల్బమ్ము తోడ నా విధి నుడివెన్‌.

అంతియే కాని నాస్తికు డతడుగాడు రఘుకుల క్షేమమే గోరు రాత్రిపవలు కాన నా జ్ఞానవృద్దుని మానసమును చిన్నబుచ్చక యోచన జేయు” మనియె. “గురువరా! మీరు నామేలు గోరి చెప్ప బోధనలు విని డెందము పులకరించి; అంతమాత్రాన జనకుని యాజ్ఞమీరి రాజ్య మేలంగ రా" నని రాము డనియె.

వెనువెంటనె కేకయసుత

తనయుండు సుమంత్రు బిలిచి దర్భాసనమున్‌

ఒనగూర్షు “మో అమాత్తా!”

అని యాదేశించె రాము డచ్చెరు వందన్‌. “అన్న సాకేతపురమున కరుగుదెంచు వరకు ప్రాయోపవేశమే ప్రాపునాకు! లక్ష్యసాధన కొరకు సర్వమును మరచి నేను గూర్ముందు నిచ్చట మౌని వోలె.”

మల్లెమాల రామాయణం

481

482

483

484

485

486

487

488

అయోధ్యాకాండము 125

క. _ అని భరతు డనిన వెంటనె మనమున వ్యాకులత నంది మాన్యచరిత్రున్‌ అనుజుని గని శ్రీరాముం డనె పలువురు మెచ్చునట్టు అనురాగమునన్‌. 489

మ. “భరతా! నీవిటుపల్మ్క పాడియగునా? పట్టాభిషిక్తుండవై ధరపాలింపగ నన్నియర్హతల నా దైవమ్ము నీకిచ్చె! నీ వరుదౌ నీ మహితావకాశమును, నీకా జన్మ భాగ్యమ్ముగా స్థిరచిత్తమ్మున స్వీకరింపు” మనియెన్‌ ధీరత్వ మేపారగన్‌. 490

అంతట జన సముదాయము

“పంతము విడనాడి రామభద్రుని యానన్‌

సంతసమున పాటింపుమి

అంతయు శుభ మగును భరత!” యని వాకొనియెన్‌. 491 తే. “ఆర్ము లందరి యుద్దేశ మదియె యైన

ఉభయ తారకమౌ నటు లొక్క మనవి;

చేసికొనియెద నగ్రజా! చిత్తగింపు"

మనుచు కరములు ముకుళించి యనియె మరల. 492

తే. “పరమ పూజ్యుడ! ఇమ్ము నీ పాదుకలను వాని నగ్రాసనమ్మున పాదుకొలి కోరి భగవంతు గొల్బు పూజారి లీల నీకు మారుగ విధులు నే నిర్వహింతు." 493

చ. వరగుణుడైన లక్ష్మణుడు వాస్తవ మారసి భాత్యభక్తిలో భరతుడు తన్ను మించెనని బందుగు లందరు మెచ్చ బల్కి తాన్‌ పరమ కృపాల వాలుడగు పావనమూర్తిని రాము జూచి, “నీ వరమర వీడి పాదుకల నగ్రజ! తమ్మున కిచ్చ టొప్పగున్‌.” 494

క. _ అని లక్ష్మణు డనినంతనె మునివరులును పౌరగణము మువ్వురు తల్లుల్‌ కొనియాడి రన్షదమ్ముల అనుపమ హృదయానురాగ మతులిత మనుచున్‌. 495

తే. రమృగుణధాముడైన శ్రీరాము డంత మారు మాట వచింపగ నోరురాక పరమపద సౌఖ్య మొనగూర్ష పాదుకలను వనము పులకింప అనుగు తమ్మున కొసంగె. 496

126

పూ

రూ

ఇహపర సుఖముల నొసగెడు సహజన్ముని పావుకోళ్ళ జంటను తలపై బహుభక్తి భరతు డిడుకొని

మిహిరాన్వయమునకు విలువ మిక్కిలి పెంచెన్‌.

యుగయుగమ్ముల నుండి యూ జగమునందు కాంచి యెరుగను నేనిట్టి ఘటన మనుచు నింగి పులకించి భరతుని నెత్తిపైన చినుకులను మంత్రజలముగా జిలుకరించె.

పాలపిట్టలు రామభద్రుండు సాకేత పురికి బోడిక నని పొంగిపోయె నెమలి కన్నెల గుంపు నీలమేఘశ్యాము దరిజేరి లలితనర్తనము సలిపె పరువాల జింకలు పరుగెత్తుకొని వచ్చి సీతామహాసాధి చెంత జేరె

అడవి జంతువులన్ని గుడిలోని భక్తుల పగిది సౌమిత్రికి ప్రణతు లిడియె

అంత నా వింతలను కనులార గాంచి పూలబాలలు తీవల పాత్తువీడి అనిలవీచుల దేలుచు అరుగుదెంచి వ్రాలె వనవాస రాముని పదములందు.

సన్షివేశము నాగి వీక్షించిన నదులహో యని పాడి నాట్యమాడె!

సన్షివేశము నరసి బళ యని

తరు లొక్కసారిగా తలల నూపె!

సన్షివేశము అత్యద్భుతమ్మని

పొంగి పర్వతపంక్తి తొంగిచూచె

సన్నివేశము అపురూప మనియెంచి లేత పచ్చికబీళ్ళ పూతబూచె

అదియె తమభాగ్య మని యెంచి వెదురు పాదలు

ఈలపాటలు కమ్మగా నాలపించె; ఒక్కటేమిటి? దిక్కులు పిక్కటిల్ల రాము గీర్తించె సకలచరాచరములు.

మల్లెమాల రామాయణం

497

498

499

500

అయోధ్యాకాండము 127

తే. “కాల మెన్ని విషమపలీక్షలను మనకు

పెట్టి ముట్టడి జేసిన పట్టుబట్టి

కథ సుఖాంత మొనర్చిన ఘనత నీది”

అనుచు రాముడు భరతుని యభినుతించె. 501 తే, అటుల నగ్రజునాశీస్లు లందుకొనిన

తమ్ము డిట్లనె “నేడు నాతలకు మించి

నట్టి భారము శిరమున బెట్టినావు

రామ! తెల్బుము రాజధర్మములు కొన్ని 502 ఆ. తల్లిచాటుబిడ్డ తండ్రిని బతిమాలు

కొనిన రీతి వేడుకొనిన ననుజు

నాదరమున జాచి ఆలింగనము జేసి

రాము డిటుల దెలిపె! రాజనీతి. 503

తే. “ప్రజల సుఖశాంతులే రాజ్యపాలనమున

ప్రథమ కర్తవ్యమను సూక్తి ప్రభు వెరింగి

అహరహమ్మును నా 'యాశయమ్ము దెసగ

పయన మొనరించి సత్కీర్తి బడయనవలయు. 504 తే. ధరణి పతియెంత పాలనదక్షు డైన

విబుధులగు రాజనీతి కోవిదులతోడ

కలసి చర్చింప కేరాచకార్య మైన

ఏకపక్షముగా నిర్ణయింప దగదు. 505 తే అన్యకాంతల నాశించునట్టి పతిని

భార్య యేరీతి ద్వేషభావమున జూచు

నటులె ఆచార విభ్రష్ణు డైన ప్రభుని

ప్రజలు దుర్షీతి పరునిగా పరిగణింత్రు. 506

తే విశ్వమందున రాజ్యము వీరభోజ్య మనెడు సూక్తిని మన్నీడు అప్రమత్తు డగుచు పాటించి శత్రు సంహారమునకు వలయు సైనికశక్తితో నిలువవలయు. 507

చ. భుజబలమున్న యోధులను బుద్ధిబలమ్ముగలట్టి మంత్రులన్‌ కుజనులు పన్ను వ్యూహముల గుట్టునెరింగెడు గూఢచారులన్‌ స్వజనులుగా దలంచి జనపాలుడు వారల సంప్రదించుచున్‌ విజయపథమ్ము నారసి వివేకముతో ధర నేలగావలెన్‌.” 508

128

ప్రభుత సక్రమముగ సాగవలయునన్న పన్మువేయక తప్పదు ప్రజలపైన

కాని పన్ను మితిలేని దైన యెడల ఎదురు దిరిగెద రందరు - అదను జూచి.

హస్తకళలపట్ల అధికారము జూపి హితవుగోరి ప్రోశ్టహింపవలయు కళలు పేదవైన కాంతి నశించును దేశ సంస్కృతియును నాశ మగును.

ప్రజకు మానసికానంద పరిమళమును పంచిపెట్టెడు వైవిధ్యభరితమైన న్యత్యగాంధర్వ సరససాహిత్యములకు ప్రభువు నీరాజనమ్ములు పట్ట వలయు. ప్రొద్దువాలిన వృద్దు లే ప్రొద్దుగూడ ముద్దుముచ్చటలను గోలుపోవరాదు కాన తగురీతి వసతులు గలుగజేసి వారి దీవన లందుకోవలయు రాజు.

భావిపొరులైన బాలబాలికలను

బుద్ధి గరపి తీర్చిదిద్దునట్టి

గురుకులములు పెట్టి పరమోన్నతములైన నీతినియమములను నేర్చ్ణవలయు.

జనుల ఆరోగ్యమే దేశమునకు బలము ప్రజలు బలహీను లైనచో బక్కచిక్కు దేశమటుగాన వారికి దివ్యమైన

వైద్య మాహార మందించవలయు విభుడు.

తప్పజేసినవానికి దండనయును మంచిజేసిన వానికి మన్న్షనయును జరిగి తీరగవలెనన్ష్న ధర్మ మెరిగి

పాలనము సేయవలయును ప్రభువు సతము.

ప్రజల బాధల నేలిక ప్రతిదినమ్ము అమలదరహాసవదనుడై ఆలకించి మంత్రివరులను బిలిచి సమస్ఫ్యలన్షి దెలిపి తత్‌క్షణమే వాని దీర్ధవలయు.”

మల్లెమాల రామాయణం

509

510

511

512

513

514

515

516

అయోధ్యాకాండము 129

చం. అని యిటు రాజధర్మముల నందరు మెచ్చగ దెల్చి “తమ్ముడా!

వనమును వీడి నేడె పరివారముతోడ నయోధథ్యకేగి నీ

వనుపమలీల తండ్రి మహితాశయ మూతగ కోసలావనిన్‌

ఘనముగ నేలి సద్యశము గాంచు” మనెన్‌ రఘురాము డంతటన్‌.

517

తే. “అన్న! వినుమన్న! వనవాస మైన పిదప

వదినయును నీవు వేగ రావలయునన్న

తడవుసేసిన దక్కడీ తమ్ము” డనుచు

వినయమేపార భరతుడు వేడుకొనియె. 518 తే. అంత రాముడు భరతున కభయ మొసగి

మాత్యమూర్తుల కడకేగి మౌనముగనె

కన్ను లరమోడ్డి మొక్కి గద్గ్దదిక యెసగ

సెలవు నాకని పలికి యా చెంతనున్న 519 తే. గురువరేణ్యుల మంత్రుల పురజనముల

నరసి కరములు ముకుళించి “భరతు మీకు

నప్పగించితి నిక నేను తప్పకొందు”

ననుచు నరిగెను శ్రీరాము డచటినుండి. 520

తే. భరతు డంతట శ్రీరామపాదుకలను భక్తి నర్షించుటను గని భద్రగజము ముందు కరుదెంచి తలవంచి మోకరిల్లె చిత్రకూటము కన్నులు చెమ్మగిల్ల. 521

.. పావుకోళ్ళ మోయు భాగ్యము నా కిడు మనిన రీతి కన్న లార్దకుండ జూచుచున్న కరిని చోద్యమ్ముగా జూచి భరతు డన్ని మరచి పరవశించి. 522

తే. భక్తిలో నన్ను మించెను భద్రగజము అనుచు ముమ్మారు తా ప్రదక్షిణము సలిపి పాదుకల జంట నంబారి పైన నిలిపి సపరివారముగ నతండు సాగిపోయె. 523

తే భరతు డారీతి మందిమార్భలముతోడ బయలుదేరిన మంగళవార్త దెలిసి దారిపొడవున జయజయధ్వానములను సలిపి సంబరపడినవి జనపదములు. 524

130 మల్లెమాల రామాయణం

ఉ. ముందు వసిష్థమౌని, బుధముఖ్యులు, మంత్రులు, మువ్వురమ్మలున్‌ స్మందన బృందమెక్కి చన సైన్మ సమూహము, వెంటరాగ, వా రందరి మధ్య నా యినకులాంబుధథి సోముడు పావుకోళ్ళతో సుందరమందహాసరుచి శోభితుడై చనుచుండ నంతలో. 525 ఆ. ముందు గానుపించె ముని భరద్వాజుని అతులశాంతి నిలయ మాశ్రమమ్ము; అంద రచటి కేగి ఆతివ్యమును గొని అవధిలేని తృప్తి నందినారు. 526

అంత వసిష్టుడు జరిగిన

దంతయు వివరముగ దెలిపె నది విని మునియున్‌

సంతసము జెంది భరతుని

పంతమ్మును భాత్యభక్తి ప్రస్తుతి జేసెన్‌. 527 క. మునిచంద్రుండటు మెచ్చిన

వెనువెంటనె నాకజాతివెలదుల కీడౌ

వనకన్యావళి రాఘవు

ఘనతను రసవత్తరముగ గానముజేసెన్‌. 528

చ. _ శిలలు ద్రవించి పారునటు చిత్తరువుల్‌ వలె మంత్రముగ్గులై పలువురు బాగు బాగు సెహబాసని మెచ్చెడు రీతి తేనియల్‌ జిలికిన మాడ్కి సాగిన విశిష్ట సుధామధురైకగానమన్‌ జలనిధి నోలలాడె రఘుసత్తము డెంతొ ప్రమోదచిత్తుడై. 529

తే అంతలో నొక్క పసికపియరుగుదెంచి

అచ్చముగ రాము పోలిక నలరుచున్న

ముగ్గమోహన సుందరు ముందు నిలిచి

ముసిముసిగ నవ్వి బక చిన్ని పువ్వునిచ్చె. 530 ©. బుల్లిపిల్లకోతి బుడిబుడి నడకతో

వచ్చి కైక తనయు నిచ్చమెచ్చి

పూవునిడిన ఘటన పులకింపజేసెను

అపరనాకమైన యాశ్రమమును. 531

తే. భరతు డాపూలబాలను వానరమును మౌనివరులను తల్లుల మార్చి మార్చి చూచి యోచించి మిక్కిలి సునిశితముగ భక్తిభావము జాల్వార పలికెనిట్లు. 532

అయోధ్యాకాండము 131

ఉ. వానర వళ్ల “నన్ను రఘువంశ సుధాంబుధి చంద్రు రాముగా మానసమందు నెంచె నిది మాటలకందని ప్రేమ; కాని, కానుక కే ననర్హుడను; కావున నిశ్చలభక్తి నగ్రజున్‌ ధ్మానముజేసి పాదుకల కరణ జేసెద నీ ప్రసూనమున్‌.” 533

ఆ. అనుచుపైకి లేచి అతి వినమ్రతతోడ

అన్న పావుకోళ్ళ కంజలించి

వూవు నచటబెట్టి పూజించె సుమదాయి

చిన్ని కనులు మురిసి చెమ్మగిల్ల. 534 అది జూచి భరద్వాజుడు

ముదమున ప్రేమానురాగములు జాల్వారన్‌

సదసద్వివేకవంతుడు

విదితయశుండైన భరతు విజ్ఞిత నెంచెన్‌. 535 ఉ. “చూచితివా! వసిష్ట! కడు చోద్యముగా నొక కోతి యప్పడే

పూచిన వపుష్టబాలికను పూజ్యపదుం డని బుద్ధినెంచి, యో

రాచకుమారుడైన రఘురాముని తమ్మున కిచ్చై, గాని, తా

నాచిరుకానుకన్‌ భరతు డగ్రజు పూజ కొసంగె భక్తితో. 536 ఆ. ముందు ముందు జనము లందించుకానుక

లన్న పాదుకలకె అర్దణమ్ము

జేతు ననుచు మనకు చెప్పక చెప్పిన

భరతు గనిన కైక భవ్యచరిత.” 537

క, అనిన మునీంద్రుని పలుకులు విని యానందమ్ము మదిని వెల్లివిరియగా చని కైక వందన మ్మిడి తనయుని దీవింపు డనియె తాపసవరుతో. 538

ఆ. తల్లి ననుసరించి తాను భరద్వాజు పదములంటి మొక్కి భరతు డపుడు నన్ను కనికరించి నా బాధ్యతలు దెల్బు డనుచు వేడుకొనియె నా యతీంద్రు. 539

తే మునివతంసుడు భరతుని మోమునరసి “చూడు రామానుడా! నీవు సూర్యవంశ మందు బుట్టిన పుణ్యుడ వందువలన మానవత నీకు పుట్టుకతోనె యబై. 540

132 మల్లెమాల రామాయణం

చ. వయసున పిన్ష్నవయ్యు ననవద్యగుణమ్ముల మిన్నవీవు, నీ

నియమ నిబద్ధభక్తి గణనీయము రామునిపట్ల, నీకదే

జయ మొనగూర్శుగాననిక జా గొనరింప కయోథ్యకేగి, ని

రయముగ ధర్మబద్ధముగ పాలన సేయుము కోసలావనిన్‌. 541 క. ఉన్నది పదునాల్లేడులె

యన్నది గుర్తుంచుకొనుచు, నా సమయము, నీ

కన్ష యొసంగిన వరమని

పున్నెము పండించుకొనుము భూమీశుడుగా.” 542 అనిన మునీంద్రుని పలుకులు

తనకు శిరోధార్యములుగ తలపోయుచు, పా

వన చరితుడు భరతుం డపు

డనుచరులను గూడి పయన మాయెను పురికిన్‌. 543

క. భరతుని పరివార మృటు

లరిగెడు కోలాహలమ్ము లాకస మంటెన్‌

సురలోకమంతటా ధ్వని

పరిమళమై వ్యాప్తి జెందె బహుముఖములుగా. 544 తే స్వర్గ్లలోకమునందున్న పంక్తిరథుడు

కర్ణపేయమ్ముగా దోచు కలకలమును

పరిచితమ్రైన రవళిగా పరిగణించి

తొందరించెడు మనసుతో తొంగిచూచి. 545

తే “స్వీయ ధర్మము మరచి నే జేసినట్టి

తప్ప సరిదిద్ది నాయాత్మ తాప మణచి

నట్టి సుతులార! మీకు దీర్ణాయురస్తు!”

అనుచు మనసార దీవన అందజేసి. 546 ఆ. _సాగిపోవుచున్న సాకేతపురి బృంద

మడ్డుదగిలినట్టి యమున దరిని

కొంతసేదదీరి క్రొత్త ఉత్గాహము

నిర్మలోదకమున నింపుకొనియె. 547 ఉ. అచ్చటనున్న చెంచు ప్రజలందరు వారల జూచి మెచ్చి, మా

ముచ్చటదీర్ద వచ్చితిరి, మొక్కులు గైకొను డయ్యలార! యం

చిచ్చిరి కందమూలముల నింతకు మించి మరేమి మీకు, మే

మిచ్చుకొనంగ జాలమని యెొల్లరు సంతస మందునట్లుగా. 548

అయోధ్యాకాండము

ఆ. ప్రేమతోడనిచ్చు పేలాలు సైతము అమృ్యతరస సమాన మనితలంచి అందరారగించి రాకందమూలాలు చిందు లాడిరపుడు చెంచుప్రజలు.

©. అంతలోనె నావ లన్ని సిద్ధ మటంచు పలికె గుహుడు భక్తిభావ మెనయ భరతు డతని మెచ్చి పలుమార్లు కొనియాడి పాదుకలను దాల్చి పయన మాయె.

అంతట వారందరు గుహు నెంతయు నుతియించి పడవ లెక్కిరి బెస్తల్‌ సంతసమున హైలెస్తా యెంతటి భాగ్యమ్ము కలిగె నీదిన మనుచున్‌. తే. అటుల నావికు లందరు ఆడిపాడి రంగురంగుల జెండా లలంకరించి యున్న నావల గూర్షున్న యోధతతికి కరములను మోడి కదలిరి గట్టువిడిచి.

క్ర సాగెడు పడవల బారును మూగగ దిలకించి మురిసి పోయిన మీనా లూగెడు అలలం దేలుచు స్వాగత సత్మారములకు సందడి బెంచెన్‌.

ఆ. వందలాది పడవ లందాల యమునపై బారుదీరిపోవు తీరు నరసి చెంతనున్న పాన్షచెట్లు శిరము లూపి అలలమీద జల్లై నలరుగములు.

ఆ. _ పూలు నీటిపైన దేలియాడు+ు వచ్చి అతిథివరుల నెల్ల నలర జేసె పెక్కుమాటలేల నిక్క మా యానంద మనుభవైక వేద్య మనుట లెస

తే. అటుల జరిగిన పడవల యాత్ర ముగిసి అంద రాయొదడ్డు జేరినా రంత గుహుడు “రండి దొరలార! మీరంత రాత్రి విడిది శృంగి బేరపురమ్మున జేతు" రనియె.

133

549

550

551

552

553

554

555

556

134

అంద రచటి కేగి రాత్రి గుహుడిచ్చి నట్టి విందు తృప్తి నారగించి పయనమైరి మరల ప్రత్యూష సమయాన శీఘ్రముగ నయోధ్య జేరదలచి.

సకల బంధుగణము శకటాలు గుజ్టాలు మదగజములు భటులు మంత్రివరులు మునులు, బుధులు, హితులు, మువ్వురు తల్లులు చనిరి భరతువెంట సంతసమున. వాసవుడు సైత మబ్బురపడు విధాన అఖిల జనరంజకమ్మౌచు నలరులీల చెకచెకన్‌ సాగి రాముపాదుకలయాత్ర చేరె సాకేతపురి పొలిమేర దరికి.

భరతు డంతట నగరికి పరుగువెట్టి తోరణద్వారముంజేరి పారజూచి చిత్త విభ్రమ మంది నిశ్చేష్టు డాయె అతని సంతోష మంతయు నావిరాయె. బాలభానుడు లేని ప్రాగ్టిశ చందాన సలిల బిందువులేని కొలను పగిది విచ్ణ్చిన్నతంత్రియౌ వీణవిధమ్మున నుదుట కుంకుమలేని ముదిత కరణి మోడు వారిన జాజిపూదోట పోలిక నేలకొరిగిన రసాలమటుల

దేవుడు లేనట్టి దేవాలయములీల అగ్ని కాహుతియైన అడవఏవోలె శీతకిరణుడు లేని నిశీఖిని వలె పెన్షిధిని గోలుపోయిన పేదభంగి కానుపించెడి రాజధాని నగరి

కైక కొమరుని కన్టీటి కడలి ముంచె.

కొంత తడవట్లు చింతించి అంతలోనె తేరుకొని తల్లులను జేరి వారినెల్ల అంతిపురమున దిగబెట్టి అంతరంగ

మందు యోచించి యొక నిర్ణయమ్ము నంది.

మల్లెమాల రామాయణం

557

558

559

560

561

562

అయోధ్యాకాండము

[2

కులగురువైన వసిష్టుని

పలు విధముల బ్రస్తుతించి “పావన చరితా!

తెలిపెద నొక విన్నపమును

అలుగక కరుణింపు” డంచు నభ్యర్థించెన్‌.

“ప్రేమ మీర గన్న ప్రియజనకుండును కన్నతండ్రి వంటి అనలేని

అయోధ్యయందు నొక్కక్షణమైన గుండె దిటవుతోడ నుండజాల. నందనోద్య్మానాల పందె మందున గెల్మ పూదోట లన్నియు బోసివోయె న్యత్సగానాదుల నిలయమై విలసిల్లు నర్తనశాలలు నాశమాయె దేదీష్పమానమౌ దివ్యకాంతులు జిమ్ము ఘనసౌధములను చీకటులు ముసిరె ముత్తైదువలు దీర్చు ముత్యాలముగ్గుల ముంగిళ్ళ మసిబారి రంగువెలసె నిరతమును వేద ఘోషల పరవశించు గురుకులమ్ముల నొకచదువరియు లేక బోధనాచార్యులును లేక మూగవోయి శిథిల దేవాలయమ్ములై వ్యధ మిగిలై.

కాన శ్రీరామచంద్రుడు కాననమును వదలి సీతమ్మతో కూడి వచ్చువరకు పాదుకలు నందిగ్రామాన పాదుకొల్చి నిత్స మటనుండి పాలన నిర్వహింతు. అడవులందునున్న అన్న పరుండెడు నేలపరుపె నాకు పూలపాన్ము వారివలెనె నేను వాన ప్రస్థాశ్రమ ధర్మ మనుసరింతు తపసివోలె.”

“భరతా! నీ సంకల్బము

పరమ ముదావహము సూర్యవంశము నీచే

తరియించె” నని వసిష్టుడు

పరివారము మెచ్చు నటుల ప్రస్తుతి జేసెన్‌.

135

563

564

565

566

567

568

136

భరతు డంతట రథమెక్కి పాదుకలను శిరమునం జేర్షి ప్రజల జేజేల నడుమ కదలె నుతాహమున నంది గ్రామమునకు గణన కెక్కిన అనుచరగణముతోడ.

నంది గ్రామము భరతుని బ్యృందమునకు

కనులు మిరుమిట్లు గొలుపు స్వాగత మొసంగె;

అస్తు - శ్రీరస్తు - లోకకల్ళాణమనస్న్తు!

అను నినాదము లంబరమంట మ్రైోగె. అదిగదిగొ మొదలైన దానందహేల! అమరేంద్రుడే యీర్మనందెడిలీల!

రథము దిగినాడదే రాజు భరతుండు! రాగరంజితమాయె! నారాముదండు! గుడిగంట శుభమస్తు పలికి దీవించె! కోటిగొంతుల తోడ ఊరు నినదించె! వివిధ మంగళవాడద్యములు మారుమైోగె! విజయదుందుభులతో ఉత్సవము సాగె! ఇరువైపులను బారుదీరి జవరాండ్రు! మురిసి విసిరిన విరులు ద్రొక్కె పరవళ్ళు! రామానుజుం డపుడు వేయు ప్రతి అడుగు! రాజశాసనములకు ముత్యాల గొడుగు! మున్షెన్షడెరుగనీ మహోత్సవము! కన్నులార్దక చూచె రాజమందిరము స్వాగతము శ్రీరాము పదముద్రికలకు స్వాగతము ప్రభువు చిన్నారి భరతునకు అని యాడిపాడినా రంతిపురి జనులు అదిజూచి ప్రతివార లైనారు మునులు కులగురువు ననుమతిని గొని కైక సుతుడు కోదండరాముని పాదుకల నపుడు నవరత్న ఖచితమౌ సింహాసనమున సవినయముగా నుంచి తన మానసమున భక్తి శ్రద్ధలతోడ నన్న నర్థించి

భార మంతయు నీదె యనుచు ప్రార్థించె బళిబకేయని మెచ్చి బ్రాహ్మణోత్తములు పరియించి నారంత పురుష నూక్తమును.

మల్గెమాల రామాయణం

569

570

571

అయోధ్యాకాండము 137

ఆ. _ వేదఘోషనడుమ పాదుకాపట్టాభి షేక మపవుడు జరిగె! నాకలోక వాసులెల్ల మెచ్చి సేసలు పైజరల్లి

బహుముఖముల శుభము పలికి రపుడు. 572 శ్రీరామ పాదుకా పట్టాభిషేకం! రామాయణానికే తలమానికం! 573

©. పాదుకలకు తాను ప్రతినిధిగా నిల్లి భరతు డచట రాజ్యపాలనమ్ము నెరపసాగె నన్న తిరిగి వచ్చెడి రోజు పట్టువిడక లెక్కబెట్టుకొనుచు. 574

క. తనయాశయమ్ము మేరకు ఘనుడగు భరతుండు నంది గ్రామమునందున్‌ జనహితముగ పరిపాలన మొనరించుట నెరిగి రాము డూరట చెందెన్‌. 575

క్ర మునిజనవంద్యుడు రాముం డనుగుంజెలితోడ మరియు ననుజన్మునితో వనవాసపుటనుభూతుల ననునిమిష మ్మారగించి అలరుచునుండెన్‌. 576

క. ఇచ్చట మన ముండినచో వచ్చెద రెల్లపు శయోధ్యవాసులుచూడన్‌ మచ్చిక వారలు నుడివెడు ముచ్చటలను వినిన దీక్ష మొదలంట చెడున్‌. 577

ఆ. మరలమీ రయోధ్య కరుదెంచ వలెనని వారలెల్ల మనల గోరవచ్చు; కాన నిప్ప డత్రి మౌనివతంసుని ఆశ్రమమ్ముజేర నరుగుటొప్ప. 578

క. అని శ్రీరఘురాముడు తెలి పిన సీతయు లక్ష్మణుండు వినయమ్మెనయన్‌ చనియెద మందర మటులే యని కదలిరి రామువెంట ఆనందముతో. 579

ఆ. అటుల మువ్వు రరిగి అత్రిమహాముని ఆశ్రమమ్ముజేరి మహాత్ము పాద పద్మములకు ప్రణమిల్లి రది జూచి ఆశ్రమమ్ము పొందె నతులముదము. 580

138

మ్ల

మల్లెమాల రామాయణం

అంత కోదండరాముడు సంతసమున తాపసోత్తమ! “మీ దివ్య దర్శనమున

వాసి పెరిగెను మా వనవాసమునకు అందజేయుడు దయయుంచి ఆశిషములు.”

అని కరము మోడ్డి వేడిన

ముని తిలకుడు రాము శిరము ముద్దాడి “ఘనా ఘనసుందర! జనవందిత!

నిను గను భాగ్యమ్ము నాకు నేటికి గలిగెన్‌.

మీ మువ్వురి మూలమ్మున

మహి దుర్మార్గములకు నిక తెగవాలున్‌ సేమము గలుగును మునులకు

కామిత ఫలసిద్దు లెల్ల కలుగును ప్రజకున్‌.”

అని పలికి జానకీసతి

కనసూయనుజూపి యనియె నా తాపసి, “దీ వనలందు కొనుము తల్లీ!

మునుముందవి నీకు మిగుల మోదము గూర్షున్‌.”

కన్న్షతండ్రిలీల కడుప్రేమతో తన్ను ఆదరించి పలికినట్టి మౌని

పలుకు మేర కపుడె పతి యనుమతి గొని ఆమె కడకు జనియె నవనిజాత.

బ్రహ్మ విష్ణు శివుల బాలుర గావించి ఉయ్యాల లూపిన యువిదమిన్న! మువ్వురమ్మల నెత్తి మొట్టి గర్వ మడంచి ప్రణతులు గైకొన్ష వర గుణాడ్డ!

ముని నారదుని కోర్కె నినుప గుగ్గిళ్ళను వండి వడ్డించిన పరమసాధి! ఘనతపశ్శక్తితో గంగను పొంగించి కరువును బాపిన కల్బవల్లి!

పండువెన్నెల కెరటాల పిండువోలె

పండి యెండిన కురులతో పరిఢవిల్లు భవ్యచారిత్ర! అనసూయ వదన మరసి పాదముల మ్రోల సాష్టాంగపడియె సీత.

581

582

583

584

585

586

అయోధ్యాకాండము

తే. మహాదేవి జానకి ననునయించి “ముగ్ధ్గమోహనమైన నీ మోమునందు కొలువుదీరినదమ్మ! వైకుంఠ మనియె!”

హృదయ ముప్ప్తాంగి వైదేహి యిట్టు లనియె.

ఆ. “అమ్మ లేనిదాన అడవికి స్వామితో జేరి వచ్చినట్టి చిన్నదాన ఇచట సంభవించు నిడుమల నవలీల నెదురు కొనెడు వరము నీయుమమ్మ!”

తే. అనిన భూజాత నారసి అత్రిమౌని కూర్మి అర్థాంగి అనసూయ పేర్మిమీర “అమ్మలే దనుమాట నీవనకు మమ్మ! అమ్మలకు అమ్మ ధరణి మీ అమ్మగాదె.

తే. కష్టముల నీడనైనను కాంచి యెరుగ నట్టిదానవు! మిధిలేశు అనుగు సుతవు! భోగభాగ్యాలు విడనాడి యోగిని వలె అడవులకు భర్త వెంబడి నడచినావు.

క. పతి తోడిదె లోకమ్మని జెతబాయక సేవజేయు సంకల్బముతో వ్రతదీక్షను గొనిన పతి వ్రతగా నిను విశ్వమంత ప్రస్తుతి జేయున్‌.”

తే. అనిన వెంటనె సీత “అట్లనకు మమ్మ! తాళిద్రెంచిన కాలుని తరిమిపట్టి పసుపుకుంకుమ వరముగా బడసినట్టి సాధి సావిత్రిలేదె? యీ జగమునందు.

తే. అంతవర కెందుకమ్మ! యీ అవనిలోన వరనతీత్వమునందు నీ ప్రక్క నిలువ గలుగు నిల్లాలి నెవరిని గాంచమమ్మ! అమ్మ! నీముందు నేనొక అణువునమ్మ!”

తే. అనిన శ్రీరామునిల్లాలి వినయమునకు ఆమె యౌన్న్షత్మ్యమునకు తా నబ్బురపడి తపస్విని గోముగా అడిగె నిటుల “ధరణిజా! తెల్బునీ స్వయంవరము గాథ.

139

587

588

589

590

591

592

593

594

140

ep

ఆనాటి వింతకథలను

ఈనాటికి జెప్పచుందు రెల్లరు, కానీ నీనోట విన దలంచితి

ఈనాచిరుకోర్కె దీర్ణు మెంతయు ప్రీతిన్‌.” అనుచు బుజ్జగించి అడిగినంతనె సీత మోమునందు సిగ్గు మొగ్గదొడిగె;

అయిన నాటి తీపి అనుభూతులను గుర్తు జేసి కొనుచు నిట్లు చెప్పదొడగె.

“మరచిపోదమన్న మరపురాదమ్మ! నా వ్రాతమార్చి నేను రామభద్రు పాణినందు కొనెడు భాగ్య మొసంగిన నాటి మురిపె మెన్న్షినాళ్ళకైన.

ఎవరు ముక్కంటి చాపమ్ము నెక్కు వెట్టి నిలిచి గెలుతురొ? వానినే నీరజాక్షి సీత వరియించు నని తండ్రి చెప్పినట్టి మాట జ్ఞప్తికి వచ్చి నా మనసు చెదిరె.

అంత చేతులు జోడించి హరిహరాది దేవతల నెల్ల వేడితి దీనవోలె; ధర్మనిరతుడె శ్రీకంఠరుధనువు వంచు

వరము దయచేసి నన్ను కాపాడు డనుచు.

వెంటనే నేటి నా స్వామి పెళ్ళు మనుచు పరమశివుచాప మవలీల విరిచె నన్న శ్రవణహితమైన వార్తను సఖి యొకర్తె మోసికొని వచ్చి ప్రేమతో ముందునిలిపె.

జనకు డశచ్చెరువంద ధనువు ఛేదించిన రాకుమారుని పేరు రాము డనుచు అతని నేత్రద్వయ మృప్పడే విరిసిన రమ్మరాజీవ పత్రమ్ము లనుచు

ఆతని ముద్దుమో మన్ని వేళలయందు వెలుగు లీనెడు చంద్రబింబ మనుచు అతని వక్షః స్థల మృతిలోక సౌందర్య మునకు కాణాచియె దనరు ననుచు

మల్లెమాల రామాయణం

595

596

597

598

599

600

అయోధథ్యాకాండము

(U2)

ఆచితూచి యాత డాడెడు మాటలు కండచక్కెర వలె కమ్మ ననుచు

చెప్పి చెప్పి నన్ను చెలికత్తె మధురోహ లందు దేలియాడు నటు లొనర్చెై పున్నమ జాబిల్లి పుడమికి దిగివచ్చి పులకింత లెదపైన చిలికినట్లు శక్రకోదండము సారెసారెకు వంగి చెవిలోన గుసగుసల్‌ చెప్పినట్లు తెలిమబ్బు కన్షియల్‌ తేరులో అరుదెంచి తుంపురుల్‌ నిలువెల్ల తురిమినట్లు మండువేసవిలోన మంచి గంధపు వాన కుండపోతగ పైన కురిసినట్లు మానసమునందు అవ్యక్తమధురమైన ప్రణయ భావతరంగముల్‌ పర్వు లెత్తె ఆగలేనని వరమాల వేగిరముగ రామభద్రుని కంఠ మలంకరించె.

అంత రఘుకుల తిలకు డావంత యేని తడవుసేయక సభ కంటపడని లీల కథలు సుధలొల్మునటు జెప్పుకనులతోనె

యెరుగ జేసెను తనకు నే నిష్ట మనుచు.

అపుడు నేను స్వర్గ మడుగకయే వచ్చి ముందువాలినట్లు మురిసిపోతి; గాధిసూతికూడ కల్ళాణమస్తని దీవెనలను మాకు దెలియజేసి.”

తన్ను తాను మరచి తన్మయత్వమ్ముతో సీత గతమునంత జెప్పచున్న

సరణి నరసి అత్రిసతి సంతస మృంది నర్మగర్ణితముగ నవ్వుకొనియె. అది గమనించిన జానకి

“ముద మతిశయమంది నాటి ముచ్చట లెల్లన్‌

వదరితి నతిగా మాతా!

మదిలో నీ సుతగ నెంచి మన్షింపు" మనెన్‌.

141

601

602

603

604

605

606

142

“లేదు జానకి! నీ తప్ప లేశమైన ఆపుకోలేక, నీవు నే నడుగగానె

క్రొత్త సంగతు లెన్షియో కుష్పవోసి ముసలిమనసుకు మధురిమ బూసినావు. నీకు పెండ్లికాన్మ నే నిపు డిచ్చెద” ననుచు మౌని పత్ని ఆదరమున పట్టుచీర కొన్ని పసిడి ఆభరణాలు

మేలి లేపనములు పూలు నొసగి. “పరిమళమ్ము సెడవు వాడవీ సుమములు చీర నలిగిపోదు చిరిగిపోదు

కాంతి తరుగ వెపుడు కనకభూషణములు లేపనములు క్రొత్త రూపు నొసగు. ముందు పట్టుచీర ముచ్చటగా గట్టి కురులు దువ్వి సిగను విరులు దురిమి అన్ని నగలు మేని కందమ్ముగా దాల్చి

నీవు కనులముందు నిలువు మమ్మ.”

అనియె మునిపత్తి సీత మహాప్రసాద మనుచు వెంటనె ఆమె వాకొనిన రీతి

మొత్తముగ నన్ని ధరియించి మురిపె మొలుక

ముగ్గమోహనరూపాన ముందు నిలిణె. అంత మునిపత్ని కనురెప్ట లార్బకుండ అవనిజను జూచి నుదురు ముద్దాడియాడి

“చూడు జానకి! యిపుడు నీ సోయగమును పతికి జూపింపు మాతడు పరవశించు.”

అనుచు అనసూయ దెలిపిన అవనితనయ ఆమె పాదములకు మొక్కి అనుమతిగొని

ముసిముసిగ నవ్వుకొనుచు తా ముద మెలర్డ

అరిగె వేవేగ తన మనోహరుని కడకు.

విరబూసిన అందముతో

అరమరలకు తావులేని ఆనందముతో పురివిష్టిన పరువము వలె

అరుదెంచిన సీత రాము నబ్బరపరచెన్‌.

మల్లెమాల రామాయణం

607

608

609

610

6:1

612

613

614

అయోధ్యాకాండము 143

తే. క్రొత్తకళ ఉట్టిపడుచున్న కూర్మిసతిని గాంచి వనవాసరాముడా క్షణమునందు రాగరంజిత కల్మాణ రాము డాయె సీత నునుసిగ్గుతో పెండ్లికూతు రాయె. 615

క. ఆరాతి రొకరి కొకరుగ

వారిద్దరు గడపి తెల్లవారిన పిదపన్‌

భూరితపోధను లిద్దరి

కూరిమి దీవెనల నందుకొని రతి భక్తిన్‌. 616 తే. అంత ఆశ్రమ వాసుల అండవీడి

రామభద్రుడు సీతయు లక్ష్మణుడును

గణ్యమైనట్టి దండకారణ్యమునకు

సాగిపోయిరి మిక్కిలి సంతసమున. 617

అయోధ్యాకాండము సమాప్తము

kkk

144

లై

కొండనెత్తమ్ములనుండి క్రిందికి దూకి పరువెత్తు సెలయేళ్ళ భంగిమలను

చివురు జొంపములతో చిన్ని పుష్టాలతో రాజిల్లు పొదరిండ్ల రాజసమును

ఫల వ్యక్షముల మీద కిలకిలారవములు జేయు పక్షుల గమి సోయగమును

పలు వర్ణముల పింఛములు విష్టి హొయలుగా నర్తించు నెమళుల నాట్టములను

చెవుల పిల్లుల బుడి బుడి చెలువములను కాంచి భూలోక నాకమీ కాననమ్ము అనుచు మువ్వురు ముఛ్రటలాడుకొనుచు అలస టెరుగక పయనించి రతిముదమున.

అటుల కొంత దూర మరిగిన పిమ్మట వారి రాక నెరిగి చేరవచ్చి

మునులు కొంతమంది మునివేషధారియౌ రాము నరసి యిట్టు లనిరి భక్తి.

“అవిగో! కనుపించెడు

ప్రవిమల బుష్మాశ్రమములు పలు దినములుగా భవదీయ దర్శనార్థము

అవనీశా! వేచియున్న వత్యుత్గుకతన్‌.

మహానుభావ! ఒకసారి మీ మువ్వు రరుగుదెంచి తాపసాశ్రమముల పావనమ్ము చేయ ప్రార్థించుచున్నాము దండి మనసుతోడ రండు! రండు.”

అని వారు రాజపుత్రుని

కొనియాడుచు వేడుకొనిన కూరిమితోడన్‌ చనె, రామభద్రు డవనిజ

అనుజన్ముడు వెంబడింప ఆశ్రమములకున్‌.

మల్లెమాల రామాయణం

అరణ్యకాండము

ప్రై

అలికి ముగ్గులువెట్టి అపురూపముగ తీర్చి దిద్దిన ముంగిళ్ళ తీరు నరసి

ఆవునేయిని గ్రోలి అగ్షికుండమ్ములు ఎగజిమ్ము పొగల సోయగము నరసి పలుచోట్ల కంచెలపై ఆరవేసిన

కావిబట్టల మేలిగరిమ నరసి

ఆగమవేత్తలు ఆపక పరఠియించు వేదనాదమ్ముల విభవ మరసి

మునుల ఆచార - వ్యృవహారములకు మురిసి కనియు వినియును ఎరుగమీ కర్మకాండ లనుచు తమలోన చర్చించుకొనుచు నడచి మువ్వు రాశ్రమ సముదాయములకు జనిరి.

వారి రాకను ఆశ్రమవాసు లెల్ల జయజయధ్వానములతోడ స్వాగతించి అర్హ్యపాద్య్మాది విధులెల్ల నాచరించి ముక్త కంఠాన బలికిరి మొక్కు లిడుచు.

“లలిత లావణ్య యౌవన కలితులార! మీర లీనాడు మునివేషధారులయ్యు సంభ్రమము గొల్బు దివ్యతేజస్సుతోడ వెలుగుచున్నారు మా పాలివేల్బులటుల. కందమూలమ్ములే మాకు కాననముల పొట్ట నింపెడు మృష్టాన్న భోజనములు; అవియె మీరును తృప్తిగా ఆరగించి మమ్ము ధన్యుల జేయుడో మాన్యులార!”

అనుచు మునులును మునిపత్ము లాదరమున పలికి బహువిధ పరిపక్వ ఫల చయమ్ము పెక్కు చిరుతిండ్లు సమకూర్ణి ప్రియమెలర్ధ కొసరి వడ్డించి ఆతిథ్య మొసగినారు.

బుషుల హృదయములును రుచులను జతగూడి

అతిథఖివరుల మతుల నలరజేసె అంత ఇనకులేశు డాశ్రమ వాసుల నభినుతించి కదలె నంతలోనేె.

145

10

146

సా

pe

గగనవీథుల స్వేఛ్చగా విహరించెడు

పక్కి గుంపులు గూళ్ళ నక్కసాగె

గర్జించు సింహముల్‌ గడగడ వణకుచు గుహలందు తలదాచుకొనగసాగె

అడవి యేనుగులన్న్షి అడుగుల వడి బెంచి భీతితో దెసల బర్వెత్తసాగె

పడగెత్తి బుసకొట్టు పాములు సైతము వెరగంది పుట్టలు వెదుకసాగె అంతియేగాదు భీకరారణ్య మెల్ల ముంచుకొనివచ్చు ప్రకయమ్ము ముందుగానె తెలిసిపోయిన చందాన దీనయాయె చింతలో మున్గి పగలె పెంజీకటాయె.

ఎందు కిట్టులాయె? యేమిటీ విపరీత మనుచు సీత బెదరి ఆత్మ విభుని యెడదపైన వాలె! ఇనకులేశుం డామె ననునయించి దైర్య మందజేసె.

అది గమనించిన లక్ష్మ్యణు డిది యేదో దనుజ మాయ యివుడే వానిన్‌ తుద ముట్టించెద గనుడని

వదినెకు అన్నకును దెలిపి బాణము గొనియెన్‌.

అందుకొోనిన బాణ మదిరి నివ్వెరవోయి కేలనుండిజారి క్రిందపడియె; లాఘవమును మరచి లక్షణుం డాకాశ మార్గ మరసి యటులె మ్రానుపడియె.

మానవరక్తమున్‌ మంచి గంధమ్ముగా కోరి మేన పులుముకొనినవాడు

తరుణ సింహమ్ముల తలలు దండగ గూర్చి గుండెపై ధరియించు కొనినవాడు కొలిమిలో మండు బొగ్గుల వంటి గ్రుడ్లతో క్రూరత్వమును చాటుకొనెడువాడు పరమ విక్ళతముగా పెరిగి భీతిని గొల్బు బారెడు కోరల నోరువాడు

మల్లెమాల రామాయణం

12

13

అరణ్యకాండేము

తే

గీతి.

మాటిమాటికి దిక్కులు మారుమోగు లీల గర్జించి మత్తుగా దూలువాడు కానుపించెను భీకరాకారు డొకడు రూపుదాలిచి విహరించు పాపమటుల.

అతడు కాలరుద్రు డాకాననమునకు తన్ని మిత్తినైన తరుము గలడు;

లేరు వానికెదురు పేరు విరాధుడు వాని కనులు సీతపైన వాలె.

వాలినచూపు వెంటబడి వాడటు క్రూరముగా ధరాత్మజన్‌ కేలను బట్టి లేపి పరికించి యెగాదిగ జూచి, ధీరతన్‌

“ఏలర? యింత అందమగు యింతి మునీశుని వంటినీకు, బేలను నాకొసంగి యిక వెళ్ళుము వచ్చిన దారి వెంబడిన్‌.”

అనిన విరాధుని పలుకులు

వినినంతనె భయము జెంది విహ్వలమతియై జనకాత్మజ శ్రీరాముని

కనుగొని విలపించె నన్ను గావు మటంచున్‌.

అవనిజాత భీతి నారసి వెంటనే

అనురు జూచి మిగుల ఆగ్రహమున రాము డనియె! “నోరి రాక్షసాధమ! నీకు చెల్లి కాలి మనుచు విల్లునంది.

“జానకీ! నేడు వానికి చావు మూడె!

ఒక్క బాణమ్ముతో కంఠ ముత్త్లరించి

నిన్ను రక్షించుకొనియెద నన్ను నమ్ము" మనుచు బల్కెను గాంభీర్య మెనయునటుల.

శ్రీరాము శపధమ్ము చెవిని ఎడగానె దానవాధముం డరచి గర్జించి “వినరోరి! నరుడ! నీ ఘనత దగ్గించి విరాధుని జంప నెవ్వాని తరము? బ్రహ్మదేవునికె అది అసంభవము! ఆతడే సా తపసు కచ్చెరువునంది నాల్లు నాల్మలతోడ నన్ను దీవించి

ఆయుధములు నన్నేమి జెయకుండ

147

16

17

18

148

నిలువున నరికినా నే జావకుండ నాకు వరమిశ్చైెరా! కుర్రకుంక! ప్రేలడమ్ములు నీవు చాలింపు మింక” అనగానె శ్రీరాము డనుజన్ముజూచి “విన్నావుగా! వాని విక్ళతగర్ణనలు

నా బహిఃప్రాణము నా కళ్ళయెదుట అన్యపురుష స్పర్శ కగ్గమౌచుండ ఇంకనే జీవించు టెందు"కని వగచె; రాజ సింహాసనము చేజారినపుడు కంటనీరిడనట్టి కర్మసిద్ధాంతి

అమ్మ దూరమైన అర్జకునివోలె శోకించుటను కనుల జూచి లక్ష్షుడు “అగ్రజా! యేమిటా అశ్రునయనాలు నేను బ్రతికుండగా నీకేల చింత చిటికెలో వాని తల చేరునీ చెంత!” అనుచు కోపాగ్మినే అస్తముగ మలచి సంధించి వదలె నిశాచరునిపైకి

అది ప్రకయభీకరమ్మైై ముందుకురికి బురుజువలె గల వాని భుజము తెగనరిక వెంటనే దనుజు డవని కరుదెంచి చెలరేగి శూల మొకచేతనే విసరె! దాశరథి ఉగ్రుడై దాని ఖండించి

సప్త బాణము లొకేసారి సంధించి

“ఈ రామ బాణముల్‌ క్రూరాత్స్మ! నిన్ను వధియించి తీరు"నని వదలె కసితోడ: బాణముల ధాటి కసురాధముండు ఒడలి గాయాలతో పుడమిపై వాలి “శ్రీరామ నీ పేరు చెవి నెపుడు బడెనో అపుడె జ్ఞానోదయ మ్మాయె”నని మొక్కి “తొలి జన్మమున నేను తుంబురుడ రామ! అలకుబేరుని శాప మంది యిటులైతి; శ్రీహరీ! నీ వలన చెడు దొలగిపోయె నా పూర్వరూపమ్ము నాకు వశమాయె; అమ్మ! సీతామాత! అసురరూపమున నోనర్షిన పాప మింతంతగాదు!

మల్లెమాల రామాయణం

అరణ్యకాండము

మన్నింపు మని వేడ మనసురాదమ్మ! పాటతో అర్చించు ప్రణతులను గొమ్మా!” అనుచు కన్నీటితో ఆమె పాదములు అభిషేక మొనరించి ఆడె తుంబురుడు అవని సుత వెంటనే అతని దయజూచి “చిరకాల శాపమున చేసితివి తప్ప పూర్వపుణ్యము వలన పాొందితివి మెప్పు!" అనగానె తుంబురుడు “అమ్మ! నీ మనసు అప్పడెత్తిన వెన్ష అని నాకు తెలుసు మీమేలు జన్మలో నే మరువలేను”

అని రామలక్ష్షణుల కంజలి ఘటించి “ఎంతమాత్రము మీకు కాననమ్ము వాసయోగ్యము కాదు వర్ధిష్ణులార! బహుసమీపమున శరభంగు నాశ్రమము కలదు అది భూలోక కైలాస సమము! ఉదయార్శ బింబ మా యోగినెమ్మోము పొండు మీ రచ్చటికి పండు మీ నోము” అని పలికి రఘురాము నడుగులకు మొక్కి తుంబురుం డెనలేని సంబరముతోడ అంబరమ్మున కెగసి అరిగె స్వస్థలికి.

ఆ. అడవులందు తమకు అనుదిన మెదురగు అంతులేని వింత అనుభవముల ముచ్చటించుకొనుచు మువ్వురు శరభంగు నాశ్రమమ్ము దెసకు నరుగుచుండ.

ఆ. ఆకసమ్మునుండి అమరేంద్రుని రథమ్ము దివిజగణముతోడ భువికి దిగెడు వైన మరసి జానకీ నాథు డంతట అనుగు తమ్ముతోడ ననియె నిట్లు.

తే. లక్షణా! అటుచూడుమా రథము మీద దివ్యతేజో విలాసుడు దివిజవిభుడు అవని కేతెంచి శరభంగు నాశ్రమమున కరుగుచున్నాడు కారణ మరయ లేము.

149

22

23

24

25

150 మల్లెమాల రామాయణం

ఆ. అని వచించె నపుడె ఆశ్రమమ్మును జేరె భాసమానుడైన వాసవుండు! దనుజవైరి రాక తన కుటీరమునకు వర మటంచు దలచె పరమమౌని. 26

తే. అంత శరభంగు నమరేంద్రు డభినుతించి “సాధుపుంగవ! నిను బ్రహ్మ సదనమునకు తోడుకొనిపోవ నేతెంచినాడ నేను సిద్ధముగ నున్న దదిగొ! నీచెంత రథము.” 27

మ. _ అని దేవేంద్రుడు విన్షవించగనె “నీ యాహ్వానమున్‌ ద్రోసి రా జనలే నట్లని వెంటనే రథము నేనారోహముంజేయ లే ననఘా! కారణ మేనె దెల్పెదను శుద్దాత్ముండు శ్రీరాముడే నను జూడన్‌ చనుదెంచుచుండె నడుగో! నా పూర్వపుణ్యమ్మునన్‌.28

©. నీవు సైత మిచట నిలుకడగా నుండి

వారితోడ గలసి స్వాదుఫలము

లారగింప వలయు” నని తాపసేంద్రుడు

దేవవిభునితోడ దెలిపె నంత. 29 ఆ. అంతకన్ననాకు ఆనంద మేమున్న?

దయిన రాము నిప్ప డరయ దగదు!

దుష్టశిక్షణమ్ము శిష్టరక్షణమును

జరుప పుట్టినట్టి హరి యతండు. 30 ఆ. వేయికనులతోడ ఏశ్వమంతయు నేడు

సకల జీవకోటి సౌఖ్యమునకు

రాచబాటయైన రఘురాము వనవాస

సవనదర్శనమ్ము సలుపుచుండె. 31

తే. మహాయజ్ఞ్జమే రీతి రామభద్రు డాచరించునో? చివర కెట్లంత మగునో? అరయ గలవాడ కనులార ననుదినమ్ము అమర పురమున నుండియే యతివరేణ్య!” 32

తే, అనుచు వచియించి శరభంగుననుమతి గొని అమరనాథుడు రథమెక్కి యరిగె నంత రాము డనుజుడు వెంటరా రమణితోడ తరలివచ్చెను మునిసన్షిధానమునకు. 33

అరణ్యకాండము ssi తే. ముందు మువ్వురు శరభంగ మునికి మొక్కి

మహాయోగి ఆశీస్సు లందుకొనిరి;

అంత నా బ్రహ్మతేజుడు అమరవిభుని

రాక నెరిగించి మధురఫలమ్ము లొసగె. 34

తే: “ఎంతపున్నెమొ? వాసవునంతవాని పిలుపు కాదని మామీది ప్రేమతోడ నిలిచియుంటిరి - వేదనిలయమందు చోద్య మిదిగాదె? బ్రహ్మతేజోనిధాన! 35

ఆ. _ సిద్భులైన మిమ్ము సేవించి మీ చేతి ఫలము లారగించు భాగ్భమబ్జై; మౌనికులవతంస! మా జీవితమునందు ఎంత మధుర సుదిన మీ దినము.” 36

తే రఘుకులాంబుధి చంద్రుడు రాము డటుల

పలికినంతనె జానకి భర్తవంక

బ్రహ్మబషివంక జూచి అపారమైన

భక్తిభావము జాల్వార పలికి నిట్లు. 37 తే. “సన్ముతానందమయరూప! నన్న విడిచి

నిలువజాలడు నా స్వామి నిముసమైన

నేను నంతియె! కాని కాననముల

ఎప్ప డే ముప్ప గలుగునో ఎరుగజాల.” 38

తే. అనుచు కన్నుల నీరిడె నవనిజాత పరమముని ఆమె చుబుకమ్ము పట్టిలేపి “ఇడుమలను ముందె ఊహింపనేల తల్లి? భయము జెందకు మీకు శుభమ్ము గలుగు. 39

తే. రామునకు నీవు గారాల రమణి వౌట

కాకతాళీయమైనట్టి ఘటన గాదు;

పెద్ద బాధ్యత గలదు మీ పెళ్ళిపైన

నాయికవు నీవె! మహానాటకమున.” 40 ఉ. అనుచు తాపసేంద్రు డతి సత్యగర్థిత

మైన ఆశిషముల నంద జేసి

సీత నూరడించి స్థితప్రజ్ఞు డైనట్టి

ఇనకులేశుతోడ ఇట్లు లనియె. 41

152

“కాననములందు మీకు లక్ష్మణుని తోడు కోటి కన్నుల నడయాడు కోటగాన

నీవు జానకి వ్రతదీక్ష నిర్ధయముగ పూర్తిగావించి ఘనకీర్తి బొందు డిలను. ఏను వృద్ధ దేహమ్ము నీక్షణమ్మె ప్రజ్వలించెడు అగ్నిలో బారవైచి

నిత్య యౌవన రూపాన సత్యమైన బ్రహ్మలోకమ్ము జేరెద భ్రాంతి వీడి.” మౌనివరు డట్లు వచియించి మండుచున్న అగ్ని కుండమ్మునం జొచ్చె నా క్షణమ్మె; మాడి మసియాయె శరభంగ మౌని తనువు విస్మయ మృందె సీత విధము జూచి. కాలినట్టి మేను కమ్మని వాసనల్‌ మువ్వురకును పంచె ముమ్మరముగ;

పరీమళంపుటలల మధ్యము నుండి బ్రహ్మతేజి మొకటి పైకి లేచె.

తేజము నవయౌవన

చైతన్యము వెల్లివిరియు శరభంగుడుగా నూతన రూపము గైకొని

చేతోమోదమ్ము తోడ చేరెను దివికిన్‌.

అంత రాముకడకు మహారణ్యము నందు వాసమున్న వందలాది

మునులు చేరవచ్చి “ఇనకులాథీశ! మా మొరను విను” మటంచు మొక్కు లొసగి. “ఈ యరణ్య మందు ఎన్నాళ్టనుండియో ఇహసుఖముల నెల్ల ఈసడించి

ముక్తి నభిలషించి మునివ్యత్తిలోనున్న తష్టవాయె మాకు తిష్ట లెపుడు.

ఎప్పడే రక్కసుం డే మౌని ప్రాణముల్‌ బలిగొనునో యన్న భయముతోడ ఎప్పడే రాక్షసుం డే మునిపత్నిని చెరబట్టునో యన్న చింతతోడ

మల్లెమాల రామాయణు

42

43

44

45

46

47

48

అరణ్యకాండము

ఎప్బడే దానవుం డే మునిపల్లెను వేధించునో యన్న వెరపుతోడ ఎప్పుడే దితిసుతుం డే యాగశాలను తగులబెట్టునొ యన్న దిగులుతోడ తే గుండె లరచేత నిడుకొని గ్రుడ్లగూబ అరుపులను విని గూటిలో అమ్మ ఒడిని తల్లడిల్లెడు పిచ్చుక పిల్ల లటుల గడుపు చున్నాము దినదినగండములను. ఆ. రూకయైన పన్ను మీకు చెల్లించని వార మనుచు దలప వలదు మమ్ము; మానవేంద్ర! మేము మా తపోధనమందు కొంత భాగ మిచ్చుకొందు మయ్య!

ఆ. తాపసుల మటన్న దయలేక రక్కసుల్‌ కాననముల మిగుల కర్మశముగ పెట్టు నరకమునకు తట్టుకోజాలక వచ్చి మిమ్ము శరణు జొచ్దినాము.

తే కాన తత్‌క్షణమే మమ్ము కనికరించి పాపులైనట్టి దనుజులరూపు మాపి అవని ముని జన రక్షకుం డనెడు కీర్తి నందుకొనుమయ్యు! ధర్మమార్గానువర్తి!” ©. మునిగణమ్ము బాధలను విన్న రఘు వీరవరుని గుండె నీర మాయె; దుష్టదానవాళి దురితమ్ము లన్నియు కనుల ముందు మెదలి యనియె నిట్లు; శా. “వందే తాపనవీరులార వినుడీ వారంద రేకమ్ముగా ముందే నా శపథమ్ము గుర్తెరిగి యా ముక్కంటి నర్థించినన్‌ సందేహించక దుష్ట దానవతతిన్‌ సంహారమున్‌ చేసి మీ కందింతున్‌ స్థిరశాంతి సౌఖ్యములు బ్రహ్మానంద మేపారగన్‌.”

క్ర అని రామభద్రు డభయము మునివర్యుల కొసగె; వారు ముదితహృదయులై “ఇనకుల తిలకా! మే మిక చనెద” మటం చరిగి రపుడు స్వస్థలములకున్‌.

153

49

50

51

52

53

54

55

154 మల్లెమాల రామాయణం

వా రటు అరిగిన వెంటనె ధారుణిసుత పతిని జూచి “తపసుల కొరకై వైరముగొని దానవులను క్రూరముగా జంపబూనుకొన దగునె ప్రభూ! 56

తే. అత్త కైకమ్మ పుణ్యాన అడుగకుండ

పిన్న వయసున తానుగా వెంటబడిన

శాంతిమయ జీవనమ్మును జారవిడిచి

పగను గొనితెచ్చుకొననేల? పంతమేల? 57 తే. తప్పబట్టకు స్వామి! నే చెప్పదగిన

దాననా? మీకు! కాని నామానసమున

వెరపు రగులంగ జేసిన వేదనలను

దాచుకొనలేక తెలిపితి ధర్మతేజ! 58

తే ఆలుగా కాక స్మేహితురాలి లీల నెల్లవేళల నన్ను మీ యుల్లమందు నిలుపుకొని ప్రేమ పంచెడు చెలిమికాడ! ధర్మబోధగ దీనిని దలప వలదు.” 59

ఆ. _ భర్త హితవుగోరి పరమపావని సీత ఆచి తూచి వేచి అనిన మాట లాలకించి రాము డాత్మలో యోచించి అవల బలికె నిటుల ఆమెతోడ. 60

తే. “మగువ మగనికి కరణేషు మంత్రి యనెడు

దివ్యసూక్తిని జ్ఞప్తికి దెచ్చినావు;

అభిలధర్మ్య పరాయణుం డైన జనకు

పట్టి వను పేరు సార్థకపరచినావు; 61 తే కూర్మిసతి! నేడు నీవు వాకొనిన యట్లు

నేను విడనాడినది నాడు నిశ్చయముగ

రాజ్ఞ్యపాలనమేగాని రాజధర్మ

మెంతమాత్రము కాదని యెరుగు మీవు. 62

ఆ. _ కాననములనున్న కడుపేదగా నున్న ఏను క్షత్రియుండ నిది నిజమ్ము! విస్మరింప జాల విధివిధానమ్మును చేయవలయు దుష్టశిక్షణమ్ము. 63

అరణ్యకాండము

త్తే

om

అవసరమ్మని తలచిన నవని గలుగు అన్షి బంధాల నవలీల నవలద్రోసి అనుజనిన్‌ నిన్ను వీడెద నంతెగాని క్షాత్రధర్మము వీడ నిస్గ్థంశయముగ.”

అని రాముడు దృఢ నిశ్చయ

మున బలికిన లక్షణుండు “మునిజనవంద్నా!

వనితారత్నము వదినెను నను వేరుగ దలప నీకు నాయ మ్మగునే?

నీవొక నిర్ణయమ్ముగొని, నిశ్చలతత్వముతోడనేర మే

మేవిధి నన్మమార్గ్లమున నేగగలారము నిన్నువీడి. నీ

సేవయె దైవదత్తమగు జీవన భాగ్యవిశేషమంచు మా భావమునం దలంచి నిను ప్రాణ సమమ్ముగ గొల్తు మగ్రజా”

అని లక్షణు డని నంతగణె

అనునయమున గరామబభద్రు డవనిజను గనెన్‌

వనజాక్షి జానకీసతి

కనుగొలకుల నీరు గ్రమ్మగా నిట్లనియెన్‌ “పలుక వలదు స్వామి పరిహాసమునకైన నోట నన్ను వీడు మాట మరల

ఎన్ని యిడుమలైన యేనోర్జెదను గాని నిన్ను విడిచి క్షణము నిలువ గలనె? సీతకంటినీరు స్థిరచిత్తుడైనట్టి

రామభద్రు నంతరంగమందు

కలతరేపె నంత జలజాయతాక్రిని

బుగ్గ నిమిరి యిటుల బుజ్జగించి.

“నీ కనులు చెమ్మగిల్లిన నా కన్నులు చూడగలవె? నళినదళాక్షీ! చీకాకునోంది నే నటు వాకొంటిని గాని నిన్ను వదలం గలనే?”

అని రాముడు ముద్దుల సతి

ననుజుని నోదార్థి తన్ను అర్థించిన యా మునులను మనమున దలచుచు చనియె సుతీక్షాశ్రమమ్ము సన్నిధికి వడిన్‌.

155

64

eg a

i

59

wm}

Ek

156

ge

మల్లెమాల రామాయణం

అట్టు లామౌనివరుని దివ్యాశ్రమమును

చేరినంతనె వారిని చేరదీసి

పూజజేసి సుతీక్షు డవ్మాజమైన

ప్రేమ వర్షించి కమ్మని విందొనర్జె. 72 రాతి రచట గడపిన

శ్రీరాముడు లక్షణుండు సీతయు మరునా

డారమ్మగుణు యతీంద్రుని

కారుణ్యపు దీవెనలను గైకొని రంతన్‌. 73

దాశరథి కడుభక్తితో “తాపసేంద్ర!

మమ్ము మీ బిడ్డలట్టుల మది దలంచి

వనములను మాకు మిక్కిలి వాసయోగ్య

మైన నెలవును సెలవిం డటంచు వేడే. 74

అంతనా సుతీక్షు డానంద మేపార

“ఈ వెరుంగ వేమొ యినకులేశ!

యరణ్యమందు హాయిగా మీరుండ

దగిన నెలవు గలదు దాపులోనె. 75

కలదు వనమందె అగస్మమౌని

ఆశ్రమమ్మది మిక్కిలి అందమైన

చోటు మాత్రమె కాదు యశోవిశాల!

పారవశ్యము గొల్బు నా పరిసరములు. 76

నిర్మలోదకములు నిండిన కొలకులం దలవోకగా నాడు అంబుజములు అలరులే అపరంజి ఆభరణాలుగా రంజిల్లు మేలి నికుంజతతులు భువనమోహనమైన భూధరాగ్రములను నిలువెల్ల ముద్దాడు నీరఠదములు నయన మోహనమైన నడకతో అడవికి చెలువమ్ము పెంచెడు చిన్న నదులు పిల్లగాలి తరంగాల ప్రేరణమున వేదనాదము లొలికించు వెదురుపాదలు అరసి తరియింప వలెగాని ఆదిశేషు డైన చాలడు వర్లింప అవనినాథ! TD

అరణ్యకాండము

ఆ.

ge

త్వరితగతిని మీరు బయలుదేరితిరేని అసుర సంధ్భ వేళ కచట జేరి

మహాతపస్వి అతిథఖిమర్శాదలు స్వీకరించి విడిది జేయవచ్చు.

తూరుపు తెలవారగనే

వారే మీ మన సెరింగి వసియించుటకై

రామసీమ అనువగు

నారమణీయ ప్రదేశ మపుడే దెలుపున్‌.” అని సుతీక్షుడు దెలిపిన అన్నదమ్ము లిరువురును సీత మిక్కిలిమురిసి నతుల శతము లర్జించి భజియించి యతివరేణ్యు అనుమతింగొని కదలిరి యచటినుండి.

జానకీనాథు దివ్యతేజస్సు వలన క్రూూరమ్యగములు తమ నైజ గుణము లెల్ల వీడి ప్రేమానురాగముల్‌ వెల్లివిరియ

మహాత్ముని అడుగుల ననుసరించి.

అది జూచిన సీతమ్మకు హృదయము ద్రవియించి జీవితేశ్వరుతోడన్‌ ముదమాపు కొనం జాలక

మృ్యదుమధురములైన నుడుల మెల్లగ ననియెన్‌.

“స్వామి మీవెంట నేను లక్షణుడె గాదు అదిగొ! అటుచూడు డీవిపినాంతరమున సంచరించెడు వనసత్త్వజాల మెల్ల వైరములు మాని బుద్దిగా వచ్చుచుండే.

కొదమసింగమ్ములు మదపుటేనుగులపై కూర్మితో రీవిగా కొలువుదీరె! చిరుతపులుల మీద చిన్నారిజింకలు కుతుక మింపెసలార కూరుచుండె! తోడేళ్ళ మేకలు తోబుట్టువులలీల జంటబాయక వెంట సాగుచుండే పక్షిరాజమ్ముల పసిడిరెక్కలమీద కోడెనాగులు నాట్యమాడుచుండె!

157

78

79:

80

81

82

83

158

&

అంతమాత్రమెకాదు భయంకరమగు క్రూరమృ్యగములు నడిచెడు దారిలోనె వందలకొలంది మునులును వచ్ముచుండి రింతకన్న్షను వింత మరేమి గలదు?"

అనిన జానకి గని రాము డతిముదమున “అవనిజా! నీ తలంపు నా కర్థమాయె: వన్యమృగములు తమ తమ వైరములను మరచుటకు కారణమ్ము నా మహిమగాదు.

ప్రియసఖీ! చూడు మాకనుపించునదియె పర్వతములందు నిన్నయై పరగునట్టి వింధ్యపర్వత మద్దని వింతగాధ శ్రవణపేయము మిగుల ఆసక్తికరము.

నింగినేల గలియు భంగి విజృంభించి ఇనుని కడ్డ మగుచు నెదుగుచున్న

మహానగమ్ము నణగద్రొక్కె నగస్త్ము డదను జూచి దాని మదమడంగ. మేటి బుషికుల తిలకుడా నాటినుండి

స్థిర నివాసము నిచట నేర్చరచుకొనియె; మహాత్ముని దివ్వ మహత్తు వలన

మృగము లన్నియు చెలిమితో మెలగుచుండెే.

అందువలన వారి ఆశ్రమప్రాంతము నందు దానవాళి అడుగుమోప సాహసించలేదు - సాధుపుంగవులును భయము సుంతలేక బ్రతుకుచుంద్రు.

మన మింక మహాముని దినచర్యలనెల్ల తనివిదీరెడు రీతిన్‌ గనవచ్చు వారి బోధలు

వినవచ్చును కొన్ని నాళ్ళ వేడుక మీరన్‌.

తమ్ముడా! నీవు ముందుగా తరలివెళ్ళి జానకియు నేను వారి దర్శనము గోరి వచ్చి యిచ్లోట నున్నట్టి వార్త దెలిపి అనుమతింగొని వేగ రమ్మనుచు బలికె.

మల్లెమాల రామాయణం

84

85

86

87

88

89

90

91

అరణ్యకాండము 159

తే అన్న ఆదేశమును మౌళియందు దాల్చి లక్షణు డగస్మ్రముని కుటీరమ్ము చేరి స్వామి! మీ దర్శనార్థము రామభద్రు డవనిజయు వచ్చి నను బంపి రనుమతిగొన. 92

ఆ. మహానుభావుననుగుతమ్ముడ నేను పేరు లక్షణుండు ప్రేమతోడ వారి సేవ జేయ వచ్చితి నడవికి” అనుచు బలికి భక్తి నంజలించె. 9౩

అంత నగస్ముడు లక్షణు సంతసమున జేరదీసి “సౌమిత్రి! నీ వింతగ నుడువం బనిలే దంతయు నా కవగతమ్మె” యని దీవించెన్‌. 94

ఉ. కారణజన్ములీ పగిది కష్టము లించుక లెక్కసేయకీ దారుణమైన కానన పథమ్ముల వెంబడి సంచరించినన్‌ జేరగవచ్చు టెంతయు విశేషముగా దలపోయు చుంటి నో కూరిమి శిష్ములార! చని కోసలనాథుని తోడితెం డికన్‌." 95

అని ప్రియశిష్మ్యలతో ముని అనినంతనె వారు మిగుల ఆనందముతో చని, ఇనకులేశు సీతను గని పదముల నంటి మొక్కి కారుణ్యనిధీ! 96

తే. పరమగురు డగస్తుడు మమ్ము పంపె నిటకు తల్లి సీతమ్మయును మీరు తత్‌క్షణమ్మె ఆశ్రమమునకు దయతోడ నరుగుదెంచి వారి సత్మారమందుకోవలయు ననిరి. 97

తే. లక్ష్మణార్యుని తన కుటీరమ్మునందె నిలుపుకొన్నాడు మా గురు డలఘుచరిత! అనిన వెంటనె శ్రీరాము డటులె యనుచు వెడలె సీతాసమేతుడై వేగిరమున . 98

తే. సాధుతిలకు డగస్తు డాశ్రమము వదలి కదలి యెదురేగి మునిజనగణము తోడ స్వాగతము బలి శ్రీరామచంద్రమూర్తి నవనిజను తోడుకొనివచ్చె నంతలోన. 99

160

పూల వాన గురిసె పుణ్యదంపతులపై మౌనివరుని దివ్యమహిమ వలన ఎంతమంచి శకున మిదియని సీతమ్మ పరవశించి కూర్చిపతిని జూచె.

రాము కంటికి ముద్దుల రమణి సీత అతిమనోహర సుమశిల్బ మటుల దోచె అంతరంగపుటనుభూతి ననుగుసతికి పరమపూజ్యడు క్రీగంట నెరుగజేసె.

కథలు జెప్కనట్టి కనులతో నాయిద్ద రటుల ముచ్చటించుటరసి మురిసి ఆశ్రమమ్ము సలిపె నానందలాస్థ్రము మువ్వలాయె! నడవి గువ్వలన్ని

అది గమనించి అగస్తుడు

సుదతీమణి సీతతోడ “చూడుము తల్లీ! ఇది నీ పుట్టిల్లనుకొని

కుదురుగ నీవుండవచ్చు కొన్మాళ్ళిచటన్‌.”

అని మౌనికులవతంసుం

డనినంతనె సీత మురిసి ఆకత్తేశునితో “అనుకొనకయె లభియించెను వనమున మీకొక్క అత్తవారి”ల్లనియెన్‌.

అంత అర్థాంగి మాటల ఆర్థమెరిగి రామభద్రుడు “సీత! నీ ప్రేమవలన అత్తయే లేని నాకొక అత్తవారి

ఇల్లు దొరికిన దడవిలో యుల్ల మలర.”

అనిన రాముని యుచితోక్తి నాలకించి పొంగిపోయిన మునిపుంగవుండు “ల్రోకమాన్య్ముడ! నేడు మీ రాకవలన అపర వైకుంఠ మాయె! నా ఆశ్రమమ్ము.

అలసియున్నార లించుక ఆదమరచి సేదదేరుడు ఇంతలో చెట్లనుండి

అపుడె రాలిన పండ్లు మా అనుగు శిష్య లేరికొని తెచ్చి మీకిత్తు రారగింప.

మల్లెమాల రామాయణం

100

101

103

104

105

106

107

అరణ్యకాండము

తే, వార లరుదెంచు లోపల పరమపురుష! నేను పూజాదికములను నిర్వహించి వచ్చెద” నటంచు బల్మి సచ్చరిత్రు డేగె లోనికి తలవంచి వేగిరముగ.

ఆ. నడచివచ్చినట్టి బడలిక పూర్తిగా మౌని నీడ సోకి మాయ మాయె; కాన లోన జరుగు కార్యాల దిలకింప మనను గలిగె ననియె! మగువ సీత.

తే. అనుగు దేవేరి కోరిక కపుడు రాము డడ్డుజెప్టక తలయూచె నంతలోనె వేదమంత్రాలు వినిపించె వీను లలర వెంటనే మువ్వురేగి రావిధము జూడ.

తే. _ వారులోనికి వచ్చిన వైన మరసి ఆజ్యమిడకయె జ్వలియించె ననలు డపుడు మునివరుం డది గమనించి కనులు దెరచె రామదేవుడు కన్ఫించె హోమశిఖల.

క. శ్రీతులసీ దళదాముడు ప్రాత ఫరణీయుడైన పరమాత్ముడుగా తపసికి దర్శన మిడె చేతము పరవశత జెంది చేతులు మోడెన్‌.

తే. తన్నుతాను మరచి కన్నుల నరమోడ్డి ఏకధాటి మౌని లోకవంద్యు నగ్ని శిఖల నడుమ నవలోకనముచేసి జన్మధనృమైన నరణి మురిసె.

ఆ. అతిథులెపుడు చెంత కరుదెంచిరన్నది యతివరేణ్యుడెరుగ డింతగూడ అటులె అగ్మిలోన అతడేమి గాంచెనో ఎరుగరైరి మువ్వు రింతయేని. అంత కొంతవడికి అగ్నిపూజి ముగించి పైకిలేచి మౌని పారజూచి వేళ మించె లెండు విందారగింతము అనుచు ప్రీతి బలికె నంతలోనె.

161

108

109

110

2

113

114

162 మల్లెమాల రామాయణం

ఆ. శిష్మ లరుగుదెంచి చేతులు జోడించి తెచ్చినాము చాల తీయనైన కందమూలములను కమ్మని పండ్లను అనుచు విన్నవించి రపుడు మౌని. 116

తే అన్నియును తానె స్వయముగా అందజేసి మునుల వలెనున్న దేవతామూర్తులార! తినుడు దయచేసి మీకు ఆతిథ్య మొసగు భాగ్య మొనగూడె! నిది నాకు బ్రహ్మవరము. 117

ఆ. అనిన మునివతంసు నాత్మీయతను మెచ్చి

వారి తోడ విందు నారగించి

రంత సీతలేచి యతీంద్రుని పాద

పద్మములకు మొక్కి పలికె నిట్లు. 118 ఆ. “కన్నతండ్రి కన్న మిన్నగా నను జూచి

ప్రేమ పంచినట్టి మహాత్మ!

నేను కాననముల నిత్స సుమంగళి

నయి చరించు నరము నా కొసగుము" 119

ఆ. అనుచు వేడుకొనిన అవనిజ శిరమును మెల్లమెల్ల నిమిరి “తల్లి! వినుము భయము వలదు నీవు పనుపు కుంకుమలతో నిండు జీవితమును నెరప గలవు.” 120

ఆ. అనిన మౌనివాక్కు నపరవేదమ్ముగా దలచి సీతమనసు తన్మయత్వ మందె రామమూర్తి అది గాంచి మదిలోనె సుదతి నభినుతించి శుభము పలికి. 121

క. తదనంతర మృ్మగస్తుడు ముదమున శ్రీరాము శిరము మూర్కొని “రామా! ఇది బ్రహ్మ నా కొసంగిన పదిలమ్మగు వజ్రఖచిత వరమని యనుచున్‌. 122

ఇ, అమితశక్తిమంతమైన ధనువును ప్రీతిమీర రాముచేత నుంచి అనుపమానమైన అక్షయతూణీర ములను గూడ కానుకలుగ నొసగె. 123

అరణ్యకాండము

do

163

అవియెగాక మరల అపరంజి ఒరలోన

కాంతు లీనుచున్న ఖడ్లరాజు

మొండు దెచ్చి యిచ్చి “యుర్వినాథా! దీని

నింద్రు డిచ్చై నాకు నిదియు నీదె. 124

అద్వితీయములైన ఆయుధములు

యోధవర్యుడ! నీ వద్ద నుండెనేని

అన్ని వేళల జయము నిన్నంటియుండు

కదనమందున చచ్చ రాకాసిదండు.” 125

అని మౌనీంద్రు డొసంగిన

ఘనతర శస్తాస్తములను గైకొని భక్తిన్‌

ఇనకుల వననిధి సోముం

“డనఘా! మీ బుణము దీర్చ నగునే” యనియెన్‌ 126

దశరథాతజు పలుకులు తాపసేంద్రు

నతులితానంద వారాశియందు దేల్చై

ఎదురుగా నున్న జానకి వదన మరసి

ఏమిదోచెనో? రాముతో నిట్టు లనియె. 127

“పురుటినొప్పలు లేక భూదేవి కన్నట్టి చిన్నారి పాన్నారి చిట్టితల్లి

అపరంజి ఊయెల కందాలు గూర్షుచు జోలపాటలు విన్న బాల లక్ష్మి

తల్లియు దండ్రియు తానౌచు జనకుండు ముదమార బెంచిన ముద్దుపాప కాలుకందని లీల పూలతోటలలోన చెలులతో ఆడిన చిగురుబోడి

నిన్న పెండ్లాడి రఘువంశనేతయైన కోసలాధీశు కోడలై వాసికక్కి

ఇపుడు నీవెంట విపినాల కేగుదెంచె పూవు నెడబాసి యెరుగని తావివోలె. 128

బాలరసాల సాల నవపల్లవ కోమలయైన బిడ్డ పా

దాలకు కర్కశాటవి పథమ్ములు చేసెడు నెత్తురోడు గా

యాలను గాంచి గుండె లవియన్‌, విలపించెడు నేల తల్లినే

లీలను ఊరడించెదవో?. లేశ మెరుంగగ జాల రెవ్వరున్‌. 129

164

సూ

సహజముగ స్త్రీలు తమభర్త నహరహమ్ము పట్టుబట్టలు దెమ్మని పసిడినగలు

కొని యొసంగు మటంచును కోరుచుంద్రు అద్ది వెపుడైన కోరెనే అవనిజాత.

విమల సౌధములను వీడి నీతో గూడి పర్ణ్లశాలలనుంట భాగ్య మనుచు పన్షీటి జలకాల వదలి నీతో గూడి సెలయేళ్ళ మునుగుటే శ్రేష్ట మనుచు పంచభక్ష్మాదుల వదలి నీతో గూడి తిను కందమూలాలె తీయ ననుచు వెలలేని పాన్గుల వీడి నీతో గూడి శయనించు భూశయ్య నయ మటంచు మేలి భోగాల నెల్లను కాలదన్ని

సతికి పతిసేవ ఉత్తమ వ్రత మటంచు ఛాయ విధమున నిన్నె: బాయకుండ కలసి నడచెడు సీతకు కలరె? సాటి.

సత్య శీలమునందు సంస్కారమందు శాంతి సౌజన్యములయందు సహనమందు వినయ గుణమందు సాధువర్తనమునందు యరుంధతి వంటిటీ అవనిజాత.

ఆమె కెట్టి కష్ట మంటకుండగ నీవు కూర్మితోడ జూచుకొనగ వలయు; ధర్మబద్ధమైన దాంపత్యమునకు మీ జంట లక్ష్య మౌచు సాగవలయు.

సిద్భులైన వారు చిరుదివ్వె వెలిగింప వెలుగు లోకమంత విస్తరించు? కాన మీరొనర్షు కార్య మెంతటిదైన ఫలము విశ్వమంత పరిమళించు.”

అనుచు ధర్ష్మసూక్తి నా యతీంద్రుడు తెర్టె నంత రామచంద్రు డడిగె మునిని

సాధు జీవనమ్ము సలుపుట కనువగు చోటు మీరె మాకు చూపు డనుచు.

మల్లెమాల రామాయణం

130

131

132

133

134

135

అరణ్యకాండము 165 ఆ. “వనములందు మీకు వాసయోగ్యమ్మైన

ప్రాంత మేదియనిన పంచవటియె!

అచటి కేగి నేడె అందమ్ముగా నొక్క

పర్ణశాల నేరుపరచుకొనుడు. 136

అచ్చట గోదావరి కడు ముచ్చటగా బారుచుండు మోదుగుపూలున్‌ విచ్చకయె పరిమళించును పచ్చదనము పల్లవించు ప్రతిబుతువందున్‌.” 137

అని ప్రియమార వచించిన మునివరునకు ధన్యవాదములు దెల్లి వడిన్‌ చని రచటినుండి కమ్మని అనుభూతులు వెంటనడువ నా పుణ్ళాత్ముల్‌. 138

శ్రీరాముని బ్యృందమ్మా ఘోరారణ్యమున జనుచు కొండొకచోటన్‌ బారెడు రెక్కలుగల మగ ధీరుని ఖగనాథు నరసి దిగ్భ్రమ జెందెన్‌. 139

తే. వార లాశ్చర్యముగ తనవంక జూచు తీరు నారసి ఆతడే చేరవచ్చి “నారచీరల కెనలేని నాణె మలదు చున్న మిము గాంచి మరచితి నన్ను నేను. 140

తే. భువన మోహనులైన మీ రెవరు స్వామి? ఇట్టు లడవుల చరియింప హేతు వేమి?” అనుచు కన్నులె కరములై యలరునటుల మొక్కులిడి వేడె శ్రీరామమూర్తి నతడు. 141

తే రాము డంతట నా పక్షిరాణా నరసి సలలితమ్ముగ వివరముల్‌ దెలియజేసె: అంత ఖగపతి రెక్కల నట్టెలేపి తనువు పులకింపగా ప్రదక్షిణము జేసి. 142

ఆ. “పూత చరిత! నేను మీ తండ్రి చెలికాడ! నను జటాయువందు రనుదినమ్ము దలచుచుందు మదిని దశరథరాజేంద్రు నతని రూపమునకు అద్ద మీవు. 143

166

పంచవటియందు మీకు కావలసినట్టి సకలసౌకర్యములు నేను సంతరించి పెట్టు భాగ్యము నాకిడ వేడుచుంటి రమ్మగుణసాంద్ర! జానకీరామచంద్ర!

అయిదు వటవ్యక్ష రాజము లచట గలవు ప్రకృతి సైతము కడు సుందరముగ నుండు; రామభూపతి! నేనును లక్షణుడును

కలసి నిర్మింతు మాకుల కట్టడమును.

అందులోన మీరు అందాల మా లక్ష్మి సీత కలసి చీకు చింతలేక అండబాయనట్టి అడవి గువ్వలలీల గడుపవచ్చు దినము క్షణమువోలె.

ఎచట మీరు పాద మిడుదురో అచ్చట మండుటెండ గూడ పండువెన్నె లౌనటంచు మౌను లనుకొనుచుండగా వను లలర నేను వింటినయ!

అవనినాథ! మీర లనుమతించెదరేని పరమశోభ లీను పంచవటికి

నింగి మార్గమందు నే ముందుగా పోయి స్వాగతించెద సహచరులతోడ.”

అనుచు విన్నవించి చనె వాయువేగాన భవ్య చరితుడైన పక్షిరాజు

అతని భక్తి శ్రద్ద లవనిజ కన్నుల తన్మయతనుబెంచి తడిని నింపె.

తదనంతర మా మువ్వురు

ముదమే చెలికాని వోలె ముందు నడువగా పదపదమని వడివడిగా

కదలిరి అటనుండి తీపికబురులు చెలగన్‌.

కబురు లన్ని కడకు కమ్మని కథలాయె చెప్పనట్టి ఘనత సీతదాయె;

ఆలకించువంతు అన్నదమ్ముల దాయె అరసి మురియు భాగ్య మడవిదాయె.

మల్లెమాల రామాయణం

144

145

146

147

148

149

150

151

అరణ్యకాండము

తే.

సరససల్లాపములతోడ సాగినట్టి

వారి ఉల్లాసయానము పంచవటికి జనెడు వేళకు సూర్యు డస్తాబి జేరి సందెవెలుగులు వెదజల్లి స్వాగతించె. పక్కిరాజు తాను ముక్కుతో అల్లిన ముచ్చటైన గడ్డిపూలమాల

లటులె దెచ్చి భక్తి నా మువ్వురకు వేసి శిరమువంచి మొక్కి చెప్పె నిట్లు. “అడవి మల్లెమొగ్గ లందమ్ముగా పేర్చి నడుమ నందివర్ధ్థనాలు పాదిగి

చాల మెత్తనైన శయ్య మీకోసము పరమపురుష! సిద్ధపరచినాను. దశరథాత్మజ! మీరు సీతమ్మతోడ

కడు ముదమ్మున నా పూల పడుకమీద విశ్రమింపుడు భయమును బిడియ ముడిగి రాత్రి కాపుందు మేనును లక్షణుండు.”

అనిన వెంటనె జంట ఆరుబయట పండువెన్నెల పందిట పరచియున్న పూలపానువుపై వాలి మేలుకొనియె కన దొడంగిరి కమ్మని కలల నెన్మొ

అందులో నొక కల అలనాటి తొలిరేయి ముచ్చటల్‌ విరివిగా ముందుబోసె! అందులో నొకకల అవ్యక్తమధురమౌ అనుభూతు లెదపైన ఆరబోసె

అందులో నొకకల ఆలింగనాలకు గుసగుసల్‌ జతచేసి కూర్చిపెంచె! అందులో నొకకల ఆనంద జలకేళి గుట్టును కుదిలించి కుష్టవోసె

కాని కల లన్నియు కలసి కనిరో! వేరువేరుగ కనిరొ యెవ్వారి కెరుక? ఒకటి మాత్రము నిజము వా రొకరి నొకరు మరచిపోయిరి పూసెజ్జి మహిమ వలన.

167

152

153

154

155

156

157

168 మల్లెమాల రామాయణం

తే. అంతలో పక్షి రాబేంద్రు డరుగు దెంచి దోరమాగిన ఫలముల నేరి కోరి తెచ్చితిని తల్లి అనగానె తెప్పరిల్లి ఉలికిపడి లేచిరా యిద్ద రొక్కమారె. 158

తే. లక్ష్మణుడు గూడ కందమూలములు దెచ్చె అపుడు నల్వురు కలసి విందారగించి పలువిధము లైన ముచ్చటల్‌ పంచుకొనిరి అంత జానకి హాయని ఆవులించె. 159

అది గమనించిన లక్ష్మణు

డిది నిద్దురవేళ యనుచు నెరిగించకయే

వదినమ్మ తెలియ జెప్పెను

పద పోద మటంచు బలికె! పక్షీంద్రునితో. 160 తే అంత నాయిద్దరటనుండి కొంతదూర

మరిగి నిద్రను పూర్తిగా తరిమికొట్టి

అలసి పవళించి యున్న ఆలుమగల

కొరకు కాపుండి రెనలేని కూర్మితోడ. 161

ఆ. నలిగి చెదరినట్టి అలరుల పాన్సుపై తావు మరచి నిదురబోవుచున్న ప్రేమజంట నరసి బెబ్బులి యొక్కటి పరవశించి అచటె పక్క బరచె. 162

అ. పక్కబరచెగాని ఒక్క క్షణమైన కునుకు దీయలేదు క్రూరమ్యగము ఇతర దుష్ట మ్యగము లేవైన యరుదెంచి వారి కెగ్గుసేయ వచ్చు ననుచు. 163

తే. అటులె వేకువ వరకు కన్నార్హకుండ కాపుగా నుండి పక్షుల కలకలములు చెవిని బడగానె వ్యాఘ్రము శీఘ్రుగతిని వెడలె నెనలేని తృప్తితో అడవిదరికి. 164

తే. తడవ తడనకు పక్షి సంతాన మటుల కలకలారావములతోడ కమ్మదనము జాలువారెడు మేల్కొల్బు లాలపించె నిదుర దంపతుల్ల వీడి నిష్త్కమించె. 165

అరణ్యకాండము

తే

అపుడు కన్నులు తెరచిరా ఆలుమగలు ముందు సీతమ్మ రాముని మోము జూచె! అటులె రామయ్య సీతముఖారవింద మరసె తొలుదొల్హ్ల చిరునగవంకురింప.

అంత లక్షణుండు అన్నయు వదినెయు కోరి యెన్ముకొన్న కొండపైన అడవి కనులు చెదరునట్లు నిర్మించెను లోకమెల్ల మెచ్చు ఆకుటిల్లు.

పర్ణశాల గట్టుపనిలోన తొలినుండి పక్షిగణము మిగుల భక్తితోడ సాయమంద జేసె సకల విధాలుగా శ్రమను విస్మరించి లక్ష్మణునకు. మట్టిముద్దలు పేర్చి కట్టిన గోడలు తడియారకయె వింత తళుకు లీనె వెదురు బొంగులపైన కుదురుగా కొలువైన పైకప్పు రెల్లుకు వాసి పెంచె

కడు మనోహరమైన గంధపు వాకిళ్ళు మలయ మారుతముల మనను దోచె కలపతో చుట్టూర గట్టిన ప్రాకార

మడవి మృగమ్ముల నడల జేసె పర్ణశాలకు ముందు ఏర్ప్దరచినట్టి రెండు అరుగులు మౌనుల రండు రండ టంచు నాహ్వానమును బల్కినట్టులుండె ఎపుడు నేర్చెనొ లక్ష్మణు డిన్షి కళలు. అన్న వదినెల కారీతి అందమైన ఘనకుటీరము భక్తితో నొనర జేసి తనకు వేరుగ సౌమిత్రి దాపునందె కట్టుకొనె నొక్క చక్కని చుట్టు గుడిసె. అంత శ్రీరాముడును సీత అరుగుదెంచి పర్ణశాలను కనులార పారజూచి లక్ష్మణుని కార్యదీక్షకు లలితమైన

శిల్ద నైపుణ్యమునకు నిశ్రేష లైరి

169

166

167

168

169

170

త్రై

సంతసము నాపుకొనలేక చెంతనున్న

మరది నారసి సీతమ్మ “మాకు నీవు

వైవ మొసగిన బిడ్డవు ధర్మచరిత!

దానికీ పర్ణశాలయే దర్భణమ్ము.”

అనిన వదినమ్మ మాటల కతడు మురిసి “అంత పున్షైెము మరుజన్మకైన నాకు

అబ్బవలె నని ప్రార్థింతు నన్న నెపుడు

అటులె యగు నని దీవింపు మమ్మ! నన్ను” అని వచియించిన లక్షు

వినయమునకు మురిసి సీత “విమలాతుడ! నీ వనినది జరుగగ వలెనని

అనుదినమును వేడుకొందు నా పరమాత్త్మున్‌.”

అంతలోనె యేదొ అవు అంబాయన్న చిన్నశబ్ద మొకటి చెవిని బడియె; తిరిగి చూచుసరికి పరిసరా లన్నియు జినగణమ్ముతోడ మునిగియుండె.

ఒకవంక మునిపత్న లకలంకమగు నర్చ నాద్రవ్యముల గొని నడచుచుండ! ఒకవంక మునులంత ఓంకార నాదముల్‌ సంబరమ్మున వెదజల్లుచుండ

ఒకవంక జనపదు లుల్లాన మూతగా పండ్లకావిళ్ళతో వచ్చుచుండ

ఒకవంక భిల్లు లత్ముత్తాహ భరితులై తినుబండములు గొని తెచ్చుచుండ ఆకసమ్మున రెక్క లల్లారకొనుచు పక్షిరాజు జటాయువు పర్ణశాల

దరికి ఏతెంచి రాము పాదాలమోల వ్రాలి నిలువున పులకించి పలికె నిట్లు. తల్లి సీతమ్మ కిష్టమై తనరునట్లు

రూపు దాల్చిన కొత్తింటిలోన మీరు పదము మోపెడు శుభవేళ పాలుపంచు కొను తలంపున వచ్చె నీ జనగణమ్ము.

మల్లెమాల రామాయణం

172

173

174

175

176

177

అరణ్యకాండము

క్ర

అనినంత నందరొకటై

ఘనముగ శాస్త్రోక్త విధులు గావించి, గృహ మ్మున దంపతులను జేర్ణిరి

అనయము గుర్తుండు నట్టు లపురూపముగా.

అంత లక్ష ణుండు అందరికిని సహ పంక్తి భోజనమ్ము భక్తితోడ నొనరజేసె! సీత ఉత్గాహభరితయై వడ్డన మ్మొనర్జె వైభవముగ.

అపుడు రాముని, లక్ష్మణు, నవనిసుతను అతిథు లందరు దీవించి అభినుతించి సెలవురైకొని తమ తమ నెలవులకును తరలిపోయిరి తన్మయత్త్వమ్ముతోడ. పర్ణశాల నా పుణ్యదంపతుల జేర్చి

దేనికిని లోటులేని సంతృప్తి గూర్చి

వారి యనుమతి గొని వెళ్ళి వత్తు ననుచు చేరె లక్ష్మణు డతని కుటీరమునకు.

మరునా డరుణోదయమున

ధరణీసుత స్వఛ్చమైన ధవళాంబరముల్‌ ధరియించి ప్రాంగణమ్మున

తిరుగుచు నానంద జలధి దేలుచునుండెన్‌. పర్ణశాల యెదుట పనస వృక్షము మీద కొలువుదీరియున్న ఎలుగుబంటి అవనిజాత నరసి ప్రక్కనేయున్న పక్వమైన యొక్క పండు ద్రుంచె. ఎలుగుబంటి చేత లెరుగని సీతమ్మ తీరుబడిగ భర్త దెలియజేయు

ఊసు లన్ని వినుచు ఒక్కచో నిలబడి భయము నందె నెలుగుబంటి నరసి.

ఆమె యెంతగ భీతిల్లై నంతవడిగ

పరుగు పరుగున గెంతుచు పనస ఫలము చంక నిడుకొని మిక్కిలి సంతసమున వచ్చు ఎలుగును గని సీత వణక దొడగె.

171

178

T79

180

181

182

184